ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంయుక్త ప్రకటన: ఏడో భారత్-జర్మనీ ప్రభుత్వ స్థాయి సంప్రదింపులు (ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ - ఐజిసి)

Posted On: 25 OCT 2024 8:25PM by PIB Hyderabad

ఆవిష్కరణచలనశీలతస్థిరత్వం వేదికగా ఉమ్మడి అభివృద్ధి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ 2024 అక్టోబర్ 25న న్యూఢిల్లీలో ఏడో విడత భారత్-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీకు సహాధ్యక్షత వహించారు.భారత వైపు నుంచి రక్షణవిదేశీ వ్యవహారాలువాణిజ్యంపరిశ్రమలుకార్మికఉపాధిశాస్త్రసాంకేతికనైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రులుజర్మనీ వైపు నుంచి ఆర్థిక వ్యవహారాలువాతావరణ కార్యాచరణవిదేశీ వ్యవహారాలుకార్మికసామాజిక వ్యవహారాలువిద్యపరిశోధన శాఖల మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారుఇంకా జర్మనీ వైపు నుంచి ఆర్థికపర్యావరణంప్రకృతి సంరక్షణఅణు భద్రతవినియోగదారుల రక్షణఆర్థిక సహకారం,అభివృద్ధి శాఖల పార్లమెంటరీ స్టేట్ సెక్రటరీలుఅలాగే ఇరు దేశాల నుంచి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు


2. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌ను ఆయన మూడోసారి భారత్ పర్యటన సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతించారురెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంలోనూమరింత లోతుగా పరిపుష్టం చేయడంలోనూ ఇరు దేశాల ప్రభుత్వపరిశ్రమపౌర సమాజంవిద్యా రంగాలలో ద్వైపాక్షిక సంబంధాల వేగాన్ని ఇరువురు నాయకులు ప్రశంసించారు

3. జర్మనీభారత్మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతం మధ్య ఆర్థిక సంబంధాలువ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఏడో ఐజీసీకి సమాంతరంగా జర్మన్ వాణిజ్యానికి సంబంధించి న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ జర్మన్ వాణిజ్య సదస్సు (ఎపికెప్రాముఖ్యతను ఇరువురు నేతలు వివరించారు. 2024 సదస్సును భారతదేశంలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంఇండో-పసిఫిక్అలాగే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ రాజకీయ ప్రభావాన్ని స్పష్టంగా సూచిస్తోంది.

4. ‘ఆవిష్కరణచలనశీలతసుస్థిరతతో కలిసి ఎదగడం’ అనే నినాదంతో ఏడో ఐజీసీ సాంకేతికతఆవిష్కరణకార్మిక శక్తిప్రతిభవలసచలనశీలత వాతావరణ చర్యలుహరితస్థిరమైన అభివృద్ధితో పాటు ఆర్థికరక్షణవ్యూహాత్మక సహకారంపై ప్రధానంగా దృష్టి సారించిందివాణిజ్యంపెట్టుబడులురక్షణసైన్స్టెక్నాలజీఇన్నోవేషన్సుస్థిరతపునరుత్పాదక ఇంధనంఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలుఅభివృద్ధి సహకారంసంస్కృతివిద్యసుస్థిర చలనశీలతసుస్థిర వనరుల నిర్వహణజీవవైవిధ్యంవాతావరణ సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యంప్రజల మధ్య సంబంధాల విస్తరణ మొదలైనవి బహుముఖ భాగస్వామ్యానికి కీలక చోదకాలుగా ఉంటాయని ఇరు పక్షాలు అంగీకరిస్తున్నాయి.

5. శాస్త్రసాంకేతికపరిశోధనఆవిష్కరణలో భారత-జర్మన్ సహకారానికి మూలస్థంభంగా నిలిచిన ప్రభుత్వ స్థాయి ఒప్పందానికి ప్రస్తుత 2024 సంవత్సరంతో 50 ఏళ్లు పూర్తవుతాయి.  ఈ నేపథ్యంలోఏడో ఇండో-జర్మన్ కన్సల్టేషన్స్ భారత-జర్మనీ మధ్య సన్నిహిత సంబంధాలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని అందించడంతో పాటుసహకారంలోని ముఖ్యమైన స్తంభంగా సాంకేతికతఆవిష్కరణల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది

6. ఆరో ఇండో-జర్మన్ కన్సల్టేషన్స్ (ఐజిసిసమయంలోఇరు ప్రభుత్వాలు హరితసుస్థిర అభివృద్ధి భాగస్వామ్యాన్ని (జిఎస్డిపిప్రకటించాయిఇది ఈ రంగంలో ద్వైపాక్షిక కార్యక్రమాలుసంయుక్త ప్రణాళికలకు ఒక గొడుగులా పని చేసిందితదనంతరంఇరుపక్షాలూ 2022 డిసెంబరులో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం (ఎంఎంపిఎపై సంతకం చేశాయిఫిబ్రవరి 2023 లో "ఇన్నోవేషన్టెక్నాలజీలో సహకారాన్ని పెంపొందించడానికి భారత్-జర్మనీ విజన్కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయిఆరో ఐజిసి ఫలితాలనుఆ తరువాత ఇరు పక్షాలు కుదుర్చుకున్న వివిధ ఒప్పందాల ఫలితాలను గుర్తు చేస్తూరెండు ప్రభుత్వాలు "ఇండియా-జర్మనీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ భాగస్వామ్య రోడ్ మ్యాప్ను ప్రారంభించాయి. "ఇండో-జర్మన్ గ్రీన్ హైడ్రోజన్ రోడ్ మ్యాప్"ను ప్రవేశపెట్టాయిగ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ పెంపును ప్రోత్సహించడంశాంతిభద్రతస్థిరత్వం కోసం కలిసి ఎదగడం దీని లక్ష్యం.

7. భవిష్యత్ కోసం ఒప్పందాన్ని గుర్తిస్తూ.. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలుసూత్రాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యంస్వేచ్ఛఅంతర్జాతీయ శాంతిభద్రతనియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమంతో సహా భాగస్వామ్య విలువలుసూత్రాలను నిలబెట్టడానికి తమ బలమైన నిబద్ధతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారుసమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలాప్రస్తుతభవిష్యత్ సవాళ్లను పరిష్కరించడానికిప్రపంచవ్యాప్తంగా శాంతిసుస్థిరతలకు మద్దతు ఇవ్వడానికిపరిరక్షించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతశాశ్వతేతర సభ్యత్వ విభాగాల విస్తరణతో సహా బహుళపక్ష వ్యవస్థను బలోపేతం చేయడానికిసంస్కరించడానికి రెండు ప్రభుత్వాలు తమ నిబద్ధతను స్పష్టం చేశాయినిర్ణీత గడువులోగా ఐజిఎన్ లో పాఠ్య ఆధారిత (టెక్స్ట్ బేస్డ్చర్చలు జరపాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు.


8. ప్రాంతీయప్రపంచ సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పడుతున్న ఇబ్బందులు సంస్కరణల తక్షణ అవసరాన్ని బలంగా గుర్తు చేస్తాయని భారత్జర్మనీ అంగీకరించాయి. 'గ్రూప్ ఆఫ్ ఫోర్ (జీ4)' లో సభ్యులుగా భారత్జర్మనీలు 21వ శతాబ్దపు వాస్తవాలను ప్రతిబింబించే సమర్థమంతమైనప్రభావవంతమైనపారదర్శకమైన భద్రతా మండలి కోసం తమ పిలుపును పునరుద్ఘాటించాయి.

9. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధందాని భయంకరమైనవిషాదకరమైన మానవతా పరిణామాలపై నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారుసార్వభౌమాధికారంప్రాదేశిక సమగ్రతను గౌరవించడంతో సహా ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలుసూత్రాలకుఅంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సమగ్రమైనన్యాయమైనశాశ్వత శాంతి అవసరాన్ని వారు పునరుద్ఘాటించారుప్రపంచ ఆహార,ఇంధన భద్రతకు సంబంధించి ఉక్రెయిన్ లో యుద్ధం ప్రతికూల ప్రభావాలను ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నతక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ప్రభావాన్ని కూడా వారు గుర్తించారుఈ యుద్ధ సందర్భంలోఅణ్వాయుధాల వాడకం లేదా వాడతామనే బెదిరింపు ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయాన్ని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారుఏ దేశం కూడా మరే ఇతర దేశ ప్రాదేశిక సమగ్రతసార్వభౌమత్వం లేదా రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా బలప్రయోగం లేదా బెదిరింపుల నుంచి దూరంగా ఉండాలని పునరుద్ఘాటించారు.

10. మధ్యప్రాచ్యంలో శాంతిసుస్థిరతను సాధించేందుకు ఇరువురు నేతలు ఆసక్తి కనబరిచారుఅక్టోబర్ 7, 2023 నాటి హమస్ ఉగ్రవాద దాడులను వారు నిర్ద్వంద్వంగా ఖండించారుగాజాలో పెద్ద ఎత్తున పౌరులు ప్రాణాలు కోల్పోవడంమానవతా సంక్షోభం గురించి ఆందోళన వ్యక్తం చేశారుహమస్ చెరలో ఉన్న బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలనితక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలనిగాజా అంతటా మానవతా సహాయాన్ని తక్షణమే మెరుగుపర్చాలనిమానవతా సహాయాన్ని నిరంతరం కొనసాగేలా చూడాలని వారు పిలుపునిచ్చారుఈ ప్రాంతంలో ఘర్షణ తీవ్రతరం కాకుండావిస్తరించకుండా నిరోధించాల్సిన అవసరాన్ని నేతలు స్పష్టం చేశారుఈ విషయంలో ప్రాంతీయ దేశాలన్నీ బాధ్యతాయుతంగాసంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారుపౌరుల ప్రాణాలను పరిరక్షించడంపౌరులకు సురక్షితమైనసకాలంలోస్థిరమైన ఉపశమనాన్ని అందించేలా చూడాలని తక్షణ అవసరాన్ని స్పష్టం చేశారుఈ విషయంలో అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కోరాయిలెబనాన్ లో శరవేగంగా క్షీణిస్తున్న పరిస్థితిపై కూడా నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారుతక్షణమే శత్రుత్వాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారుగాజాలెబనాన్ లో సంఘర్షణకు దౌత్య మార్గాల ద్వారా మాత్రమే పరిష్కారం సాధ్యమనీఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1701 బ్లూ లైన్ వెంబడి దౌత్య పరిష్కారం దిశగా మార్గాన్ని వివరించిందిఇజ్రాయెల్ చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని సార్వభౌమాధికారఆచరణీయ స్వతంత్ర పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుకుసురక్షితమైనపరస్పరం గుర్తించిన  సరిహద్దులలో నివసించేందుకుఇజ్రాయెల్ తో కలసి గౌరవంశాంతితో సఖ్యతగా నివసించేందుకు దారి తీసే విధంగా రెండు దేశాల మధ్య చర్చల ద్వారా పరిష్కారాన్ని ఆశిస్తున్నట్టు ఇద్దరు నేతలు పేర్కొన్నారు

11. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగాబహుళ ధృవ ప్రపంచంలో భద్రతశ్రేయస్సు సుస్థిర అభివృద్ధి కోసం భారత్యూరోపియన్ యూనియన్ (ఈయుఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని నాయకులు తెలిపారుభారత్ఈయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వారు స్పష్టం చేశారుఇది ఇరు పక్షాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక సానుకూల ప్రభావాన్ని చూపుతుందివాణిజ్యంవిశ్వసనీయ సాంకేతిక పరిజ్ఞానంభద్రత వంటి కీలక రంగాల్లో సన్నిహిత సంబంధాలకు వినూత్న వేదికగా ఉపయోగపడే భారత్-ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ కు నేతలు తమ బలమైన మద్దతును తెలియజేశారుభారత్జర్మనీఈయూ సభ్యులుగా ఉన్న ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ తో పాటు ఈయూ ఇనిషియేటివ్ గ్లోబల్ గేట్ వే సహా కీలక అనుసంధాన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ద్వైపాక్షికంగాఈయూ స్థాయిలో ప్రయత్నాలను సమన్వయం చేయడానికి వారు అంగీకరించారు.

12. యూరోపియన్ యూనియన్భారత్ ల మధ్య సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపెట్టుబడుల రక్షణ ఒప్పందంభౌగోళిక సూచికల ఒప్పందాల కీలక ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూసంప్రదింపులను త్వరగా ముగించాలని ఇరువురు నేతలు స్పష్టం చేశారు

13. ఉగ్రవాదాన్నిహింసాత్మక తీవ్రవాదాన్ని అన్ని రూపాల్లోవ్యక్తీకరణల్లో ఇరువురు నేతలు నిర్ద్వంద్వంగా ఖండించారుఅంతర్జాతీయ శాంతిసుస్థిరతలకు ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమించిందని ఇరు పక్షాలు అంగీకరించాయి.  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) 1267 ఆంక్షల కమిటీ నిషేధించిన గ్రూపులతో సహా అన్ని ఉగ్రవాద గ్రూపులపై సమష్టి చర్యలు తీసుకోవాలని వారు పిలుపునిచ్చారుఅంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉగ్రవాద స్థావరాలుమౌలిక సదుపాయాలను నిర్మూలించడంతో పాటు ఉగ్రవాద వ్యవస్థలువాటికి నిధుల సరఫరా మార్గాలను భగ్నం చేసేందుకు అన్ని దేశాలూ కృషి చేయాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి.

14. ఉగ్రవాద అవసరాల కోసం మానవ రహిత విమాన వ్యవస్థల ఏర్పాటుఉగ్రవాదులుఉగ్రవాద సంస్థలు వర్చువల్ ఆస్తులను ఉపయోగించడంఉగ్రవాద భావజాల వ్యాప్తి కోసం సమాచారకమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి కొత్తఅభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే పోకడల పట్ల ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 2022 లో భారతదేశంలో యుఎన్ సీటీసీ సమావేశాల నిర్వహణ సందర్భంగా ఉగ్రవాద ప్రయోజనాల కోసం కొత్తఆవిర్భావ టెక్నాలజీల వాడకాన్ని ఎదుర్కోవడంపై ఆమోదించిన ఢిల్లీ డిక్లరేషన్ ను వారు స్వాగతించారు.

15. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికిఈ విషయంలో ప్రపంచ సహకారవ్యవస్థను బలోపేతం చేయడానికి భాగస్వామ్య నిబద్ధతను ప్రకటిస్తూమనీలాండరింగ్ నిరోధంపై అంతర్జాతీయ ప్రమాణాలను నిలబెట్టాలనిఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్)తో సహా అన్ని దేశాలు ఉగ్రవాదానికి దన్నుగా ఉన్న ఆర్థిక సహాయ మార్గాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారుఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయినిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవడంఉగ్రవాద నిరోధక ప్రయత్నాల సమన్వయం కోసం సంబంధిత మార్గాలను బలోపేతం చేయడానికి ఉగ్రవాద నిరోధక సంయుక్త వర్కింగ్ గ్రూప్ తో క్రమం తప్పకుండా సంప్రదింపులు నిర్వహించడానికి ఇరు పక్షాలూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయిఉగ్రవాద గ్రూపులువ్యక్తులపై ఆంక్షలుహోదాలుతీవ్రవాదాన్ని ఎదుర్కోవడంఉగ్రవాదుల ఇంటర్నెట్ వాడకంసీమాంతర ఉగ్రవాదుల కదలికల గురించిన సమాచార మార్పిడికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయి.

16. ఉగ్రవాదానికి సంబంధించిన నేరాలతో సహా నేరగాళ్లను నిరోధించడానికిఅణచివేయడానికిదర్యాప్తు చేయడానికినేరగాళ్లను విచారించడానికి సన్నిహిత భాగస్వామ్యం కోసం భారత్జర్మనీ నేర విషయాల్లో పరస్పర న్యాయ సహాయ ఒప్పందాన్ని (ఎంఎల్ఎటిఖరారు చేశాయిఇరు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్-జర్మనీ ఎంఎల్ఏటీ ఒక ముఖ్యమైన మలుపు అనిఇది సమాచారంఆధారాలను పంచుకోవడంపరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడంరెండు దేశాల మధ్య ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి వీలు కల్పిస్తుందని ఇరువురు నాయకులు అంగీకరించారు.

17. భద్రతా సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడంలో పరస్పర ఆసక్తి కలిగిన వ్యూహాత్మక భాగస్వాములుగావర్గీకృత సమాచారాన్ని మార్చుకోవడంభద్రపరచుకోవడంపై రెండు పక్షాలు ఒప్పందాన్ని ముగించాయితద్వారా భారత్జర్మన్ సంస్థల మధ్య సహాయసహకారాలకు చట్టపరమైన యంత్రాంగాన్ని సృష్టించాయివర్గీకృత సమాచారాన్ని ఎలా నిర్వహించాలిరక్షించాలిప్రసారం చేయాలన్న కోణంలో మార్గదర్శకతను అందించాయి

18. ప్రపంచవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో మరింత ప్రశంసనీయ విదేశాంగ విధాన దృక్పథాల కోసం ఇరు ప్రభుత్వాలు ఆయా విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య పశ్చిమాసియాఉత్తర ఆఫ్రికా (డబ్ల్యుఎఎన్ఎ పై భారత్-జర్మనీ చర్చల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయిఇది ఆఫ్రికాతూర్పు ఆసియాపై దీర్ఘకాలిక యంత్రాంగాలకు అదనంగా పని చేస్తుందివిధాన ప్రణాళికసైబర్ సెక్యూరిటీసైబర్ సమస్యలుఐక్యరాజ్యసమితి సహా పరస్పర ఆందోళనకు సంబంధించిన కీలక అంశాలపై క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడంపై ఇరు ప్రభుత్వాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.


 

19. మేధో వర్గాలువిదేశాంగ,  భద్రతా విధాన నిపుణులతో సహా ఒకరి దృక్పథాలను మరొకరు లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన రెండు ప్రభుత్వాలుభారత కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ఐసిడబ్ల్యుఎ), రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్ ఐఎస్), ఎంఇఎజర్మన్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ అండ్ ఏరియా స్టడీస్ (జి ఐ జి ఎ), జర్మన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ అఫైర్స్ (ఎస్ డబ్ల్యుపి), జర్మన్ ఫెడరల్ ఫారిన్ ఆఫీస్ భారత్-జర్మనీ ట్రాక్ 1.5 చర్చల ఉపయోగాన్ని ప్రముఖంగా పేర్కొన్నాయిఈ చర్చల రూపంలో తదుపరి సమావేశం నవంబర్ 2024 లో నిర్వహించాలని నిర్ణయించారుతూర్పు ఆసియాపై ట్రాక్ 1.5 చర్చలను ప్రారంభించడాన్ని కూడా రెండు ప్రభుత్వాలు అభినందించాయిఈ మార్పిడి ఇరు పక్షాలను తమ ప్రకృతిని మెరుగ్గా సమన్వయపరచటానికి సహాయపడుతుందని అంగీకరించారుఈ వేగాన్ని కొనసాగించడానికిట్రాక్ 1.5 చర్చల విధానాల తదుపరి ఎడిషన్ ను వీలైనంత త్వరగా నిర్వహించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

20. అంతర్జాతీయ చట్టంసార్వభౌమత్వానికి పరస్పర గౌరవంవివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంసమర్థవంతమైన ప్రాంతీయ సంస్థల ఆధారంగా నిర్మించిన స్వేచ్ఛాయుతబహిరంగసమ్మిళితశాంతియుతసంపన్న ఇండో-పసిఫిక్ ను ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు కట్టుబడి ఉన్నాయిఆసియాన్ ఐక్యతకేంద్రీకరణకు తమ అచంచల మద్దతును ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయిఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమ (ఐపిఒఐసామర్థ్య-నిర్మాణ పునాదిలో జర్మనీ నాయకత్వాన్ని భారత ప్రభుత్వం స్వాగతించిందివాతావరణ సంబంధిత నష్టంవిధ్వంసానికి వ్యతిరేకంగా పసిఫిక్ ద్వీప దేశాల సామర్ధ్యాన్ని బలోపేతం చేయడానికి 2022 లో అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమం కింద ఆలోచనల కోసం పోటీ నిర్వహించడంతద్వారా 20 మిలియన్ యూరోల వరకు బహుమతులు ఇవ్వడాన్ని స్వాగతించింది.

21. అభివృద్ధి ఎజెండాను జి 20 లో కేంద్ర స్థాయికి తీసుకువచ్చిన భారత్ జి 20 ప్రెసిడెన్సీని జర్మనీ అభినందించిందిజర్మన్ జి-20 ప్రెసిడెన్సీలో కాంపాక్ట్ విత్ ఆఫ్రికా (సిడబ్ల్యుఎపై ఒక వేదికను ప్రారంభించడం నుండి భారతదేశం అధ్యక్షత వహించినపుడు ఆఫ్రికన్ యూనియన్ ను జి-20 లో శాశ్వత సభ్యదేశంగా చేర్చడం వరకుగ్లోబల్ సౌత్ స్వరాన్ని విస్తరించడానికి జి-20 చాలా దూరం వచ్చిందని ఇరువురు నాయకులు అంగీకరించారురక్షణవ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి అంతర్జాతీయ పాలనా సంస్కరణల కోసం బ్రెజిల్ జి-20 ప్రెసిడెన్సీ నిర్దేశించిన ప్రాధాన్యతలకు భారత్జర్మనీ తమ మద్దతును తెలిపాయి

22. రెండు దేశాల మ‌ధ్య రక్షణ సంబంధాల‌ విస్తృతిలో ఉమ్మ‌డి లక్ష్యానికి అనుగుణంగాసార్వ‌త్రిక అనుమ‌తులు లేదా లైసెన్సుల వంటి విధానాల‌పై సానుకూల నియంత్రణాత్మ‌క‌ నిర్ణయాలతో ఎగుమ‌తి అనుమ‌తులను వేగిర‌ప‌ర‌చ‌డంలో జ‌ర్మనీ తీసుకున్న చొర‌వపై భార‌త ప్ర‌భుత్వం హ‌ర్షం వ్య‌క్తం చేసిందిభారత్‌ వ్యూహాత్మక ఎగుమతులపై తోడ్పాటుకు ఉభ‌య పక్షాలు కట్టుబ‌డిన నేప‌థ్యంలో సంబంధిత రక్షణ పరిశ్రమల మధ్య సంయుక్త ఆవిష్క‌ర‌ణ‌-ఉత్పత్తి స‌హా ఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించాల‌ని నిర్ణ‌యించాయిభారత్‌-జర్మనీల మధ్య రక్షణ పారిశ్రామిక భాగస్వామ్య బలోపేతం దిశ‌గా అక్టోబర్ 24న న్యూఢిల్లీలో ర‌క్ష‌ణ రంగ రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించడాన్ని రెండు ప్రభుత్వాలు ప్రశంసించాయి.

23. సైనిక దళాల స్థాయిలో క్రమబద్ధ పర్యటనలుపరస్పర సంప్రదింపుల పెంపు సహా వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే ఉన్నత స్థాయి రక్షణ కమిటీ సమావేశంపై ఉభయ పక్షాలూ ఆసక్తి చూపుతున్నాయిరెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి రక్షణరంగ సహకార విస్తృతిని కీలక పునాదిగా మలచాలన్నది దీని లక్ష్యంఅలాగే శాంతి పరిరక్షణపై దళాలకు శిక్షణ కోసం న్యూఢిల్లీలోని ఐక్యరాజ్య సమితి శాంతి పరరక్షణ కేంద్రంజర్మనీలోని హామెల్‌బర్గ్‌లోగల బుందేస్వియర్ ఐక్యరాజ్యసమితి శిక్షణ కేంద్రం మధ్య సహకారం ఖరారుకు భారత్-జర్మనీ నిర్ణయించాయిదీంతోపాటు 2025లో బెర్లిన్ నగరంలో నిర్వహించనున్న మంత్రుల స్థాయి శాంతి పరిరక్షణ సమావేశంపైనా ఆసక్తితో ఉన్నాయి.

24. ఇండో-పసిఫిక్ భద్రత-శ్రేయస్సుతోపాటు అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారంలో ఆ ప్రాంతానికిగల ప్రాధాన్యంపై ఉభయ పక్షాలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయిఈ నేపథ్యంలో ఆ ప్రాంతంపై తమ ప్రభుత్వ విధాన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండో-పసిఫిక్ దేశాలతో సంబంధాల విస్తృతికి జర్మనీ సిద్ధంగా ఉందిఅలాగే ‘‘సముద్ర చట్టాలపై 1982 నాటి ఐక్యరాజ్య సమితి తీర్మానం’’ మేరకు ఇండో-పసిఫిక్ సహా సముద్ర కార్యకలాపాలు సాగే అన్ని మార్గాల్లో నిర్నిరోధ ప్రయాణ స్వేచ్ఛకుగల ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలూ స్పష్టం చేశాయిరక్షణ-భద్రత సంబంధాలను మరింత బ‌లోపేతం చేసే దిశ‌గా ర‌వాణాలో పరస్పర స‌హ‌కారంరెండు దేశాల సాయుధ దళాల మధ్య ఆదాన‌ప్ర‌దానంతోపాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ర‌వాణా స‌దుపాయాల మద్దతుకు ప్రాతిప‌దిక‌ను ఏర్ప‌రుస్తూ అవగాహ‌న ఒప్పందం ఖ‌రారుకు ఉభ‌య ప్ర‌భుత్వాలు సంయుక్తంగా ఆస‌క్తి వ్య‌క్తం చేశాయిఇండో-పసిఫిక్‌ ప్రాంతంతో సహకార విస్తృతి లక్ష్యంగా భార‌త్‌లోని గురుగ్రామ్‌లోగ‌ల‌ ‘‘హిందూ మహా సముద్ర ప్రాంత సమాచార-గణాంక క్రోడీకరణ కేంద్రం (ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్-ఇండియన్ ఓషన్ రీజియన్)లో ఒక శాశ్వత అనుసంధాన అధికారిని నియమించాలని జర్మనీ నిర్ణయించిందిహిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌక రాకపోకల పర్యవేక్షణతోపాటు ఈ ప్రాంతంతో సన్నిహిత సహకారం మెరుగుకు ఈ అధికారి కృషి చేస్తారు.

25. రక్షణ-భద్రత సహకార రంగంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంతో జర్మనీ సంబంధాల విస్తరణను ఉభయపక్షాలూ స్వాగతించాయిఇందులో భాగంగా 2024 ఆగస్టులో ‘తరంగ శక్తి’ పేరిట నావికాదళ కసరత్తు సందర్భంగా భారత్-జర్మనీ వైమానిక దళాల మధ్య సహకారం విజయవంతమైందని ప్రశంసించాయిఅలాగే గోవాలో యుద్ధ నౌకల మజిలీజర్మనీ ఫిరంగి యుద్ధనౌక (ఫ్రిగేట్) ‘‘బాడెన్-వుర్టెమ్‌బెర్గ్’’ఆయుధ సరఫరా నౌక ‘‘ఫ్రాంక్‌ఫర్ట్ ఆమ్ మెయిన్’’ సహా భారత నావికాదళ యుద్ధనౌకల సంయుక్త కసరత్తును కొనియాడాయిఅంతేకాకుండా 2024 జూలైలో భారత నావికాదళ యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ తబర్’ హాంబర్గ్‌లో మజిలీ చేయడంపై జర్మనీ హర్షం ప్రకటించింది.

26. రక్షణ-భద్రత సంబంధిత వివిధ అంశాల్లో ద్వైపాక్షికంగానే కాకుండా ఐరోపా సమాఖ్య విధివిధానాల పరిధిలో ఇతర భాగస్వాములతో సంయుక్త ఆవిష్కరణ-ఉత్పత్తితోపాటు ఉమ్మడి పరిశోధన కార్యకలాపాల ద్వారానూ ద్వైపాక్షిక ఆదానప్రదానాల విస్తృతికి రెండు ప్రభుత్వాలు అంగీకరించాయిఈ మేరకు రక్షణరంగ పరిశ్రమల స్థాయిలో సాంకేతిక సహకారంతయారీ-సంయుక్త ఉత్పత్తిరక్షణ వేదికలు-పరికరాల సంయుక్త ఆవిష్కరణలపై నిశితంగా దృష్టి సారిస్తూ సహకార విస్తృతికి ఉభయ పక్షాలూ తోడ్పాటునిస్తాయిమరోవైపు ‘ఒసిసిఎఆర్’ (ఆర్గనైజేషన్ ఫర్ జాయింట్ ఆర్మమెంట్ కో-ఆపరేషన్పరిధిలోని ‘యూరోడ్రోన్ ప్రోగ్రామ్‌’లో పరిశీలక సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థనపై జర్మనీ హర్షం వ్యక్తం చేసింది.

కీలక-వినూత్న సాంకేతికతలు.. శాస్త్రవిజ్ఞానం-ఆవిష్కరణలలో భాగస్వామ్యం

27. రెండు దేశాల మధ్య శాస్త్ర-సాంకేతిక రంగాల్లో సహకారం 50 ఏళ్లపాటు విజయవంతంగా కొనసాగడంపై దేశాధినేతలిద్దరూ హర్షం వ్యక్తం చేశారుఇది మరింత విస్తరించేలా ‘భారత్-జర్మనీ ఆవిష్కరణ-సాంకేతిక భాగస్వామ్య భవిష్యత్ ప్రణాళిక’కు శ్రీకారం చుట్టడం ద్వారా మద్దతిస్తామని పునరుద్ఘాటించారుఈ దిశగా రెండు దేశాల్లోని ప్రభుత్వ-ప్రైవేట్ రంగ పరిశ్రమలకుపరిశోధన సంస్థలకు ఈ ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుందిదీనికి అనుగుణంగా పునరుత్పాదక ఇంధనంఅంకుర సంస్థలుసెమీకండక్టర్లుకృత్రిమ మేధ (ఎఐ), క్వాంటం టెక్నాలజీవాతావరణ ముప్పు-సుస్థిర వనరుల నిర్వహణ సహా వాతావరణ మార్పు ప్రభావాలతో సర్దుబాటుపర్యావరణ హిత వ్యవసాయం రెండింటిలోనూ సహకారం విస్తరిస్తుందిమరోవైపు అంతరిక్షం-అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్ ప్రగతిశ్రేయస్సుకే కాకుండా సహకారం విస్తరణలోనూ కీలక-ఆశావహ రంగం కాగలదని దేశాధినేతలిద్దరూ అంగీకారానికి వచ్చారు.

28. విద్య-పరిశోధన రంగాల్లో రెండు దేశాల మధ్య ఆదానప్రదానాలతోపాటు జర్మనీలో విద్యాభ్యాసం చేసే భారతీయుల సంఖ్య పెరుగుతుండటంపై దేశాధినేతలు సంతృప్తి వెలిబుచ్చారుఅలాగే పారిశ్రామిక-విద్యా రంగాల్లో ద్వైపాక్షికంగా వ్యూహాత్మక పరిశోధన-ఆవిష్కరణ భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో భారత్-జర్మనీ శాస్త్ర-సాంకేతిక విజ్ఞాన కేంద్రం (ఐజిఎస్‌టిసికీలక పాత్ర పోషించడాన్ని వారిద్దరూ అభినందించారుఈ దిశగా ‘ఐజిఎస్‌టిసి’ ఇటీవలి కార్యక్రమాలతోపాటు అత్యాధునిక మూల పదార్థ (అడ్వాన్స్డ్ మెటీరియల్స్రంగంలో 2+2 ప్రాజెక్టులకు మద్దతునిచ్చే ‘సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన’పై సంతకాలు చేయడాన్ని వారు హర్షించారు. ‘ఐజిఎస్‌టిసి’ ప్రాధాన్యం రీత్యా సాంకేతికత పురోగమనంతయారీ రంగాల్లో ఉమ్మడి విలువలతో కూడినఆవిష్కరణ చోదిత కొత్త భాగస్వామ్యాల విస్తరణరూపకల్పనపై వారిద్దరూ ఆసక్తి వ్యక్తం చేశారు.

29. రెండు దేశాల మ‌ధ్య ‘అంతర్జాతీయ పరిశోధన-శిక్షణ బృందం’ (ఐఆర్‌టిజిపేరిట తొలి ప్రాథ‌మిక ప‌రిశోధ‌న స‌ముదాయ న‌మూనా ప్రారంభానికి అధినేత‌లిద్ద‌రూ అంగీక‌రించారుదీన్ని భార‌త ప్ర‌భుత్వ శాస్త్ర-సాంకేతిక విభాగం (డిఎస్‌టి)జ‌ర్మ‌న్ రిసెర్చ్ ఫౌండేష‌న్ (డిఎఫ్‌జిసంయుక్తంగా ఏర్పాటు చేస్తాయిఇందులో భాగంగా ‘‘ఫోటోల్యూమినిసెన్స్ ఇన్ సూప్రామోలిక్యులర్ మాట్రిసెస్‌’’ అంశంపై పరిశోధనలో తిరువనంతపురంలోని ఐఐఎస్ఇఆర్ నుంచిజ‌ర్మ‌నీలోని వర్జ్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంపిక చేసిన తొలి బృందం పాలుపంచుకుంటుందిశాస్త్రవిజ్ఞాన-ఆవిష్కరణ రంగాలకు బలమైన పునాది దిశగా ‘భారత్-జర్మనీ ఆవిష్కరణ-చేయూత ఆదానప్రదాన కార్యక్రమం’ ప్రారంభించేందుకు వారు ఆసక్తి చూపారురెండు దేశాల్లోని విద్య-ప‌రిశోధ‌న సంస్థ‌ల‌లో శాస్త్రీయ ఆవిష్కరణలుచేయూత వాతావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల సృష్టి దిశ‌గా స‌మ‌ష్టి నైపుణ్యం-సామర్థ్యం పెంపులో ఇది తోడ్ప‌డుతుంది.

30. జర్మనీలోని ‘‘ఫెసిలిటీ ఫర్ యాంటీ-ప్రోటాన్ అండ్ అయాన్ రీసెర్చ్ (ఎఫ్ఎఐఆర్), డ్యుయిష్ ఎలెక్ట్రోనెన్ సింక్రోట్రాన్ (డిఇఎస్‌వై)’’ వంటి భారీ సంస్థల కార్యకలాపాల్లో భారత్ పాలుపంచుకోవడాన్ని ప్రశంసిస్తూ రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి సంబంధాలకు ఇది నిదర్శనమని వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ‘ఎఫ్ఎఐఆర్’ విస్తరణ దిశగా నిధుల పరంగానే కాకుండా ఇతరత్రా కార్యక్రమాలను సకాలంలో పూర్తిచేయడంపై నిబద్ధత ప్రకటించారుదీంతోపాటు సింక్రోట్రాన్ రేడియేషన్ ఫెసిలిటీ ‘పెట్రా-III, ‘డిఇఎస్‌వై’లోని ‘ఫ్రీ-ఎలక్ట్రాన్ లేజర్’ ప్రయోగశాల ‘ఫ్లాష్‌’ కార్యకలాపాల్లో సహకారం కొనసాగింపుపైనా వారిద్దరూ అంగీకారం తెలిపారు.

31. ఉన్నత విద్యారంగంలో భాగస్వామ్యాలు స్థిరంగా పెరుగుతుండటంపై రెండు ప్రభుత్వాలూ హర్షం వ్యక్తం చేశాయిద్వంద్వ-సంయుక్త డిగ్రీ కోర్సుల అభ్యాసానికివిశ్వవిద్యాలయాలతోపాటు ఉన్నత విద్యా సంస్థల మధ్య సహకారాత్మక విద్యా-పరిశోధక-ఆదానప్రదాన కార్యకలాపాల విస్తృతికి ఈ భాగస్వామ్యాలు తోడ్పడుతున్నాయిముఖ్యంగా ‘వాతావరణ మార్పులు-జల భద్రత’పై భారత-జర్మనీ తొలి సంయుక్త మాస్టర్స్ డిగ్రీ కోర్సుకు శ్రీకారం చుట్టడాన్ని ప్రశంసిస్తూదీనికి పూర్తి చేయూతనిస్తామని ఉభయ పక్షాలూ ప్రకటించాయిడ్రెస్డెన్‌లోని సాంకేతిక విశ్వవిద్యాలయం (టియు), ‘ఆర్‌డ‌బ్ల్యుటిహెచ్’ ఆచెన్ విశ్వవిద్యాలయంఐఐటి-మద్రాస్ (ఐఐటిఎంసంయుక్తంగా నిర్వహించే ఈ కోర్సుకు జర్మనీ విద్యారంగ ఆదానప్రదాన సేవా సంస్థ (డిఎఎడినిధులు సమకూరుస్తుందిదీంతోపాటు బోధనపరిశోధనఆవిష్కరణవ్యవస్థాపన అంశాల్లో ద్వైపాక్షిక సహకార విస్తరణ లక్ష్యంగా ‘అంతర-ప్రాంగణం’ (ట్రాన్స్‌క్యాంపస్ఏర్పాటుపై డ్రెస్డెన్‌లోని ‘టియు’, ‘ఐఐటిఎం’ల మధ్య త్వరలో ఒప్పందం ఖరారు కానుందిమరోవైపు భారత్-జర్మనీ విశ్వవిద్యాలయాల మధ్య సహకార ప్రాజెక్టులకు సంయుక్తంగా నిధులు సమకూర్చడంపై ఐఐటి-ఖరగ్‌పూర్, ‘డిఎఎడి’ల మధ్య అవగాహన ఒప్పందం కుదరడాన్ని రెండు ప్రభుత్వాలూ స్వాగతించాయిఅలాగే రెండు దేశాల విశ్వవిద్యాలయాల మధ్య సహకారానికి ప్రాధాన్యంతో ‘స్పార్క్’ (స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రిసెర్చ్ కొలాబరేషన్కింద ‘‘జర్మన్ ఇండియన్ అకడమిక్ నెట్‌వర్క్ ఫర్ టుమారో’’ (జెయింట్పేరిట శాశ్వత వ్యవస్థ ఏర్పాటుకు ఉభయ పక్షాలు గట్టి మద్దతు ప్రకటించాయి.

32. భార‌త్‌-జ‌ర్మ‌నీల మ‌ధ్య డిజిటల్-సాంకేతిక భాగస్వామ్యం బలోపేతం ల‌క్ష్యంగా సార్వ‌జ‌నీన డిజిటల్ మౌలిక స‌దుపాయాల (డిపిఐనైపుణ్యంఅనుభ‌వాల ఆదాన‌ప్ర‌దానానికి రెండు ప్రభుత్వాలూ అంగీకరించాయిఇందులో భాగంగా ‘డిపిఐ’లో భారత్‌ నైపుణ్యాన్ని జ‌ర్మ‌నీ వాడుకోవ‌డంతోపాటు రెండు దేశాల్లో ఆవిష్క‌ర‌ణ‌డిజిట‌ల్ రూపాంత‌రీక‌ర‌ణకు సార‌థ్యం వ‌హించ‌డంలో భారత ‘ఐటి’ పరిశ్రమ సామ‌ర్థ్యం వినియోగానికి మార్గాన్వేష‌ణ చేస్తారుఅలాగే ‘‘ఇంటర్నెట్ గవర్నెన్స్టెక్ రెగ్యులేషన్స్డిజిటల్ ట్రాన్స్‌ ఫర్మేషన్ ఆఫ్ ఎకానమీఎమర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ’’ వంటి అంశాల్లో ఆదానప్రదానాలకు కీలక వేదికగా 2023-24కుగాను ‘ఇండో-జర్మన్ డిజిటల్ డైలాగ్’ (ఐజిడిడిరూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై ఉభయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి.

33. ఆవిష్కరణ హితసమతులసార్వజనీనమానవాళి కేంద్రకష్టభయ ఆధారిత కృత్రిమ మేధ విధానాల అవసరాన్ని గుర్తిస్తూ సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో ఆ సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి కృషి చేయాలని ఉభయ పక్షాలూ అంగీకరించాయిరైతులకు తోడ్పాటు ద్వారా వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చడంతోపాటు ఉత్పాదకతవాతావరణ పునరుత్థానంకర్బన సంగ్రహణంసుస్థిరత పెంపులోనూ ‘ఇమేజ్ డిటెక్షన్’ ‘ఎఐ’ వంటి డిజిటల్ పరిజ్ఞానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయిఈ మేరకు డిజిటల్ వ్యవసాయ వృద్ధి సౌలభ్యం దిశగా రెండు దేశాలూ జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయిఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ ఆధునికీకరణ దిశగా ప్రస్తుత సహకారంఆవిష్కరణలుఆదానప్రదానాలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘డిజిటల్ వ్యవసాయంఎఐఐఒటి’ రంగాల్లో సహకార విస్తరణపై అంగీకారానికి వచ్చాయి.

34. కీలక-అత్యాధునిక సాంకేతికతలుఆవిష్కరణనైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారానికిగల వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని రెండు ప్రభుత్వాలూ గుర్తించాయిఈ నేపథ్యంలో ఆవిష్కరణ-సాంకేతిక భాగస్వామ్య భవిష్యత్ ప్రణాళిక నిర్దేశిస్తున్న ద్వైపాక్షిక సహకార ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించాయితదనుగుణంగా ఆవిష్కరణనైపుణ్యాభివృద్ధికీలక-అత్యాధునిక సాంకేతిక రంగాల్లో సహకారంపై దృష్టి సారించాలని నిర్ణయించాయిఆ మేరకు పరస్పర విశ్వాసంగౌరవంఉమ్మ‌డి విలువలుప్రజాస్వామ్య సూత్రాలను ప్రతిబింబించే పార‌ద‌ర్శ‌క‌సార్వ‌జ‌నీన‌సురక్షిత సాంకేతిక వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌లో సమ‌ష్టి నిబద్ధతను ఉభ‌య ప్ర‌భుత్వాలు గుర్తించాయిఈ దిశగా కీలక సాంకేతిక పరిజ్ఞానాల్లో రెండు దేశాల్లోని పారిశ్రామికవిద్యా రంగాల మధ్య సన్నిహిత సంధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాయితద్వారా రెండు దేశాలకూ నిర్దిష్ట రంగాల్లో ఫలితాధారితపరస్పర ప్రయోజనకర సాంకేతిక సహకారం సిద్ధిస్తుంది.

35. విపత్తుల ఉప‌శ‌మ‌నంసునామీ హెచ్చరికలుతీరప్రాంత ముప్పులుముందస్తు హెచ్చరిక వ్యవస్థలువిపత్తు న‌ష్టాల తగ్గింపుసముద్ర-ధ్రువ-జీవ-జీవ‌భౌగోళిక ర‌సాయ‌న‌-జీవ‌భౌతిక-భూగర్భ శాస్త్ర రంగాల్లో పరిశోధనలు వగైరాల‌లో సహకార విస్త‌ర‌ణ ల‌క్ష్యంగా అవ‌గాహ‌న ఒప్పందాలు కుద‌ర‌డంపై ఉభ‌య ప్ర‌భుత్వాలూ హ‌ర్షం వ్య‌క్తం చేశాయిఈ ఒప్పందాలపై రెండు దేశాల్లోని సంబంధిత సంస్థలు- ‘ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’, ‘హెల్మ్‌హోల్ట్జ్-జెంట్రమ్ పోట్స్‌డ్యామ్-డ్యుచెస్ జియోఫోర్స్చుంగ్స్‌జెంట్రమ్’నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్’, ‘ఆల్ఫ్రెడ్‌వెజెనర్-నిస్టిట్యూట్’హెల్మ్‌హోల్ట్జ్-జెంట్రమ్ ఫర్ పోలార్-అండ్ మీరెస్‌ఫోర్షంగ్‌’ సంతకాలు చేశాయి.

36. భారత అణుశక్తి విభాగం (డిఇఎపరిధిలోని ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్’ పర్యవేక్షణలోగల ‘నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్’ (ఎన్‌సిబిఎస్‌) ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్’ (ఐసిటిఎస్‌సంస్థలు జీవ-భౌతిక-గణిత శాస్త్ర రంగాల్లో జర్మనీలోని ‘మాక్స్-ప్లాంక్-గెషెల్ చాఫ్ట్’ సంస్థతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడంపై ఉభయ ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేశాయిదీంతో ఈ మూడు సంస్థల మధ్య విద్యార్థులుపరిశోధన సిబ్బంది సహా శాస్త్రవేత్తల పరస్పర పర్యటనలకు సౌలభ్యం కలుగుతుంది.

37. ‘ఓష‌న్‌శాట్‌-3రిశాట్‌-1ఎ’ ఉపగ్రహాల నుంచి స‌మాచార స్వీకర‌ణ‌క్రోడీక‌ర‌ణ కోసం జర్మనీలోని న్యూస్ట్రెలిట్జ్‌లోగ‌ల‌ అంతర్జాతీయ గ్రౌండ్ స్టేషన్ ఉన్న‌తీక‌ర‌ణ‌కు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్జిఎఎఫ్‌ఎజి’ మధ్య సంయుక్త సహకారాన్ని దేశాధినేత‌లిద్ద‌రూ ప్రశంసించారు.

సుస్థిర-హరిత భవిష్యత్ కోసం భాగస్వామ్యం

38. నికర శూన్య ఉద్గార లక్ష్యాల సాధనలో హరితసుస్థిరవాతావరణ ముప్పు  పునరుత్థానసమ్మిళిత ప్రగతికిగల ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలు అంగీకరించాయిదీనికి అనుగుణంగా వాతావరణ మార్పు కార్యాచరణసుస్థిర ప్రగతి దిశగా ద్వైపాక్షికత్రైపాక్షిక,  బహుపాక్షిక సహకారం గణనీయంగా పెంచుకోవాలని ప్రభుత్వాలు రెండూ నిర్దేశించుకున్నాయిఅలాగే ‘ఇండో-జర్మన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్’ (జిఎస్‌డిపికింద ఇప్పటిదాకా సాధించిన పురోగమనాన్ని ఉభయ పక్షాలూ సమీక్షించాయిపారిస్ ఒప్పందంతోపాటు నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డిజి)  సాధనను ఈ భాగస్వామ్యం వేగిరపరుస్తుందిఈ నేపథ్యంలో ‘కాప్29’ సందర్భంగా ప్రతిష్ఠాత్మక ఒప్పందాల దిశగాప్రత్యేకించి సరికొత్త సమష్టి పరిమాణాత్మక లక్ష్యం (ఎన్‌సిక్యుజి) దిశగా సంయుక్త కృషి అవసరాన్ని రెండు పక్షాలూ స్పష్టం చేశాయిరెండు దేశాల్లోని జాతీయ స్థితిగతులు నేపథ్యంగా తొలి ప్రపంచ కార్యాచరణ సహా ‘కాప్28’ నాటి ఒప్పందాలపై సానుకూల స్పందనకు ఉభయ పక్షాలూ అంగీకరించాయి.

39. ‘జిఎస్‌డిపి’ లక్ష్యాలపై మంత్రుల స్థాయి సమావేశం సందర్భంగా ప్రపంచ కార్యాచరణ పురోగమనాన్ని ఉభయ పక్షాలూ అభినందించాయి. ‘జిఎస్‌డిపి’ అమలుకు తోడ్పాటులో భాగంగా ప్రస్తుత కార్యాచరణ బృందాలుఇతర ద్వైపాక్షిక వ్యవస్థలుకార్యక్రమాల్లో క్రమం తప్పని చర్చల నిర్వహణకు తమ కట్టుబాటును పునరుద్ఘాటించాయిపారిస్ ఒప్పంద లక్ష్యాలు, ‘ఎస్‌డిజి’ సాధనలో భాగంగా ‘జిఎస్‌డిపి’ లక్ష్యాల పురోగతిపై సమీక్షకు నిర్ణయించాయిఈ మేరకు భారత్జర్మనీ ప్రభుత్వ స్థాయి సంప్రదింపుల పరిధి కింద మంత్రుల స్థాయిలో దుపరి సమావేశం నిర్వహిస్తారువాతావరణ మార్పు సవాళ్లపై సన్నిహిత సహకారం ఆవశ్యకతను రెండు పక్షాలూ స్పష్టం చేశాయితదనుగుణంగా త్వరలోనే భారత్-జర్మనీ వాతావరణ కార్యాచరణ బృందం సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి.

40. ‘జిఎస్‌డిపి’ పరిధిలో... ఉభయ పక్షాల పరంగా...

. భారత్-జర్మనీ హరిత ఉదజని భవిష్యత్ ప్రణాళికకు శ్రీకారంహరిత ఉదజని ఉత్పత్తివినియోగంఎగుమతి దిశగా భారత్ ఆకాంక్షలకు మద్దతివ్వడంలోనూ ఇది తోడ్పడుతుందిఅలాగే హరిత ఉదజనిని రెండు దేశాల్లోనూ సత్వరం సుస్థిర ఇంధన వనరుగా పరిగణించేందుకూ దోహదం చేస్తుంది.

బి. ‘జిఎస్‌డిపి’ డ్యాష్‌బోర్డ్‌ ప్రారంభం... ఇది అందరికీ అందుబాటులోగల ఆన్‌లైన్ వేదిక. ఈ అంశంలో జర్మనీభారత్ మధ్య సహకార విస్తృతిని ఇది ప్రస్ఫుటం చేస్తుందిఅలాగే కీలక ఆవిష్కరణలపై సంగ్రహావలోకనంతోపాటు సహకార విస్తృతి అనుభవాన్ని వివరిస్తుంది. ‘జిఎస్‌డిపి’ లక్ష్యాల సాధన దిశగా ప్రపంచ కార్యాచరణలో సమష్టి పురోగమనంపై సమీక్ష సౌలభ్యం కల్పిస్తుందిఅలాగే ప్రపంచ సవాళ్లకు వినూత్న పరిష్కారాలపై సంబంధిత భాగస్వాములకు కీలక సమాచారమిస్తుంది.

సి. సమ్మిళిత సామాజిక-ఆర్థిక ప్రగతిలో హరితసుస్థిర పట్టణీకరణ ప్రాధాన్యాన్ని, 2019లో మొదలైన హరిత పట్టణ రవాణా భాగస్వామ్యంతో లభించిన సత్ఫలితాలను ఉభయ పక్షాలూ గుర్తించాయిదీనికి అనుగుణంగా భార‌త్‌లో సుస్థిర పట్టణ రవాణాకు ప్రోత్సాహంపై ఉమ్మడి దృక్కోణానికి అనుగుణంగా ఈ భాగస్వామ్య పునరుద్ధరణమరింత పెంపు దిశగా సంయుక్త ప్రకటనపై సంతకం చేశాయి.

డి. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎవిజయాలను ఎంతగానో కొనియాడటంతోపాటు దాని భవిష్యత్ కార్యాచరణ దృక్కోణాన్ని దేశాధినేతలిద్దరూ ప్రశంసించారుఅంతేకాకుండా ఈ కూటమికి తమ సహకారం మరింత విస్తృతం చేయడానికి అంగీకరించారు.

. రియో సదస్సు తీర్మానాలు, ‘ఎస్‌డిజి’ల అమలుకు మద్దతుగా అటవీ క్షీణతను అరికట్టడంతోపాటు తాజా అటవీకరణ ద్వారా అడవుల విస్తీర్ణం పెంచడంలో సహకారాన్ని వారిద్దరూ ప్రశంసించారు.

 

41. ఇండో-జర్మన్ ఎనర్జీ ఫోరమ్ (ఐజీఈఎఫ్)తన కార్యకలాపాల ద్వారా జర్మనీభారత్ మధ్య సాధారణ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో, ప్రపంచ వాతావరణ మార్పుల సవాళ్లను పరిష్కరించడంలో ఫోరమ్ పాత్రను ఇరు దేశాల నేతలు ప్రశంసించారు.

42.  జర్మనీ భాగస్వామ్య దేశంగా గాంధీనగర్ లో సెప్టెంబర్ లో జరిగిన '4వ గ్లోబల్ రీ-ఇన్వెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ల మీట్', ఎక్స్‌పో ద్వారా  పునరుత్పాదక ఇంధన రంగంలో కీలక వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడంలో నిర్వహించిన పాత్రను ఇరు దేశాలు ప్రత్యేకంగా ప్రస్తావించాయిఈ రీఇన్వెస్ట్ సందర్బంగా ‘ఇండియా-జర్మనీ ప్లాట్‌ఫారమ్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ వరల్డ్‌వైడ్’ ప్రారంభమైన విషయాన్ని రెండు ప్రభుత్వాలు గుర్తు చేసుకున్నాయిఇది పునరుత్పాదక ఇంధన పెట్టుబడులను వేగంగా గమనించడానికీవ్యాపార సహకారాన్ని పెంపొందించడానికిప్రపంచ సరఫరా వ్యవస్థ విస్తరించడానికి కీలకంగా నిలిచింది. గ్రీన్ ఫైనాన్సింగ్టెక్నాలజీవ్యాపార అవకాశాల ఆదానప్రదానాల ద్వారా ఈ వేదిక భారతదేశంలోనూప్రపంచవ్యాప్తంగానూ పునరుత్పాదక శక్తి విస్తరణను వేగవంతం చేస్తుంది.

43.  రెండు ప్రభుత్వాలు 'జీవ వైవిధ్యంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ద్వారా సహకారాన్ని బలోపేతం చేయాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాయిప్రపంచ జీవ వైవిధ్య విధాన లక్ష్యాలను అమలు చేయడానికి చేసే ప్రయత్నంలో సీబీడీసీఓపీ-16 కీలకమైన ఘట్టాన్ని  సూచిస్తుందని అభిప్రాయపడ్డాయి.

44.  వ్యర్థాల నిర్వహణసంప్రదాయానికి భిన్నమైన ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన ఉమ్మడి కార్యాచరణ బృందం నిర్వహించిన చర్చలు, ఫలితాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారుఇది రెండు దేశాల మధ్య అనుభవాలుసాంకేతికతల పరస్పర మార్పిడిని వేగవంతం చేయడం ద్వారా అవకాశాలను పెంపొందించిందిఈ పరిధిలో సహకారాన్ని మరింతగా పెంచుకునే అవకాశాన్ని అన్వేషించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయిఇందుకు  ఉదాహరణసోలార్ వ్యర్ధాల రీసైక్లింగ్‌పై భవిష్యత్తు కార్యక్రమాలను కేంద్రీకరించడంసముద్ర వాతావరణంలోకి వ్యర్థాలుముఖ్యంగా ప్లాస్టిక్‌లు ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలువిధానాలను ప్రభావంతంగాసమర్థవంతంగా అమలు చేయడంలో ఇండో-జర్మన్ పర్యావరణ సహకారాన్ని వారు ప్రశంసించారుప్లాస్టిక్ కాలుష్యంపై చట్టబద్ధమైన గ్లోబల్ ఒప్పందాన్ని అమలు చేయడానికిసన్నిహితంగా సహకరించుకోవడానికి భారతదేశంజర్మనీ దేశాలు అంగీకరించాయి.

45.  త్రిముఖ అభివృద్ధి సహకారం (టీడీసీకింద సాధించిన పురోగతిని ఇరువురు నాయకులు ప్రశంసించారుఇది ఆఫ్రికాఆసియా దాటి వాతావరణ లక్ష్యాల సాధనకు మద్దతు ఇవ్వడానికి వారి ప్రాధాన్యతల ప్రకారం తృతీయ దేశాలలో స్థిరమైనఆచరణీయసమ్మిళిత ప్రాజెక్టులను అందించడానికి పరస్పర బలాలుఅనుభవాలను వినియోగిస్తుంది. కామెరూన్ఘనామలావి లో పైలట్ ప్రాజెక్టులు అందించిన ప్రోత్సాహకర ఫలితాలతో పాటుబెనిన్పెరూతో కొనసాగుతున్న కార్యక్రమాలలో సాధించిన పురోగతిని ఇరుపక్షాలు స్వాగతించాయిపైన పేర్కొన్న కార్యక్రమాల విజయవంతమైన అమలును దృష్టిలో ఉంచుకుని, 2024లో కామెరూన్ (వ్యవసాయం)మలావి (మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు)ఘనా (ఉద్యానవనాలు)తో పైలట్ ప్రాజెక్టుల సంఖ్యను పెంచడానికి రెండు ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇంకారెండు వైపులా మూడు చిరుధాన్యాలకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టుల ప్రారంభాన్ని స్వాగతించారుఅవి ఇథియోపియాతో రెండుమడగాస్కర్‌తో ఒకటిఅదనంగాభాగస్వాములను చేరుకోవడానికివారి ఉమ్మడి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ఎంచుకునిఅమలు చేయడానికి రెండు పక్షాలు సంస్థాగత యంత్రాంగాన్ని ప్రారంభించాయిదీని కోసం రెండు ప్రభుత్వాలు ఉమ్మడి సారధ్య సంఘంఉమ్మడి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశాయి.

46. లింగ సమానత్వానికి ప్రాముఖ్యత ఉందనిమహిళలుబాలికల సాధికారత కోసం పెట్టుబడి పెట్టడం 2030 ఎజెండాను అమలు చేయడంలో గుణకార ప్రభావాన్ని చూపుతుందని నాయకులు పునరుద్ఘాటించారుఈ విషయంలో జర్మనీ స్త్రీవాద విదేశాంగఅభివృద్ధి విధానాలను ప్రస్తావించారుప్రపంచ సవాళ్లను గమనంలోకి తీసుకునివాటిని పరిష్కరించడానికీనిర్ణయాధికారులుగా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడానికీమహిళల పూర్తిసమానప్రభావవంతమైన, అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారుహరితసుస్థిర అభివృద్ధిలో మహిళల కీలక పాత్రను ప్రోత్సహించడంలో ఇండో-జర్మన్ సహకారాన్ని బలోపేతం చేయాలనే కోరికను ఇరుపక్షాలు వ్యక్తం చేసాయి.

47. దీనితో పాటు జీఎస్డీపీ విధాన చట్రం పరిథిలో ఆర్థికసాంకేతిక సహకారం కోసం ప్రస్తుతం ఉన్న కార్యక్రమాలుకొత్త ప్రతిపాదనలకు సంబంధించి ఇప్పటికే సాధించిన కీలక విజయాలనూ ఇరుపక్షాలు స్వాగతించాయి:

2024 సెప్టెంబర్ లో భారత్జర్మనీ ప్రభుత్వాల మధ్య అభివృద్ధి సహకారంపై చర్చల సమయంలో అంగీకరించిన విధంగా జీఎస్డీపీ అన్ని ప్రధాన రంగాల్లో ఒక బిలియన్ యూరోల పైగా కొత్త ప్రతిపాదనలు ఉండగా, 2022లో జీఎస్డీపీ ప్రారంభం నుండి దాదాపు 3.2 బిలియన్ల యూరోల ప్రతిపాదనలు జోడించారు;
బిఇండో-జర్మన్ పునరుత్పాద ఇంధన భాగస్వామ్యం కిందఇంధన పరివర్తన దిశగా వినూత్న సౌరశక్తిహరిత ఉదజనిఇతర పునరుత్పాదకాలుగ్రిడ్ అనుసంధానంస్టోరేజ్పునరుత్పాద ఇంధన రంగంలో పెట్టుబడులకు ఇరుదేశాలు పరస్పర సహకారంపై దృష్టి సారించాయివిశ్వసించదగ్గనిరంతరాయ పునరుత్పాదక ఇంధన సరఫరా పరిష్కారాల ఆవశ్యకతను కూడా ఇరుపక్షాలు గుర్తించాయి. 
సి) "వ్యవసాయ జీవావరణసహజ వనరుల సుస్థిర నిర్వహణ"లో సహకారం వల్ల ఆదాయంలో వృద్ధిఆహార భద్రత,  వాతావరణ ప్రతిఘటనభూసారంజీవవైవిధ్యంఅటవీ విస్తరణ వ్యవస్థలునీటి భద్రతను పెంపొందించడం ద్వారా భారతదేశంలో సున్నితమైన గ్రామీణ జనాభాచిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

డి) స్థిరమైన పట్టణాభివృద్ధిపై తమ విజయవంతమైన సహకారాన్ని కొనసాగించాలనే ఉద్దేశాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. 


48. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరంగా గొప్ప పనితీరును ప్రదర్శించడాన్ని ఇరువురు నేతలూ ప్రశంసించారువాణిజ్యంపెట్టుబడి ప్రవాహాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశంజర్మనీ దేశాలలో ఔత్సాహికులను ప్రోత్సహించారురెండు దేశాల మధ్య ఇరు మార్గాలలో బలమైన పెట్టుబడులు, ప్రపంచ సరఫరా వ్యవస్థలలోకి విస్తరించడంలో ఆ పెట్టుబడుల సానుకూల ప్రభావాలను కూడా నాయకులు గుర్తించారుఈ సందర్భంలోజర్మనీకి చెందిన అత్యున్నత స్థాయి బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌ల భాగస్వామ్యంతో జర్మన్ వాణిజ్య ద్వైవార్షిక ప్రధాన ఫోరమ్- ఏపికే 2024, జర్మన్ వ్యాపారాలకు భారతదేశంలో అందుబాటులో ఉన్న అపారమైన అవకాశాలను ప్రదర్శించడానికి కీలకమైన వేదిక అని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

49. భారత్‌లో జర్మన్ వ్యాపారాలుజర్మనీలో భారతీయ వ్యాపారాల దీర్ఘకాల కొనసాగింపును ఇరుపక్షాలు స్పష్టం చేశాయిరెండు దేశాల మధ్య ఆర్థికవాణిజ్య సంబంధాలను మరింత పెంచే దిశగా కృషి చేసేందుకు అంగీకరించాయిఈ సందర్భంలోభారతదేశంజర్మనీకి చెందిన వ్యాపారపరిశ్రమల ప్రముఖులను నిమగ్నం చేయడానికి ఉన్నత స్థాయి వేదికగా పనిచేసే ఇండియా-జర్మనీ సీఈఓ ఫోరమ్ సమావేశాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయివాణిజ్యంపెట్టుబడి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఇండో-జర్మన్ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం సాధించిన విజయాలను కూడా వారు ప్రముఖంగా ప్రస్తావించారుదాని కార్యకలాపాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్టు పునరుద్ఘాటించారు.

50. ఆర్థిక వృద్ధిఉద్యోగ కల్పనలో సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు)/మిట్టెల్‌స్టాండ్(జర్మనీలో చిన్న పరిశ్రమలు)  ప్రాముఖ్యతను గుర్తిస్తూద్వైపాక్షిక పెట్టుబడులలో వృద్ధినిజర్మన్ మిట్టెల్‌స్టాండ్ ఎంటర్‌ప్రైజెస్‌కు మద్దతు ఇచ్చే 'మేక్ ఇన్ ఇండియా మిట్టెల్‌స్టాండ్ప్రోగ్రామ్ విజయాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి.  ఇది జర్మన్ మిట్టెల్‌స్టాండ్ సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంలో,  వ్యాపారం చేయడంలో మద్దతు ఇస్తుంది. ఇదే తరహాలోరెండు ప్రభుత్వాలు కూడా ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో అంకుర సంస్థలు పోషించే కీలక పాత్రను గుర్తించాయిభారతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని అంకుర సంస్థల ఏర్పాటును విజయవంతంగా సులభతరం చేసినందుకు జర్మన్ యాక్సిలరేటర్ (జీఏ)ని ప్రశంసించాయి. భారతదేశంలో తన కార్యక్రమాలను విస్తరించే ప్రణాళికలను స్వాగతించాయి. జర్మనీలో విపణిని భారతీయ అంకురాలకు చేరువ చేసే కార్యక్రమం రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఇరుపక్షాలు పేర్కొన్నాయి.


 

లేబర్ మార్కెట్లుమొబిలిటీప్రజల మధ్య సంబంధాల బలోపేతం:

51. సమాఖ్యరాష్ట్ర ప్రభుత్వాలుఅలాగే ప్రైవేట్ రంగంలోని ఆసక్తిదారుల మధ్య సహకారంతో నైపుణ్యం కలిగిన వారి వలసలపై ద్వైపాక్షిక సహకారం బహుళ రంగాల్లో విస్తరిస్తోందిదీనితో 'మైగ్రేషన్మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం' (ఎంఎంపిఏనిబంధనలను పూర్తిగా అమలు చేయడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయిఎంఎంపిఏలో వివరించిన ఈ అంశాలకు అనుగుణంగాన్యాయమైనచట్టపరమైన కార్మిక వలసలను ప్రోత్సహించడానికి ఇరుపక్షాలు అంకితభావంతో ఉన్నాయి. న్యాయమైన రిక్రూట్‌మెంట్ పద్ధతులుపారదర్శక వీసా ప్రక్రియలుకార్మికుల హక్కుల పరిరక్షణతో సహా వలస కార్మికులను గౌరవ మర్యాదలతో చూసేలా అంతర్జాతీయ ప్రమాణాల ద్వారా ఈ విధానం మార్గనిర్దేశం చేశారుఈ సూత్రాలపై దృష్టి సారించడం ద్వారాదోపిడీకి అవకాశం లేకుండాఅంతర్జాతీయ కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూఅన్ని పార్టీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నైపుణ్యం కలిగిన కార్మికులకు మార్గాన్ని సుగమం చేయడం ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

52. ఎంఎంపిఏ ఆధారంగాసంబంధిత మంత్రిత్వ శాఖల మధ్య పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్నిపరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పెంపొందించడానికి ఉపాధికార్మిక రంగంలో ఇరుపక్షాలు జాయింట్ 'డిక్లరేషన్ అఫ్ ఇంటెంట్'- జేడీఐ ని ఖరారు చేసాయి. 2023లో భారత జీ20 అధ్యక్షతన చేసిన ప్రకటనఅంతర్జాతీయ సూచన వర్గీకరణపై సాధ్యాసాధ్యాల అధ్యయనానికి మద్దతు ఇస్తుందని జర్మనీ తెలిపిందివృత్తిపరమైన వ్యాధులుపునరావాసంవైకల్యం ఉన్న కార్మికుల వొకేషనల్ ట్రైనింగ్ వంటి అంశాలలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇరువురు నేతలు సంసిద్ధత వ్యక్తం చేశారుఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసి)డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ (డీజీఈ)జర్మన్ సోషల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (డీజీయువీమధ్య జరిగే  ఒప్పందం ఇది. 

53. జర్మనీలోని బ్లూ కార్డ్ హోల్డర్లలో నాలుగింట ఒక వంతు భారతీయ నిపుణులు ఉన్నారని, ఇప్పుడు జర్మనీలోని అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే ఎక్కువ ఉన్నారని ఇరువురు నేతలు పేర్కొన్నారుదీనికి సంబంధించిజర్మనీలో ప్రతిభ  నైపుణ్యాల అవసరాలు - భారతదేశంలోని యువకులువిద్యావంతులునైపుణ్యం కలిగిన వ్యక్తుల విస్తారమైన నిక్షేపంఈ రెంటి మధ్య ఉన్న పరిపూరకాలను వారు గుర్తించారు. వారు జర్మన్ లేబర్ మార్కెట్‌కు గొప్ప ఆస్తిగా ఉంటారని భావిస్తున్నారుఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ జాతీయరాష్ట్ర స్థాయిలలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ఇండియా (ఎన్ఎస్డీసీ)ఇతర సారూప్య ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రస్తుత వినిమయాన్ని మరింతగా పెంచుతుందిభారతదేశం నుండి నైపుణ్యం కలిగిన వలసదారులను ప్రోత్సహించడానికి జర్మన్ ప్రభుత్వం కొత్త జాతీయ స్థాయి వ్యూహాన్ని ప్రారంభించడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.

54. నైపుణ్యాభివృద్ధివృత్తి విద్యశిక్షణపై అవగాహన ఒప్పందంపై సంతకం చేయడంపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారుఇది భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సమీకరించడంమహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యంగా గ్రీన్ స్కిల్స్ లో భారత్జర్మనీ బలాన్ని పెంచుతుంది. కార్మికుల అంతర్జాతీయ చలనశీలతను సులభతరం చేసే అంశాలను చేర్చేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

55. మాధ్యమిక పాఠశాలలువిశ్వవిద్యాలయాలువృత్తి విద్యా కేంద్రాలతో సహా భారతదేశంలో జర్మన్ భాష బోధనను విస్తరించాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయిభారతదేశంజర్మనీలో భాషా ఉపాధ్యాయుల శిక్షణతో సహా భారతదేశంజర్మనీలో పరస్పర భాషల బోధనను మరింత ప్రోత్సహించడానికి భారతీయజర్మన్ రాష్ట్రాలుసంస్కృతి కేంద్రాలువిద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారుభారతదేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ సర్టిఫికేట్‌ పొందేందుకు వీలుగా జర్మన్ ఉపాధ్యాయుల అధికారిక శిక్షణతదుపరి విద్య కోసం ఒక ఫార్మాట్ ను అభివృద్ధి చేయడానికి డీఏఏడీగోథే ఇన్స్టిట్యూట్ ఉమ్మడి ప్రయత్నాలను ఇరుపక్షాలు స్వాగతించాయి.

56. ఆర్థిక వృద్ధికి అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణుల సహకారాన్ని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి, "జర్మనీతో వ్యాపారంలో భాగస్వామ్యంకార్యక్రమం కింద సాధించిన ఫలితాలు సంతృప్తిగా ఉన్నాయని గుర్తించిభారతదేశం నుండి కార్పొరేట్ అధికారులు, జూనియర్ అధికారులకు అధునాతన శిక్షణపై జేడీఐ ని పునరుద్ధరించారు.

57. 'మైగ్రేషన్మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం' (ఎంఎంపిఏ)తోఅక్రమ వలసలను అంశంపై కూడా దృష్టి పెట్టాలని ఇరుపక్షాలు అంగీకరించాయిఈ ప్రయోజనం కోసంఎంఎంపిఏ అమల్లోకి వచ్చినప్పటి నుండి రెండు వైపులా 'వెనక్కి తిరిగి పంపే' ఏర్పాటుకు ఒక సహకార విధానాన్ని రూపొందించాయిఇరు దేశాలు ఇప్పటివరకు సాధించిన పురోగతిని స్వాగతించాయితగిన విధానపరమైన ఏర్పాట్ల ద్వారా సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడంక్రమబద్ధీకరించడం ముఖ్యమని స్పష్టమైన ఒక అభిప్రాయానికి వచ్చాయి.

58. ఇరు దేశాలుతమ జాతీయుల మధ్య పెరుగుతున్న సంబంధాలను నేతలు స్వాగతించారుపెరుగుతున్న ఈ సంబంధాల నుండి విస్తృతంగా ఉత్పన్నమయ్యే కాన్సులర్ సమస్యలపై తరచు సంప్రదింపులుచర్చల ఆవశ్యకతను ఇరు దేశాలు గుర్తించాయివివిధ కాన్సులర్వీసా సమస్యలతో పాటుసంబంధిత భూభాగాల్లో నివసిస్తున్న అవతలి వైపు జాతీయులను ప్రభావితం చేసే ఇతర సమస్యలపై ద్వైపాక్షిక చర్చల కోసం తగిన విధానాన్ని త్వరగా రూపొందించుకోవాలని వారు ఒక అంగీకారానికి వచ్చారు.

59. సాంస్కృతిక రాయబారులుగా, నూతన ఆవిష్కరణలుప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించే ఉత్ప్రేరకాలుగా తమ యువత పాత్రను ఇరు దేశాలు గుర్తించాయిఈ సందర్భంలోఇద్దరు నేతలు యువత సహకారం ప్రాముఖ్యతను స్పష్టం చేశారుఇరుపక్షాల మధ్య యూత్ ఎక్స్చేంజి, ప్రతినిధి బృందాల కోసం ఫోరమ్ ఏర్పాటు ప్రతిపాదనను గుర్తించారుపరస్పర ప్రాతిపదికన విద్యార్థుల పర్యటనలను సులభతరం చేయడానికి ఇరుపక్షాలు కూడా అంగీకరించాయి.

60. ఇరు దేశాలు సాంస్కృతిక రంగంలో జరుగుతున్న గణనీయమైన కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేసాయి'ప్రష్యన్ హెరిటేజ్ ఫౌండేషన్', 'నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ఇండియావంటి భారతీయజర్మన్ జాతీయ మ్యూజియంల మధ్య సహకారంపై అవగాహన ఒప్పందాన్ని విస్తరించే ప్రయత్నాలను ఇద్దరు దేశాధినేతలు స్వాగతించారు.

61. జీ20 న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ (2023)కి అనుగుణంగాసాంస్కృతి వారసత్వానికి చెందిన వస్తువుల వెనక్కి ఇచ్చివేయడంరక్షణజాతీయప్రాంతీయరాష్ట్ర స్థాయిలలో సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటానికి సంబంధించి సన్నిహితంగా సహకరించాలనే ఉద్దేశాన్ని ఇరువురు నేతలు స్పష్టం చేశారుసంబంధిత దేశానికి చెందిన వస్తువులను తిరిగి వెనక్కి చేర్చే అంశాలపై నిరంతర సంప్రదింపులు, చర్య కోసం పిలుపునిచ్చారు.

62. జర్మనీలోని విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యా పీఠాల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా గణనీయమైన సాంస్కృతికవిద్యాపరమైన  వినిమయ కార్యక్రమాలను రెండు ప్రభుత్వాలు కూడా ప్రశంసించాయి.
63. డో ఐజీసీ లో జరిగిన చర్చల పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారుఇండో-జర్మన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకుమరింతగా పెంచేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారుప్రధాని మోదీ సాదరంగా ఇచ్చిన ఆతిథ్యానికి ఛాన్సలర్ స్కోల్జ్ ధన్యవాదాలు తెలిపారుతదుపరి ఐజీసీకి ఆతిథ్యం ఇవ్వడానికి జర్మనీ ఎదురుచూస్తోందని అన్నారు.


(Release ID: 2068558) Visitor Counter : 40