హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న సీఐఎస్ఎఫ్ తొలి బెటాలియన్ కు ప్రభుత్వ ఆమోదం: కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

సీఐఎస్ఎఫ్ లో మహిళల తొలి సేనాదళం ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం ఆమోద ముద్ర;

దేశ నిర్మాణంలో ప్రతి రంగంలోనూ మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలన్నప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత దిశలో ఇది ఓ గట్టి ముందడుగు

విమానాశ్రయాలు, మెట్రో రైళ్ళు వంటి కీలక వ్యవస్థల పరిరక్షణ బాధ్యత తీసుకోవడంతో పాటు
కమాండోలుగా ఉంటూ వీఐపీలకూ భద్రతను అందించనున్న మహిళల విశిష్ట సేనాదళం

దేశ పరిరక్షణ అనే కీలక కార్యాచరణలో తామూ పాల్గొనాలన్న మరింత మంది మహిళల ఆకాంక్షలు నెరవేరడానికి తప్పక తోడ్పడనుంది ఈ నిర్ణయం

Posted On: 13 NOV 2024 3:27PM by PIB Hyderabad

కేంద్రీయ పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) లో అందరూ మహిళలే ఉండే బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా చెప్పారు.

 

 

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఈ కింది విధంగా పేర్కొన్నారు:

 

‘‘దేశ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్క రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ దార్శనికతను సాకారం చేసే దిశలో ఒక బలమైన ముందడుగు పడింది; సీఐఎస్ఎఫ్ లో అందరూ మహిళలే ఉండే మొట్టమొదటి సేనా దళాన్ని ఏర్పాటు చేయడానికి మోదీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక విశిష్ట దళం గా నియమించిన ఈ మహిళా సేనాదళం దేశంలోని విమానాశ్రయాలు, మెట్రో రైళ్ళ వంటి కీలక వ్యవస్థలను పరిరక్షించే బాధ్యతను తీసుకోవడంతో పాటు వీఐపీల భద్రత కోసం కమెండోల భూమిక ను కూడా నిర్వహించనుంది. ఈ నిర్ణయం దేశాన్ని పరిరక్షించే కీలక కార్యాచరణలో పాలుపంచుకోవాలని మరింత మంది మహిళల్లో ఉన్న ఆకాంక్షలను తప్పక నెరవేర్చేదే.’’

కేంద్రీయ సాయుధ పోలీసు దళంలో చేరి, దేశానికి సేవ చేయాలని కోరుకొనే మహిళలకు సీఐఎస్ఎఫ్ ఒక అభిమానపాత్రమైన ఎంపికగా ఉంది. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ లో మహిళల పాత్ర 7 శాతానికి మించింది. ఇప్పుడు మహిళా బెటాలియన్ ను కూడా ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా సీఐఎస్ఎఫ్ లో చేరి మాతృదేశానికి సేవ చేయాలని ఉవ్విళ్లూరుతున్న మరింత మంది యువతులకు ప్రోత్సాహాన్ని అందించడం ఖాయం. ఈ నిర్ణయం సీఐఎస్ఎఫ్ లో మహిళలకు ఒక కొత్త గుర్తింపును ఇవ్వనుంది.

 

 

 

కొత్త బెటాలియన్ కు సత్వరం నియామకాలు జరపడం, ఆ సేనాదళానికి అవసరమైన శిక్షణను ఇవ్వడం, బెటాలియన్ కు ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన చోటును ఎంపిక చేయడం వంటి సన్నాహాలను సీఐఎస్ఎఫ్ ప్రధాన కేంద్రం ఇప్పటికే మొదలుపెట్టింది. వీఐపీ భద్రత విధుల నిర్వహణకు కమెండోలుగా, విమానాశ్రయాలలో ఢిల్లీ మెట్రో రైల్ లో భద్రత సంబంధిత విధులు. ఇలా బహుముఖ భూమికలను నిర్వర్తించడానికి దక్షత కలిగిన ఒక విశిష్ట సేనాదళాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక శిక్షణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.

 

 

 

సీఐఎస్ఎఫ్ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ, సీఐఎస్ఎఫ్ లో అందరూ మహిళలే సభ్యులుగా ఉండే సేనాదళాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కార్యరూపాన్ని ఇస్తున్నారు.

 

***


(Release ID: 2073090) Visitor Counter : 47