ప్రధాన మంత్రి కార్యాలయం
లైవ్ చెస్ రేటింగ్స్ లో 2800 మార్కును దాటిన అర్జున్ ఎరిగైసికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన
Posted On:
27 OCT 2024 11:08AM by PIB Hyderabad
లైవ్ చెస్ రేటింగ్స్ లో 2800 మార్కును దాటినందుకు భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
భారతీయులు గర్వపడేలా చేసిన ఎరిగైసి అసాధారణ ప్రతిభ, పట్టుదల మరింత మంది యువతకు స్ఫూర్తిదాయకమని మోదీ కొనియాడారు.
'లైవ్ చెస్ రేటింగ్స్ లో 2800 మార్కును దాటిన అర్జున్ ఎరిగైసికి అభినందనలు. ఇదో అద్భుత ఘట్టం. ఆయన అసాధారణ ప్రతిభ, పట్టుదల దేశం మొత్తం గర్వపడేలా చేశాయి. ఇది గొప్ప వ్యక్తిగత మైలురాయిగా నిలవడంతో పాటు, చదరంగం ఆడటానికి, ప్రపంచ వేదికపై ప్రకాశించడానికి మరింత మంది యువకులకు స్ఫూర్తినిస్తుంది. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాభినందనలు' అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
***
MJPS/RT
(Release ID: 2068761)
Visitor Counter : 46
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam