హోం మంత్రిత్వ శాఖ
వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు.. ‘సిఎపిఎఫ్’లు.. ‘సిపిఒ’ల పరిధిలోని 463 మంది సిబ్బందికి 2024కుగాను ‘కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్’ ప్రదానం
అసాధారణ పనితీరుకు గుర్తింపు సహా వృత్తిపరంగా ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహిస్తూ ప్రకటించే ఈ పురస్కారం స్పెషల్ ఆపరేషన్, ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ సైన్స్ రంగాల అధికారులు/సిబ్బందిలో నైతిక స్థైర్యం పెంచుతుంది;
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం.. కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంతో ప్రవేశపెట్టిన ‘కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్’ పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం ఇనుమడింపజేస్తుంది;
హోం వ్యవహారాల శాఖ 2024 ఫిబ్రవరి నుంచి ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టింది;
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా అక్టోబరు 31న ఈ పురస్కార విజేతలను ప్రకటిస్తారు
Posted On:
31 OCT 2024 10:17AM by PIB Hyderabad
దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు ‘సిఎపిఎఫ్’లు, ‘సిపిఒ’లలో విధులు నిర్వర్తిస్తున్న 463 మంది అధికారులు, సిబ్బందికి 2024కుగాను ‘కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్’ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది.
అసాధారణ పనితీరుకు గుర్తింపు సహా వృత్తిపరంగా ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహిస్తూ ప్రకటించే ఈ పురస్కారం కింద పేర్కొన్న విభాగాల్లో పనిచేసే అధికారులు/సిబ్బందిలో నైతిక స్థైర్యం పెంచుతుంది.
(i) స్పెషల్ ఆపరేషన్
(ii) ఇన్వెస్టిగేషన్
(iii) ఇంటెలిజెన్స్
(iv) ఫోరెన్సిక్ సైన్స్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వాన ప్రవేశపెట్టిన ‘కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్’ పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం ఇనుమడింపజేస్తుంది.
కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా 2024 ఫిబ్రవరి నుంచి ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. అప్పటినుంచి పోలీసు బలగాలు, భద్రత సంస్థ, నిఘా విభాగం సహా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్పెషల్ బ్రాంచీలు, ‘సిపిఒ’లు, ‘సిఎపిఎఫ్’లు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అస్సాం రైఫిల్స్, (కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత) ఫోరెన్సిక్ సైన్స్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బందిని ఈ పురస్కారానికి ఎంపిక చేస్తున్నారు. దైనందిన, ప్రత్యేక కార్యకలాపాల్లో అసాధారణ పనితీరు, పరిశోధనలో అత్యుత్తమ నైపుణ్యం, దృఢదీక్షతో కూడిన సాహసోపేత నిఘా సేవలు, ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రభుత్వ శాస్త్రవేత్తల ప్రశంసనీయ సేవల ప్రాతిపదికగా ఈ ఎంపిక చేపడతారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా అక్టోబరు 31న పురస్కార విజేతలను ప్రభుత్వం ప్రకటిస్తోంది.
పురస్కార గ్రహీతల జాబితాను- https://www.mha.gov.in వెబ్‌సైట్‌లో చూడటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
****
(Release ID: 2069822)
Visitor Counter : 17