ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ బాలాసాహెబ్ థాకరే వర్ధంతి సందర్బంగా ప్రధానమంత్రి నివాళులు

మహారాష్ట్ర అభివృద్ధి చెందాలనే ఆశయ సాదనకు, మరాఠీ ప్రజలకు సాధికారిత కల్పనకు పాటుపడిన దార్శనికుడు థాకరే: ప్రధానమంత్రి

Posted On: 17 NOV 2024 1:22PM by PIB Hyderabad

శ్రీ బాలాసాహెబ్ థాకరే జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ థాకరే జీ ఒక దార్శనికుడు, మహారాష్ట్ర అభివృద్ధి ని సాధించాలి అనే ఆశయ సాధనకు, మరాఠీ ప్రజానీకానికి సాధికారితను కల్పించడానికి ఆయన కృషి చేశారు అని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని పొందుపరిచిన ఒక సందేశంలో, ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘మహనీయుడు బాలాసాహెబ్ థాకరే జీ కి ఆయన వర్ధంతి సందర్భంగా నేను గౌరవపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. ఆయన మహారాష్ట్ర అభివృద్ధి సాధనకు, మరాఠీ ప్రజలకు సాధికారిత కల్పనకు  కృషి చేశారు.  భారతీయ సంస్కృతిని, విలువలను వర్ధిల్లజేస్తూ ఉండాలని థాకరే జీ దృఢంగా విశ్వసించారు. ధాకరే జీ వినిపించిన ధీర గంభీర స్వరం, తనకున్న ధ్యేయాల పట్ల ఆయన కనబర్చిన మొక్కవోని అంకిత భావం తరాల తరబడి ప్రేరణను అందిస్తూనే ఉంటాయి.’’   

 

 

 

***

MJPS/SR


(Release ID: 2074139) Visitor Counter : 18