ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బెంగళూరులో కూలిన భవంతి: మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం

నాడు పోస్టు చేయడమైనది: 24 OCT 2024 7:47AM by PIB Hyderabad

బెంగళూరులో ఒక భవంతి కూలిన సంఘటనలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారాన్ని ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఇవ్వనున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో చేసిన పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘బెంగళూరులో ఒక భవనం కూలిపోయిన కారణంగా ప్రాణనష్టం జరిగిందని తెలిసి బాధపడ్డాను. ఈ ఘటనలో సొంతవాళ్లను కోల్పోయిన వారికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారాన్ని పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తారు. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తులకు రూ. 50,000 చొప్పున అందిస్తారు: PM@narendramodi’’

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2067612) సందర్శకుల సూచీ సంఖ్య : : 92