హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా


చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర హోం మంత్రి

గంగా నదిపై రైలు రోడ్డు వంతెన నిర్మాణం సహా ₹2,642 కోట్ల వ్యయంతో వారణాసిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ రైతు సంక్షేమం కోసం అంకితభావంతో ఉన్నారు

ఆయన నాయకత్వంలో 2025-26 సీజన్ కోసం రబీ పంటల మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
రైప్ సీడ్, ఆవాల కనీస మద్దతు ధర అత్యధికంగా క్వింటాల్ కు రూ.300 పెంపు

ఎర్ర కందిపప్పు (మసూర్) కోసం చరిత్రాత్మకంగా క్వింటాలుకు రూ. 275 పెంపు
పెరిగిన మద్దతు ధరలతో రైతుల ఆదాయం పెరుగుతుంది

మన రైతులు మరింత సంపన్నులు అవుతారు
పండుగ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అదనంగా 3 శాతం కరువు భత్యం (డీఏ) పెంపు

పింఛనుదారులకు అంతే మొత్తం కరవు భత్యం (డీఆర్) పెంపు

Posted On: 16 OCT 2024 6:56PM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గం ఈరోజు తీసుకున్న నిర్ణయాలను కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా స్వాగతించారు. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమం ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రూ. 2,642 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వారణాసి-పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గంగానదిపై రైలురోడ్డు వంతెన నిర్మాణం కూడా దీనిలో భాగంగా ఉందిఈ ప్రాజెక్ట్ రైల్వే లైన్లను 30 కిలోమీటర్ల మేర విస్తరించనుందిదేశంలో రైలు అనుసంధానాన్ని నిరంతరం ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీజీకి కృతజ్ఞతలు” అని ఒక పోస్ట్లో శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతు సంక్షేమానికి అంకితమయ్యారు. ఆయన నాయకత్వంలో 2025-26 సీజన్‌ కోసం రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందిరైప్ సీడ్ఆవాలకు కనీస మద్దతు ధర అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 300 పెరిగింది. అలాగే ఎర్ర కందిపప్పు (మసూర్కోసం చరిత్రాత్మకంగా క్వింటాల్‌కు రూ. 275 పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందిఈ పెరిగిన మద్దతు ధరలతో రైతుల ఆదాయం పెరిగి, మన రైతులు మరింత సంపన్నులు కానున్నారురైతుల ప్రతి ఆందోళనను పరిష్కరించిన మోదీజీకి కృతజ్ఞతలు” అని కేంద్ర హోం మంత్రి మరో పోస్ట్ చేశారు.

పండుగల సీజన్‌లోప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలోకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), పింఛనుదారులకు కరువు భత్యం (డీఆర్)ని అదనంగా శాతం పెంచుతున్నట్లు మంత్రివర్గం ప్రకటించిందిఈ నిర్ణయంతో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు64.89 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందనున్నారుఈ ప్రత్యేక కానుక అందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పేర్కొంటూ శ్రీ అమిత్ షా మరో పోస్ట్ చేశారు.



(Release ID: 2065613) Visitor Counter : 23