రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగాన్ని పుంజుకోవాలన్న కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
నాగాలాండ్ లో 29 జాతీయ రహదారి పథకాల పురోగతిపై సమీక్ష
Posted On:
22 OCT 2024 12:35PM by PIB Hyderabad
నాగాలాండ్ లో జాతీయ రహదారులపై సమీక్ష సమావేశాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ సహాయ మంత్రులు శ్రీ అజయ్ టమ్‌టా, శ్రీ హర్ష్ మల్హోత్ర లతో పాటు నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ టీ.ఆర్. జెలియాంగ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఈ కింది విధంగా తెలియజేశారు:
‘‘నాగాలాండ్ లో 545 కిలోమీటర్ల మేర సాగుతున్న 29 జాతీయ రహదారి పథకాల పురోగతిని సమీక్షించాను. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ సహాయ మంత్రులు శ్రీ అజయ్ టమ్‌టా జీ, శ్రీ హెచ్.డీ. మల్హోత్ర జీ, నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ టీ.ఆర్. జీలియాంగ్ జీలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాగాలాండ్ లో గతిశీల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడంలో ఆ సదుపాయాలు దీర్ఘకాలం పాటు మన్నేవిగాను, నిధులు ఏమంత ఎక్కువ ఖర్చు కాకుండా చూస్తూ పనుల వేగాన్ని పెంచాల్సిన అవసరాన్ని సమావేశంలో మేం స్పష్టం చేశాం. ఈ కార్యక్రమాలు అనుసంధానాన్ని పెంచడం, ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి అండదండలను అందించడంతో పాటు భారతదేశపు సర్వతోముఖాభివృద్ధిలో నాగాలాండ్ ఇప్పటి కన్నా మిన్నగా తోడ్పాటును అందించేందుకు దోహదం చేయనున్నాయి’’
మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ‘ఎక్స్’ లోనే మరొక పోస్టులో... ‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ దార్శనికతతో ప్రేరణను పొంది, నాగాలాండ్ లోని హైవేలు వృద్ధికి జీవనాడులుగా రూపొందుతున్నాయి. ప్రతి ఒక్క కొత్త రహదారితో భవిష్యత్కాలపు అనుసంధానానికి, సమృద్ధికి, ఇంకా ప్రగతికి బాట పడుతోంది.’’ అని పేర్కొన్నారు.
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో తొలి రోజున ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు నాలుగింటిలో జాతీయ రహదారుల పనులు సాగుతున్న తీరును సమీక్షించారు. సమీక్ష వీడియోను ‘ఎక్స్’ వేదికలో ఆయన పొందుపరిచారు. ఆ వీడియోను ఈ కింది ఇచ్చిన లింక్‌లో చూడవచ్చు: -
ఈశాన్య ప్రాంత జాతీయ రహదారి ప్రాజెక్టుల సమీక్ష సమావేశాలు (ఒకటో రోజు).
(Release ID: 2067015)
Visitor Counter : 42