ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ప్రధానమంత్రి ముద్రా యోజన- పీఎంఎంవై’ కింద అందించే రుణ మొత్తం రూ.10 నుంచి రూ. 20 లక్షలకు పెంపు

Posted On: 25 OCT 2024 12:36PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ముద్రా యోజన’ కింద ప్రస్తుతం అందిస్తున్న రూ.10 లక్షల రుణ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచనున్నట్లు  కేంద్ర ఆర్థిక మంత్రి జులై 23న 2024-25 బడ్జెట్లో చేసిన  ప్రకటనకు అనుగుణంగా పెంపు అమలు కానుందిరుణ లభ్యత సమస్యగా ఉన్న వారికి రుణాలు అందించాలన్న ముద్రా పథక లక్ష్యానికి అనుగుణంగానే  పెంపు నిర్ణయం జరిగిందిరుణం మొత్తం పెంపుకొత్తగా వస్తున్న పారిశ్రామికవేత్తలకు లబ్ధి కలిగించివారి పురోభివృద్ధికి దోహదపడుతుందిబలమైన పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వ నిబద్ధతకు ఈ చర్య తార్కాణంగా నిలుస్తోంది.

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకూ అందిస్తున్న రుణాలను తరుణ్ ప్లస్ విభాగంగా వర్గీకరించారుతరుణ్ విభాగం కింది రుణాలు పొందిరుణ మొత్తాన్ని తీర్చేసిన వారు ఈ తరుణ్ ప్లస్ కిం రుణం పొందడానికి అర్హులై ఉంటారుపీఎంఎంవై కింద రూ.20 లక్షల వరకూ అందిస్తున్న రుణానికి మైక్రో యూనిట్లకు చెందిన క్రెడిట్ గ్యారంటీ ఫండ్ హామీగా ఉంటుంది.

ప్రకటన ఇక్కడ Click here for notification.

 

 

***




(Release ID: 2068303) Visitor Counter : 65