రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతి విజయదశమి శుభాకాంక్షలు
Posted On:
11 OCT 2024 5:03PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలను తెలిపారు.
రాష్ట్రపతి ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘మంగళప్రదం అయిన విజయదశమి సందర్భంగా, నేను తోటి పౌరులందరికీ నా స్నేహపూర్వక అభినందనలను, శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
అన్యాయంపై న్యాయం గెలవడాన్ని విజయదశమి పండుగ సూచిస్తుంది. ఈ సందర్భంగా, మన దేశం నలుమూలలా ధార్మిక కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలను మహోత్సాహంతో జరుపుకోవడం ఆనవాయితీ.
ఈ పవిత్ర పర్వదినం సమున్నత మానవ ఆదర్శాల పట్ల మన విశ్వాసాన్ని మరింతగా బలపరచుకోవాలని గుర్తుచేస్తుంది. ఆత్మగౌరవం, కర్తవ్య నిష్ఠ, నడవడికలో నైతికత, వినయం, న్యాయం పక్షాన నిలబడుతూ ధైర్యంతోను, సాహసంతోను పోరును సాగించడం.. ఇవన్నీ ఈ పండుగతో ముడిపడి ఉన్నాయి. ఇవే గాథల నుంచి మనం ప్రేరణను పొందాలి.
శ్రద్ధ, ఉత్సాహాల కలబోత అయిన ఈ పండుగ అందరికీ సాఫల్యాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని ప్రసాదించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ’’
(Release ID: 2064329)
Visitor Counter : 38
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam