ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను ఆదాయం వాటా బదిలీ కింద 2024 అక్టోబరు నెలలో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా రూ. 89,086.50 కోట్లతో సహా రూ. 1,78,173 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
పండుగ సీజన్ తోపాటు, మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి, రాష్ట్రాలు తమ అభివృద్ధి/ సంక్షేమ వ్యయాలకు నిధులు సమకూర్చడానికి వీలుగా ముందస్తు వాయిదా విడుదల
Posted On:
10 OCT 2024 1:25PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను ఆదాయం వాటా బదలాయింపు కింద రూ.1,78,173 కోట్లను విడుదల చేసింది. ఇందులో 2024 అక్టోబరు నెలలో చెల్లించాల్సిన సాధారణ వాయిదా ₹89,086.50 కోట్లకు అదనంగా ఒక అడ్వాన్స్ వాయిదాను కూడా చెల్లించింది.
పండుగల సమయంతోపాటు, రాష్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికీ, అభివృద్ధి, సంక్షేమ సంబంధిత వ్యయాలకు నిధులు సమకూర్చడానికి వీలుగా ఈ ముందస్తు వాయిదాను విడుదల చేశారు.
రాష్ట్రాల వారీగా విడుదల చేసిన మొత్తాల వివరాలను పట్టికలో చూడవచ్చు. 2024 అక్టోబర్ నెలకు సంబంధించి రాష్ట్రాల వారీగా కేంద్ర పన్నులు, సుంకాల ఆదాయం నికర పంపిణీ.
వరస నెం.
|
రాష్ట్రం
|
మొత్తం (రూ. కోట్లు)
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
7,211
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
3,131
|
3
|
అస్సాం
|
5,573
|
4
|
బీహార్
|
17,921
|
5
|
ఛత్తీస్ ఘడ్
|
6,070
|
6
|
గోవా
|
688
|
7
|
గుజరాత్
|
6,197
|
8
|
హర్యానా
|
1,947
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
1,479
|
10
|
ఝార్ఖండ్
|
5,892
|
11
|
కర్ణాటక
|
6,498
|
12
|
కేరళ
|
3,430
|
13
|
మధ్య ప్రదేశ
|
13,987
|
14
|
మహారాష్ట్ర
|
11,255
|
15
|
మణిపూర్
|
1,276
|
16
|
మేఘాలయ
|
1,367
|
17
|
మిజోరం
|
891
|
18
|
నాగాలాండ్
|
1,014
|
19
|
ఒడిశా
|
8,068
|
20
|
పంజాబ్
|
3,220
|
21
|
రాజస్థాన్
|
10,737
|
22
|
సిక్కిం
|
691
|
23
|
తమిళ నాడు
|
7,268
|
24
|
తెలంగాణ
|
3,745
|
25
|
త్రిపుర
|
1,261
|
26
|
ఉత్తరప్రదేశ్
|
31,962
|
27
|
ఉత్తరాఖండ్
|
1,992
|
28
|
వెస్ట్ బెంగాల్
|
13,404
|
***
(Release ID: 2063992)
Visitor Counter : 81