రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

అఖిల భారత ఆయుర్వేద సంస్థ ఏడో స్థాపక దినోత్సవానికి హాజరైన రాష్ట్రపతి సమగ్ర వైద్యానికి ప్రపంచవ్యాప్త ఆదరణ: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము భిన్న వైద్య విధానాల మధ్య సహకారం అవసరం

Posted On: 09 OCT 2024 2:17PM by PIB Hyderabad

నిన్న న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏఏడో స్థాపక దినోత్సవంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ... ప్రపంచంలో అతి ప్రాచీన వైద్య విధానాల్లో ఆయుర్వేదం ఒకటి అని అన్నారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వెల కట్టలేని బహుమతి ఆయుర్వేదమని ఆమె అన్నారు. ఆయుర్వేద వైద్య పద్ధతి మనస్సుకుశరీరానికిఆత్మకు మధ్య సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూనే సంపూర్ణ ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తోందని రాష్ట్రపతి అన్నారు.

మన పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న మొక్కలకువృక్షాలకు గల వైద్య విలువ మనకు ఎప్పటి నుంచో తెలుసుననీ, వాటిని మనం ఉపయోగించుకుంటూ వస్తున్నామనీ రాష్ట్రపతి అన్నారు. ‘‘ఆదివాసీ సమాజంలో ఔషధీయ మొక్కలతో పాటు మూలికల తాలూకు జ్ఞాన పరంపర మరింత అధికం. అయితే ఆధునికత వైపు సంఘం మొగ్గు ను చూపిప్రకృతికి దూరంగా కదలిపోయిందిఈ కారణంగామనం సాంప్రదాయిక జ్ఞానాన్ని వినియోగించుకోవడం మానేశాం. ఇంటి చిట్కాలను అవలంబించే కన్నా వైద్య నిపుణుల వద్దకు పోయి మందులను తీసుకోవడం సులభతరమైపోయింది. ప్రస్తుతం ప్రజలలో అవగాహన పెరుగుతోంది. ఇప్పుడుసమీకృత వైద్యం అనే ఆలోచనకు ప్రపంచమంతటా జనాదరణ లభిస్తోందిేర్వేరు వైద్య విధానాలు ఒకదానికి మరొకటి సహాయకారిగా ఉంటూప్రజలకు స్వస్థతను సమకూర్చడంలో తోడ్పడుతున్నాయి’’ అని రాష్ట్రపతి అన్నారు.


 

 

ఆయుర్వేద వైద్య విధానంపై తరతరాలుగా నమ్మకం ఉందని రాష్ట్రపతి అన్నారు. ‘‘ఈ విశ్వాసాన్ని కొందరు అనుకూలంగా మలచుకొనిఅమాయక ప్రజలను మోసం చేస్తున్నారువారు తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు అబద్ధపు వాదనలను లేవదీస్తుంటారుదీంతో ఇటు ఆరోగ్యపరంగాఅటు డబ్బు పరంగా ప్రజలకు నష్టం కలగడమే కాకుండా ఆయుర్వేదానికి అపఖ్యాతి కూడా కలుగుతోంది’’ అని రాష్ట్రపతి అన్నారు. ‘‘అర్హులైన వైద్యులు చాలా మంది సమాజానికి కావాలిఇదే జరిగితేచదువుకోని వైద్యుల వద్దకు ప్రజలు వెళ్లడం మానేస్తారు’’ అని ఆమె అన్నారుగత కొన్ని సంవత్సరాలలోఆయుర్వేద కళాశాలలఆయుర్వేద విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిన సంగతి తెలిసి రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారురాబోయే కాలాల్లోయోగ్యత గల వైద్యులు అందుబాటులో ఉంటారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

ఆయుర్వేద వికాసం మానవులకు ఒక్కరికే ప్రయోజనకరం కాదనీ, దానివల్ల పశువులకుపర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని రాష్ట్రపతి అన్నారుచాలా మొక్కలువృక్షాలు అంతరించి పోతున్నాయనీ, దీనికి కారణం వాటి ఉపయోగాల గురించి మనకు తెలియక పోవడమేనన్నారు. వాటి ప్రాధాన్యాన్ని తెలుసుకుంటేమొక్కలనువృక్షాలను మనం రక్షిస్తామని రాష్ట్రపతి అన్నారు.

తమ వైద్య విధానమే అత్యుత్తమమైందంటూ వివిధ విధానాలకు చెందిన వైద్యులు వాదిస్తారని రాష్ట్రపతి అన్నారువారిలో వారికి ఆరోగ్యకరమైన పోటీ ఉండడం మంచిదేననీ, అయితే ఒకరిని మరొకరు విమర్శించాలని చూడకూడదని ఆమె హితవు పలికారు. ‘‘భిన్న వైద్య విధానాలకు చెందిన వారి మధ్య సహకార భావన ఉండాలిమనందరి ధ్యేయమల్లా రోగులకు స్వస్థతను సమకూర్చడం ద్వారా మంచిని చేయాలన్నదేమనమంతా ‘సర్వే సంతు నిరామయా:’ (ప్రతి ఒక్కరు రోగాలువ్యాధుల బారిన పడకుండా ఉండాలిఅని ప్రార్థిస్తుంటాం’’ అని రాష్ట్రపతి అన్నారు.

పరిశోధనలను కొనసాగిస్తూమందుల నాణ్యతను పెంచుకోవడం ద్వారా ఆయుర్వేదానికి ప్రాధాన్యం తగ్గకుండా చూడాలని రాష్ట్రపతి అన్నారు.అలాగే ఆయుర్వేద విద్య బోధన సంస్థలకు సాధికారితను కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అని ఆమె అన్నారుసంప్రదాయ విద్యను ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో జత పరచి అఖిల భారత ఆయుర్వేద సంస్థ ఆయుర్వేద వైద్యంవిద్యపరిశోధనలతో పాటు మొత్తంమీద ఆరోగ్య సంరక్షణ రంగంలో స్వల్ప కాలంలో తనకంటూ ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించుకొందని తెలుసుకొని రాష్ట్రపతి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Click here to see the President's address.


(Release ID: 2063590) Visitor Counter : 50