ప్రధాన మంత్రి కార్యాలయం
అల్మోడాలో రోడ్డు ప్రమాద మృతులకు ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ఇస్తున్నట్టు ప్రకటన
Posted On:
04 NOV 2024 1:19PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్‌లోని అల్మోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంఓ ఇండియా ద్వారా సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
‘‘ఉత్తరాఖండ్‌లోని అల్మోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఇవ్వనున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
***
MJPS/SS
(Release ID: 2070602)
Visitor Counter : 46
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam