వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025-26 మార్కెటింగ్ సీజన్‌కు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు: కేబినెట్ ఆమోదం

Posted On: 16 OCT 2024 3:13PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు (ఎంఎస్‌పీ)నకు ఆమోదం తెలిపింది.

పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకు గాను 2025-26 మార్కెటింగ్ సీజన్లో రబీ పంటలకు ఎంఎస్‌పీను కేంద్రం పెంచింది. ఆవాలు, ర్యాప్‌సీడ్ (ఆవజాతికి సంబంధించినది) పంటకు క్వింటాల్ కు రూ.300, కందుల (మసూర్)కు క్వింటాలుకు రూ.275 చొప్పున అత్యధికంగా మద్ధతు ధర పెరిగింది. పప్పు ధాన్యాలు, గోధుమలు, కుసుమలు, బార్లీకి వరుసగా క్వింటాలుకు రూ. 210, రూ.150, రూ. 140, రూ 130 చొప్పున పెరిగాయి.


2025-26 మార్కెటింగ్ సీజన్లో రబీ పంటలకు అందించిన కనీస మద్ధతు  ధర(రూ. క్వింటాల్  కు)

 

క్రమసంఖ్య

పంటలు

ఎంఎస్‌పీ ఆర్ఎంఎస్ 2025-26

ఉత్పత్తి వ్యయం* ఆర్ఎంఎస్

2025-26

పెట్టుబడిపై మిగులు

(శాతంలో)

ఎంఎస్‌పీ ఆర్ఎంఎస్ 2024-25

మద్ధతు ధరలో పెరుగుదల

(మొత్తంగా)

1

గోధుమ

2425

1182

105

2275

150

2

బార్లీ

1980

1239

60

1850

130

3

పప్పుధాన్యాలు

5650

3527

60

5440

210

4

కందులు 

6700

3537

89

6425

275

5

ర్యాప్‌సీడ్, ఆవాలు

5950

3011

98

5650

300

6

కుసుమలు

5940

3960

50

5800

140

 

*  కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పంపుసెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి

 

2025-26 మార్కెటింగ్ సీజన్లో తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధరలో పెరుగుదల 2018-19 కేంద్ర బడ్జెట్లో సూచించిన విధంగా దేశం మొత్తం సరాసరి ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు ఎక్కువ ఉండేలా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గణించిన సరాసరి ఉత్పత్తి వ్యయం ఆధారంగా అంచనా వేసిన లాభం గోధుమలకు 105 శాతంగా ఉంది.  దాని తర్వాత రాప్‌సీడ్, ఆవాలకు 98 శాతం, కందులకు 89 శాతం, పప్పుధాన్యాలకు 60 శాతం,  బార్లీకి 60 శాతం, కుసుమలకు 50 శాతంగా ఉంది. పెరిగిన ధరలు రైతులకు లాభాలను అందించడంతో పాటు పంటల సాగులో వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

 
****


(Release ID: 2065421) Visitor Counter : 39