సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్ లోని ఆనంద్ లో జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి బోర్డు (నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్ -ఎన్డిడిబి) వజ్రోత్సవాలు, శ్రీ త్రిభువన్ పటేల్ జయంతి సందర్భంగా రూ.300 కోట్ల విలువైన పలు రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో శ్వేత విప్లవం 2.0 పై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఒపి) జారీ ; ఇప్పుడు, లక్ష కొత్త, ప్రస్తుత పాడి పరిశ్రమలకు ప్రోత్సాహం; విస్తరించనున్న పాల సరఫరా మార్గాలు

వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి పేద రైతుల సాధికారత కోసం కృషి చేసిన త్రిభువన్ దాస్

త్రిభువన్ దాస్ సృష్టించిన ఒక చిన్న సహకార సంస్థ నేడు రెండు కోట్ల మంది రైతులను సహకార రంగంతో అనుసంధానించడం ద్వారా వేల కోట్ల రూపాయలలో వ్యాపారం

గడచిన 60 సంవత్సరాలుగా, సాధికారత, సంఘటితం చేయడం ద్వారా రైతులు, తల్లులు, అక్కాచెల్లెళ్ల అభ్యున్నతి,అభివృద్ధికి గణనీయంగా దోహదం చేసిన ఎన్డిడిబి

సహకార ఉత్పత్తులను బ్రాండింగ్ చేయడం, కార్పొరేట్ ఉత్పత్తులతో పోటీ పడటానికి వాటిని సిద్ధం చేయడం విజయానికి కీలకం

వ్యవసాయాన్ని స్వయంసమృద్ధం చేస్తూ గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసిన ఎన్డిడిబి

సహకార సంఘాల ద్వారా పశుపోషణతో రైతుల అభివృద్ధితో పాటు పోషకాహార లోపంపై పోరాటం బలోపేతం

ఎన్డిడిబి కూరగాయల ప్రాసెసింగ్ ను ప్రారంభించడంతో రైతులు పండించిన కూరగాయలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు చేరుకుని లాభాలు నేరుగా రైతులకు చేరే సౌ

Posted On: 22 OCT 2024 5:03PM by PIB Hyderabad

గుజరాత్ లోని ఆనంద్ లో శ్రీ త్రిభువన్ దాస్ పటేల్ జయంతిని,  జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డిడిబి) వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోం , సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు రూ.300 కోట్ల విలువైన పలు రైతు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో ఇటీవల ప్రారంభించిన శ్వేత విప్లవం 2.0 కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఒపి) విడుదలయ్యాయని, ఇందులో ప్రధానమంత్రి పేర్కొన్న అన్ని రైతు-హిత అంశాలు చేర్చారని పేర్కొన్నారు. సహకార రంగం లక్ష కొత్త, ప్రస్తుత డెయిరీలకు సాధికారత కల్పిస్తుందని, రెండో శ్వేత విప్లవం పాల ఉత్పత్తి, సరఫరా మార్గాలను విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కష్టపడి పనిచేసే శ్రీ త్రిభువన్ దాస్ జీవితాన్ని వర్ణించడం అసాధ్యమని, తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, దేశంలోని పేద రైతుల సాధికారత కోసం ఒక ప్రత్యేక దార్శనికతతో ఆయన పనిచేశారని శ్రీ అమిత్ షా అన్నారు.  ఆయన తన జీవితాంతం నిస్వార్థంగా దేశంలోని పేద రైతుల సాధికారత కోసం పని చేశారని, వ్యక్తిగత లాభాలను పక్కనపెట్టి, ప్రతి రైతును నిజమైన సహకార స్ఫూర్తితో అనుసంధానించడానికి తన ప్రయత్నాలను అంకితం చేశారని, ఈ ప్రయత్నంలో గొప్ప విజయాన్ని సాధించారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. త్రిభువన్ దాస్ కారణంగానే దేశంలోని ఐదుకోట్లమంది పశువుల పెంపకందారులు ప్రశాంతంగా నిద్రపోతున్నారని, నేడు దేశంలో కోట్లాది మంది రైతులు, ముఖ్యంగా మహిళలు సుభిక్షంగా ఉన్నారని శ్రీ అమిత్ షా అన్నారు. త్రిభువన్ దాస్ స్థాపించిన ఒక చిన్న సహకార సంఘం నేడు దేశంలోని రెండుకోట్లమంది రైతులను సహకార రంగంతో అనుసంధానించడం ద్వారా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోందని అన్నారు.

1964లో, మాజీ ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి అమూల్ డెయిరీని సందర్శించి, ఈ విజయవంతమైన మోడల్ ద్వారా గుజరాత్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న పశుసంవర్ధకులు లాభపడాలని నిర్ణయించారని కేంద్ర సహకార శాఖ మంత్రి గుర్తు చేశారు. ఆ దరిమిలా శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ఎన్డిడిబిని స్థాపించాలని నిర్ణయించారని చెప్పారు.60 ఏళ్లలో ఎన్డిడిబి దేశవ్యాప్తంగా సహకార రంగానికి, రైతులకు, తల్లులకు, సోదరీమణులకు సాధికారత కల్పించడమే కాకుండా, వారి హక్కులపై అవగాహన పెంచేందుకు కృషి చేసిందని చెప్పారు. సహకార సంఘాల ద్వారా పశుపోషణ చేస్తే రైతులకు సౌభాగ్యం కలగడమే కాకుండా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సమస్య కూడా పరిష్కారమవుతుందన్నారు.  అమూల్ ద్వారా నిర్మించిన ట్రస్ట్ మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా బలమైన పౌరులను సృష్టించడానికి పునాది వేసింది.


ఎన్డిడిబి గ్రామీణ రంగంతో పాటు, దేశాభివృద్ధిని కూడా వేగవంతం చేసిందని, అలాగే వ్యవసాయాన్ని స్వావలంబనగా మార్చిందని శ్రీ అమిత్ షా అన్నారు. శ్రీ త్రిభువన్ ఎన్డిడిబికి పునాది వేశారని, ఇది నేడు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చాలా పెద్ద సంస్థగా మారిందని ఆయన అన్నారు. 1987 లో ఎన్డిడిబి ఒక అధికారిక సంస్థగా మారిందని, 1970 నుండి 1996 వరకు, ఇది ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసి అమలు చేసిందని, ఇది శ్వేత విప్లవానికి దారితీసిందని ఆయన అన్నారు. అమూల్ నేడు రూ.60,000 కోట్ల వార్షిక వ్యాపారాన్ని నిర్వహిస్తోందని, ఇది మొదట్లో మహిళల నుండి చాలా తక్కువ భాగస్వామ్య పెట్టుబడితో మొదలైందని ఆయన పేర్కొన్నారు.1964లో లాల్ బహదూర్ శాస్త్రి ఎన్డిడిబిని స్థాపించాలని నిర్ణయించినప్పుడు అది ఒక రోజు పెద్ద మర్రిచెట్టుగా పెరిగే చిన్న విత్తనమని ఎవరికీ తెలియదని అన్నారు. ఎన్డిడిబి ద్రవ పాల (లిక్విడ్ మిల్క్)  అమ్మకాలు రోజుకు 427 లక్షల లీటర్లకు చేరుకోగా, సేకరణ రోజుకు 589 లక్షల లీటర్లకు చేరింది. ఆదాయం రూ.344 కోట్ల నుంచి రూ.426 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.50 కోట్లుగా ఉంది.

ఎన్డిడిబి కూరగాయల ప్రాసెసింగ్ ను ప్రారంభించిందని, దీనితో మన రైతులు పండించిన కూరగాయలు మొత్తం ప్రపంచానికి చేరడానికి వీలు అయిందని, సహకార నమూనా కింద లాభాలను అట్టడుగు వర్గాలకు పంపిణీ చేస్తామని శ్రీ అమిత్ షా చెప్పారు. గోబర్ధన్ పథకం మన భూముల సంరక్షణ, మెరుగుదలకు, పంటల దిగుబడులు పెరగడానికి, రైతుల ఆదాయం పెంపునకు, శుభ్రమైన పరిసరాల సృష్టికి దోహదపడిందని తెలిపారు.ఆవు పేడ నుంచి గ్యాస్, ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయని, కార్బన్ క్రెడిట్ రూపంలో చెల్లింపులు మన తల్లులు, సోదరీమణులకు చేరుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నిర్ణయాల ద్వారా గోబర్ధన్ పథకాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేశారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఎన్డిడిబి 10,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ - ఎఫ్ పిఒ)లను రిజిస్టర్ చేసిందని తెలిపారు.

ఎన్డిడిబి ఏర్పాటు తరువాత, పాడి పరిశ్రమలోని అన్ని ప్లాంట్లు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారతదేశంలో ఏర్పాటు అవుతాయని శ్రీ అమిత్ షా తెలిపారు. రూ.210 కోట్లతో మదర్ డెయిరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ కు నేడు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇంకా, ఉత్తరాఖండ్ కు చెందిన బద్రి నెయ్యి, మదర్ డెయిరీకి చెందిన గిర్ నెయ్యి బ్రాండ్ ను కూడా ఈ రోజు ప్రారంభించారు. సహకార ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయడం, కార్పొరేట్ వస్తువులతో మార్కెట్లో పోటీ పడేలా సిద్ధం చేయడం విజయానికి కీలకమని ఆయన అన్నారు. నేడు, మన అమూల్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంది, ఇది మనకు గణనీయమైన విజయం. లద్దాఖ్ నుంచి నేరేడు పండ్లు, హిమాచల్ నుంచి ఆపిల్ పండ్లు, మేఘాలయ నుంచి పైనాపిల్స్ రైతులు ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందుతారని ఆయన పేర్కొన్నారు.


సహకార మంత్రిత్వ శాఖ కొత్తగా మూడు జాతీయ స్థాయి సహకార సంస్థలను ఏర్పాటు చేసిందని కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు. ప్రభుత్వ నాయకత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటేనే ఇలాంటి కొత్త కార్యక్రమాలు చేపట్టగలమని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సహకార రంగంలో అనేక కార్యక్రమాలను, పథకాలను అమలు చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో 22 రాష్ట్ర సమాఖ్యలు, 231 జిల్లా సమాఖ్యలతో పాటు 28 మార్కెటింగ్ డెయిరీలు, 21 పాల ఉత్పత్తి సంస్థలు పనిచేస్తున్నాయి.

మోదీ ప్రభుత్వం కొత్తగా రెండు లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను (పీఏసీఎస్) ఏర్పాటు చేయబోతోందని, ఇది మన సహకార వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ ప్రయత్నం సహకార రంగంలోని అన్ని సంస్థల బలాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. 231 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో అమెరికాను భారత్ అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మన పాల ఉత్పత్తి వృద్ధి రేటు 6 శాతం కాగా, ప్రపంచ వృద్ధి రేటు కేవలం 2 శాతం మాత్రమే. నేడు 8 కోట్ల గ్రామీణ కుటుంబాలు రోజూ పాలను ఉత్పత్తి చేస్తుంటే కేవలం కోటిన్నర కుటుంబాలు మాత్రమే సహకార రంగంతో అనుసంధానమై ఉన్నాయి. అంటే మిగిలిన 6.5 కోట్ల కుటుంబాలు న్యాయమైన ధరలను పొందడం లేదని, దోపిడీకి గురవుతున్నారని అన్నారు. భవిష్యత్తులో పాల ఉత్పత్తిలో ఉన్న మొత్తం 8 కోట్ల రైతు కుటుంబాలు తమ కష్టానికి పూర్తిగా పరిహారం పొందేలా చేసి, వారు సహకార రంగంతో అనుసంధానమయ్యేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహకార మంత్రి స్పష్టం చేశారు.

సహకార సంఘాలను సాధికారం చేసే ప్రచారం ఫలితంగా, దేశంలో పాల లభ్యత 1970 లో ఒక వ్యక్తికి 40 కిలోలు, 2011 లో 103 కిలోలకు పెరిగిందని, 2023 లో ప్రతి వ్యక్తికి 167 కిలోలకు పెరిగిందని శ్రీ అమిత్ షా తెలిపారు. సగటు ప్రపంచ పాల లభ్యత ప్రతి వ్యక్తికి 117 కిలో గ్రాములుగా ఉందని తెలిపారు.


 

***


(Release ID: 2067219) Visitor Counter : 59