సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పీబీ-శబ్ద్: 24/7 వార్తలు, 1500 మందికి పైగా రిపోర్టర్స్, ప్రత్యక్ష ప్రసారాలు, అందుబాటులో భద్రపరచిన సమాచారం
డిజిటల్ న్యూస్ పోర్టల్‌లు ఇప్పుడు పీబీ-శబ్ద్ ద్వారా దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో అందించే విశ్వసనీయ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు
నిష్పాక్షికమైన, లక్ష్యాత్మక వార్తలను దేశంలోని మారుమూల ప్రాంతాలకు అందించవచ్చు
2025 మార్చి వరకు పీబీ శబ్ద్ సేవల కోసం మీడియా సంస్థలకు అందుబాటులో ఉచిత సైన్ అప్
వచనం, వీడియో, చిత్రాలు, ఆడియో రూపాల్లో లోగో రహిత సమాచారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది
Posted On:
24 OCT 2024 7:04PM by PIB Hyderabad
డిజిటల్ న్యూస్ పోర్టల్స్ ఇప్పుడు https://shabd.prasarbharati.org/register లో సులుమైన సైన్ అప్ ఫారం పూరించడం ద్వారా పీబీ-శబ్ద్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో గల సమాచారాన్ని లోగో లేకుండా వచనం, వీడియో, చిత్రాలు, ఆడియో వంటి రూపాల్లో డిజిటల్ న్యూస్ పోర్టల్‌లకు అందుబాటులో ఉంచుతుంది. 2025 మార్చి వరకు మీడియా సంస్థలకు ఈ సేవ ఉచితం.
యూట్యూబ్ ఆధారిత డిజిటల్ న్యూస్ పోర్టల్స్ కోసం సభ్యత్వ ప్రమాణాలు:
1. ఇంగ్లిష్/హిందీ భాషల్లో గల పోర్టల్స్ కనీసం 1 లక్ష మంది చందాదారులను కలిగి ఉండాలి.
2. ప్రాంతీయ భాషా వార్తల పోర్టల్స్ కనీసం యాబై వేల మంది చందాదారులను కలిగి ఉండాలి.
3. యూట్యూబ్ ఖాతా కచ్చితంగా ధ్రువీకరించినదై ఉండాలి.
4. పోర్టల్ కనీసం 1 సంవత్సర కాలంగా ఉనికిలో ఉండాలి.
5. పోర్టల్ ప్రతి నెలా కనీసం 1 వీడియోను అప్‌లోడ్ చేస్తుండాలి, దరఖాస్తు చేసే సమయానికి చివరి నెల రోజుల్లో కనీసం 5 వీడియోలను అప్‌లోడ్ చేసి ఉండాలి.
డిజిటల్ న్యూస్ పోర్టల్స్ డిజిటల్ ప్రొఫార్మాను పూరించాల్సి ఉంటుంది, అనంతరం దానిని ప్రసార భారతిలో అంతర్గతంగా ధ్రువీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే డిజిటల్ న్యూస్ పోర్టల్‌లు పీబీ-శబ్ద్ కోసం నమోదు చేసుకోవచ్చు.
పీబీ-శబ్ద్ గురించి:
ప్రసార్ భారతి - షేర్డ్ ఆడియో-విజువల్స్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిసెమినేషన్ (పీబీ-శబ్ద్) మార్చి 13న ప్రారంభమైంది. ఇది మీడియా సంస్థలకు రోజువారీ వార్తల వివరాలతో పాటు వీడియో, ఆడియో, వచనం, చిత్రాలు సహా వివిధ రూపాల్లో గల వార్తలు, సమాచారాన్ని పంచుకునేందుకు అనుమతించే న్యూస్ షేరింగ్ సేవగా ప్రారంభమైంది.
విస్తృత కవరేజ్ కోసం విస్తృత నెట్‌వర్క్
1500 మందికి పైగా రిపోర్టర్‌లు, కరస్పాండెంట్‌లు, స్ట్రింగర్‌లతో కూడిన బలమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, 60 ప్రత్యేక ఎడిట్ డెస్క్‌ల సహాయంతో, పీబీ-శబ్ద్ ఇరవై నాలుగు గంటలూ దేశంలోని ప్రతి మూల నుంచీ తాజా వార్తలను అందిస్తుంది. ప్రాంతీయ వార్తా విభాగాలు (ఆర్ఎన్‌యూలు), ప్రధాన కార్యాలయాల ద్వారా వ్యవసాయం, సాంకేతికత, విదేశీ వ్యవహారాలు, రాజకీయ పరిణామాల వంటి 50కి పైగా వార్తా కేటగిరీలను కవర్ చేస్తూ, 1000కి పైగా వార్తా కథనాలను అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ప్రతిరోజూ అప్‌లోడ్ చేస్తుంది.
పీబీ-శబ్ద్ ప్రధాన లక్షణాలు
పీబీ శబ్ద్ అందించే సమాచారం లోగో లేకుండా ఉంటుంది అలాగే దీని ద్వారా పొందిన సమాచారాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఎటువంటి అట్రిబ్యూషన్ అవసరం ఉండదు. అదనంగా, ఈ సేవలో లైవ్ ఫీడ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది, ఇది జాతీయ పురస్కారాల వేడుకలు, ఎన్నికల ర్యాలీలు, ముఖ్యమైన రాజకీయ కార్యక్రమాలు, రాష్ట్రపతి భవన్ నుంచి వివిధ పత్రికా సమావేశాల వంటి ప్రత్యక్ష ప్రసారాల ప్రత్యేక కవరేజీని సైతం లోగో లేకుండా అందిస్తుంది.
దీని వినియోగాన్ని మరింత మెరుగుపరచడం కోసం మీడియా సమాచార భాండాగారాన్ని అర్కైవల్ లైబ్రరీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది దూరదర్శన్, ఆకాశవాణి లైబ్రరీల నుంచి అరుదైన, భద్రపరచిన పాత వార్తల ఫుటేజీలను ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన ప్యాకేజీలతో పాటుగా సులభంగా వినియోగించుకోవడానికి చందాదారులకు వీలు కల్పిస్తుంది.
తాజా నవీకరణల గురించి తెలుసుకోవడానికి పీబీ-శబ్ద్‌ను ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించవచ్చు.
మరిన్ని నవీకరణల కోసం, ఎక్స్ (గంతలో ట్విట్టర్)పై https://x.com/PBSHABD వద్ద అలాగే ఇన్‌స్టాగ్రామ్‌పై https://www.instagram.com/pbshabd/ వద్ద పీబీ-శబ్ద్ అందుబాటులో ఉంటుంది.
***
(Release ID: 2067988)
Visitor Counter : 36