ప్రధాన మంత్రి కార్యాలయం
అందరి ప్రయత్నాలతో దీర్ఘకాలం పాటు చక్కని ఫలితాలను పొందొచ్చు;
స్వచ్ఛతతో పాటే ఆర్థికంగా వివేకవంతులై ముందుకు సాగిపోతూ ఉండవచ్చు: ప్రధానమంత్రి
‘స్పెషల్ కాంపెయిన్ 4.0’తో అద్భుత ఫలితాలు ఒనగూరాయంటూ శ్రీ నరేంద్ర మోదీ హర్షం;
ఈ ఉద్యమంతో దేశ ఖజానాకు రూ. 2,364 కోట్లు వచ్చాయి
Posted On:
10 NOV 2024 1:07PM by PIB Hyderabad
దేశంలో విస్తృత స్థాయిలో చేపట్టిన ‘స్పెషల్ కాంపెయిన్ 4.0’లో భాగంగా, పనికిరాని వస్తువుల విక్రయంతోనే రూ. 2,364 కోట్లు ప్రభుత్వ ఖజానాకు (గత నాలుగేళ్లలో, అంటే 2021 మొదలుకొని) రావడం సహా, గణనీయమైన ఫలితాలు సిద్ధించాయంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఉద్యమాన్ని ఈ రోజు ప్రశంసించారు. అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తే చక్కని ఫలితాలు దీర్ఘకాలం పాటు పొందొచ్చని, స్వచ్ఛత పరిరక్షణతో పాటే ఆర్థికంగా కూడా వివేకవంతులమై ముందుకు సాగిపోతూ ఉండవచ్చని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ సామాజిక ప్రసార మాధ్యమం ‘ఎక్స్’ లో పొందుపరిచిన ఒక పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ, ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ప్రశంసనీయం.
చక్కని నిర్వహణ పద్ధతులపై శ్రద్ధ తీసుకొంటూ, క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఈ ప్రయత్నంలో గొప్ప ఫలితాలను రాబట్టారు. అందరూ ఒక్క తాటి మీద నిలిచి ముందుకు సాగిపోతూ ఉంటే, ఇటు స్వచ్ఛతతో పాటు అటు ఆర్థికంగా కూడా చక్కని లాభాలు సమకూరడంతో పాటు దీర్ఘకాలం ప్రభావాన్ని ప్రసరించే ఫలితాలు చేజిక్కుతాయని ఈ ఉద్యమం నిరూపించింది.’’
**********
MJPS/SR/SKS
(Release ID: 2072248)
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam