సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 3

‘‘లైట్స్, కెమెరా,గోవా! ఇఫీ 2024 వేడుకల్లో భాగం కండి’’ నవంబర్ 20 నుంచి 28 వరకు


ఇఫీ 2024 ఇతివృత్తం – ‘‘యువ దర్శకులు – భవిష్యత్తు ఇప్పుడే’’ – యువతలో దాగి ఉన్న శక్తిని గురించి సృజనాత్మక భవిష్యత్తుకు రూపకల్పన

ఈ చిత్రోత్సవాల్లో పాలుపంచుకోవాల్సిందిగా దర్శకుల, సినీ ప్రముఖులకు ఇఫీ 2024 పిలుపు

అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను ప్రదర్శించేందుకు వచ్చిన స్పందనను చూస్తే ఇఫీని

కేన్స్ చిత్రోత్సవంతో పోల్చవచ్చు: సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్

నూతన ప్రతిభ, అవకాశాలు, సాంస్కృతిక వారసత్వం మీద దృష్టి సారించే

ప్రపంచ సినీ వేడుక ఇఫీ 2024: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు

గతంలో ఎన్నడూ లేనివిధంగా కథ చెప్పే కళను కాపాడుకోవాలి.. ఇఫీ 2024 కాలాతీతమైన ఆ కళను గౌరవించి కాపాడుతుంది: చిత్రోత్సవ డైరెక్టర్ శ్రీ శేఖర్ కపూర్

భారత్ విరామం లేని కలల దేశం, క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఇఫీ ప్రధాన పాత్ర పోషిస్తుంది: శ్రీ ప్రసూన్ జోషి

యువ దర్శకులను ప్రోత్సహించేందుకు ఉత్తమ భారతీయ తొలిచిత్ర దర్శకుడు పేరుతో నూతన పురస్కారం

ప్రఖ్యాత ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయెస్ కు సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారం

ఎన్ఎఫ్‌డీసీ-ఎన్ఎఫ్ఏఐ కి

జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ), ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా(ఈఎస్‌జీసహకారంతో సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఈ నెల 20 నుంచి 28 వరకు 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)ను నిర్వహిస్తుందిఆకర్షణీయమైనవైవిద్యమైన కార్యక్రమాలతో నిండిన ఈ కార్యక్రమం సినిమా ప్రేమికులకు మరపురాని అనుభూతిని ఇస్తుంది.

55వ ఇఫీ ఆరంభానికి ముందుగా మీడియా సమావేశం ఈ రోజు నిర్వహించారుఈ కార్యక్రమంలో కేంద్ర సమాచారప్రసారాలుపార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్సమాచారప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజుసమాచారప్రసార శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి నీరజా శేఖర్ఇఫీ ఉత్సవ సంచాలకులు శ్రీ శేఖర్ కపూర్సీబీఎఫ్‌సీ ఛైర్మన్ శ్రీ ప్రసూన్ జోషిమంత్రిత్వ శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ ఎల్.మురుగన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉత్సవ ప్రాధాన్యాన్ని వివరించారు. ‘‘భారత్‌లో మాత్రమే కాకుండా కేన్స్ లాంటి అంతర్జాతీయ వేడుకలతో పోల్చదగిన ముఖ్యమైక కార్యక్రమం ఇఫీ’’ అని వర్ణించారుఏటా ఉత్సవాల అనుభవాన్ని మెరుగుపరిచేవిధంగా చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి ప్రధానంగా ప్రస్తావించిన డాక్టర్ మురుగన్ఈ ఏడాది వేడుకలకు అంతర్జాతీయంగా విశేష స్పందన వచ్చిందని తెలిపారుఇది చలనచిత్రోత్సవ విస్తృతినిప్రభావాన్ని తెలియజేస్తుంది.

 

ఈ కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు ముంబయిచెన్నైతో సహా ప్రధాన నగరాల్లో ఇటీవలే రోడ్ షోలను మంత్రిత్వశాఖ నిర్వహించిందిత్వరలోనే హైదరాబాద్‌లోనూ ఈ కార్యక్రమం జరగనుందిఆత్మనిర్భర భారత్ స్ఫూర్తినిఇఫీని అంతర్జాతీయ సినీ వేడుకగా జరుపుకోవాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ప్రతిబింబించేలా సినీ ప్రముఖులు దీన్ని తమ సొంత పండగలా స్వీకరించాలని డాక్టర్ మురుగన్ కోరారుప్రజలందరూ గోవాలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.

ఇఫి 2024 ఇతివృత్తం ‘యువ సినీ దర్శకులు’ –‘‘భవిష్యత్తు ఇప్పుడే’’

కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఆలోచనలకు అనుగుణంగా ఇఫీ 2024 ఇతివృత్తం యువ దర్శకులపై ప్రధాన దృష్టి సారించిందివారి సామర్థ్యాన్ని గుర్తించి సృజనాత్మక భవిష్యత్తును రూపొందించేందుకు ప్రాధాన్యమిస్తుంది.

‘‘వైవిధ్యమైన విధానాలుఆలోచనలను అందిపుచ్చుకుంటూప్రపంచంలోనే అతి పెద్ద చిత్ర నిర్మాణ దేశంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందిఈ పరిశ్రమలో నూతనంగా ఆవిర్భవిస్తున్న ప్రతిభ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది’’ అని సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తన ప్రారంభోపన్యాసంలో వివరించారుఇఫీ 2024 సినిమా రూపకర్తలుసినీ ప్రేమికులు ఇద్దరి కోసం రూపొందించామనిభవిష్యత్తును నిర్దేశించే వారికిముఖ్యంగా దేశ సాంస్కృతిక నేపథ్యాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న యువ దర్శక నిర్మాతలకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు.

 

క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో వేదికను 100 మంది యువ ప్రతిభావంతులకు సాయం అందించేలా మెరుగుపరిచారుదీని ద్వారా గతంలో జరిగిన చలనచిత్రోత్సవాల్లో 75 మందికి మాత్రమే మద్ధతు లభించేదిదేశవ్యాప్తంగా వివిధ ఫిలిం స్కూళ్లకు చెందిన 400 మంది యువ సినిమా విద్యార్థులు ఇఫీకి హాజరయ్యేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను మంత్రిత్శ శాఖ కల్పిస్తుంది.

దేశంలో యువ చిత్ర దర్శకుల ప్రతిభను గుర్తించేందుకు మొదటి సారిగా నూతన పురస్కార విభాగాన్ని పరిచయం చేశారు. అదే ఉత్తమ భారతీయ డెబ్యూ డైరెక్టర్యువ దర్శకుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులుచర్చా వేదికలుచిత్ర మార్కెట్సినిమా ప్యాకేజీలను రూపొందించారుఈ వేడుక చలనచిత్ర రంగంలో దిగ్గజాలకు నివాళి అర్పిస్తుందిఅలాగే వైవిధ్యమైన దృక్పథాలను ప్రత్యేక విభాగాలుఎగ్జిబిషన్ల ద్వారా ప్రదర్శిస్తుందిఇది గోవాలోని ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభవాన్నిస్తుంది.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి 55వ ఇఫీలో భాగస్వామ్య అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారుచలనచిత్ర పరిశ్రమ కోసం చిత్ర పరిశ్రమే నిర్వహించే వేడుకగా వర్ణించారుప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ఈ ఉత్సవానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారుదీనిని చరిత్రాత్మకంగా పేర్కొంటూ, ‘‘చలన చిత్రోత్సవ చరిత్రలో మొదటిసారిగాఈ మొత్తం కార్యక్రమానికి నాయకత్వం వహించే బాధ్యతను పరిశ్రమకే అప్పగించే సంప్రదాయాన్ని ప్రారంభించాం’’ అని తెలిపారు.

ఇఫీ: కథ చెప్పే కళకు వేడుక

సినిమాలో కథన ప్రాధాన్యం గురించి చిత్రోత్సవ డైరెక్టర్ శేఖర్ కపూర్ ప్రస్తావించారు. ఇది చలన చిత్రానుభూతికి హృదయంగా అభివర్ణించారు.

 

‘‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో కథ చెప్పే నైపుణ్యాన్ని కొనసాగించడం మునుపటి కంటే చాలా అవసరం’’ అని ఆయన పేర్కొన్నారుకథలే సినిమాను ప్రభావితం చేస్తాయని తెలిపారుఈ కాలాతీతతమైన కళను గౌరవించేప్రోత్సహించే అంశంలో ఈ వేడుకలకున్న కృతనిశ్చయాన్ని ఆయన ఇచ్చిన సందేశం ప్రతిఫలిస్తుంది.

భారత్: విశ్రాంతి లేని కలల దేశం

భారత్‌ను ‘‘విశ్రాంతి లేని స్వప్నాల దేశం’’గా సీబీఎఫ్‌సీ ఛైర్మన్ ప్రసూన్ జోషి వర్ణించారు. కథకులకు మూలాల నుంచి ప్రామాణికమైన ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదికను కల్పించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారుఅలాంటి ప్రతిభను ప్రోత్సహించివారిని ప్రపంచం ముందుకు తీసుకువచ్చేందుకు ఇఫీ పోషిస్తున్న పాత్రనుదానిని పునరుద్ఘాటిస్తున్న ఇఫీ 2024 ఇతివృత్తం గురించి ప్రముఖంగా చర్చించారుక్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ద్వారా నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటూ ‘‘వెలుగులోకి రాని ప్రతిభను ప్రపంచం ముందుకు తీసుకురావాలి’’ అని అన్నారు.

 

 

***

iffi reel

(Release ID: 2072590) Visitor Counter : 46