ప్రధాన మంత్రి కార్యాలయం
ఆవతీ కలాయ మాడీ వాయ కలాయా’ అంటూ గర్భా గీతాన్ని రాసిన ప్రధానమంత్రి
శ్రావ్యంగా పాడిన గాయని- పూర్వా మంత్రీ కి ధన్యవాదాలు తెలిపిన శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
07 OCT 2024 10:44AM by PIB Hyderabad
దేవీమాత దుర్గను స్తుతిస్తూ ‘ఆవతీ కలాయ మాడీ వాయ కలాయ’ అనే పల్లవితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను రాసిన ఒక గర్బా గేయాన్ని ఈ రోజున షేర్ చేశారు.
గర్బా గీతాన్ని ఆలపించిన గాయని పూర్వా మంత్రికి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఈ కింది విధంగా ఒక పోస్టును పెట్టారు:
‘‘మంగళప్రదమైన నవరాత్రి ఉత్సవాల కాలమిది; పవిత్రమైన ఈ ఉత్సవాలను ప్రజలు వివిధ పద్ధతులలో జరుపుకొంటున్నా, దుర్గా మాత వారందరినీ ఒకటిగా చేస్తోంది. భక్తి పారవశ్యంలో… దుర్గామాత శక్తినీ, కరుణనూ కీర్తిస్తూ #ఆవతీ కలాయ... అంటూ ఒక గర్భను రాశాను. (#AavatiKalay).
మాత జగదంబ అనంత ఆశీస్సులు మన అందరి మీదా సదా ప్రసరిస్తూ ఉండాలని నేను కోరుకొంటున్నాను.
‘‘ప్రతిభావంతురాలు, నైపుణ్యం కలిగిన, ఔత్సాహిక గాయని- పూర్వా మంత్రీ ఈ గర్బా గీతాన్ని అంత శ్రావ్యంగా పాడినందుకు ఆమెకు ధన్యవాదాలు. #AavatiKalay’’
***
MJPS/RT
(Release ID: 2062762)
Visitor Counter : 65
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam