ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని థానేలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 05 OCT 2024 6:50PM by PIB Hyderabad

భారత్ మాతా కీజై!

భారత్ మాతా కీజై!

మహారాష్ట్ర గవర్నరు శ్రీ సీపీ.రాధాకృష్ణన్ గారుప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారుఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారుశ్రీ అజిత్ పవార్ గారు.. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులుపార్లమెంటు సభ్యులుశాసన సభ్యులుఇతర సీనియర్ ప్రముఖులుమహారాష్ట్ర వాసులైన నా ప్రియమైన సోదర సోదరీమణులారా!

మహారాష్ట్ర దివ్య శక్తులకు… మూడున్నర శక్తి పీఠాలైన తుల్జాపూర్‌లోని భవానీ దేవికొల్హాపూర్‌లోని మహాలక్ష్మి దేవిమహూర్‌లోని రేణుకా దేవివాణిలోని సప్తశృంగి దేవీలకు నేను లెక్కలేనన్ని సార్లు నమస్కరిస్తున్నానుథానే గడ్డపై ఉన్న కోపినేశ్వరుడి పాదాలకు పాదాభివందనం చేస్తున్నానుఛత్రపతి శివాజీకిబాబాసాహెబ్ అంబేడ్కర్‌కు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

సోదర సోదరీమణులారా,

ఈ రోజు నేను మీతో గొప్ప వార్తను పంచుకోవడానికి మహారాష్ట్రకు వచ్చానుకేంద్ర ప్రభుత్వం మరాఠీ భాషకు ప్రాచీన భాష హోదా కల్పించిందిఇది కేవలం మరాఠీమహారాష్ట్రకు దక్కిన గౌరవం మాత్రమే కాదుజ్ఞానంతత్వశాస్త్రంఆధ్యాత్మికతసాహిత్యాలకు సంబంధించి గొప్ప సంస్కృతిని దేశానికి అందించిన సంప్రదాయానికి అందిన గౌరవంఈ విషయంలో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరాఠీ మాట్లాడే ప్రజలందరినీ అభినందిస్తున్నాను.
మిత్రులారా,

నవరాత్రుల సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు చేయడం నా అదృష్టంథానేకు రాకముందు నేను వాషిం‌లో ఉన్నానుఅక్కడ దేశంలోని 9.5 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడానికిఅనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు నాకు అవకాశం లభించిందిఇప్పుడు థానేలో మహారాష్ట్ర ఆధునిక అభివృద్ధికి అవసరమైన కీలక ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాంమహారాష్ట్రముంబయి-ఎంఎంఆర్‌ (ముంబై మెట్రోపాలిటన్ రీజియన్అభివృద్ధిలో నేటి సూపర్ ఫాస్ట్ వేగం.. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును తెలియజేస్తోందిముంబయి-ఎంఎంఆర్‌లో 30,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను మహాయుతి ప్రభుత్వం ప్రారంభించిందిరూ.12 వేల కోట్లతో థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాంవీటికి అదనంగా నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ ఇంపాక్ట్ నోటిఫైడ్ ఏరియా(నైనా ప్రాజెక్ట్), చెడ్డా నగర్ నుంచి ఆనంద్ నగర్ వరకు ఎలివేటెడ్ ఈస్టర్న్ ఫ్రీవేథానే మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ప్రధాన కార్యాలయం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి.
మిత్రులారా,

నేడు ముంబయిలోని ఆరే నుంచి బీకేసీ (బాంద్రా కుర్లా కాంప్లెక్స్వరకు ఆక్వా లైన్ మెట్రో కూడా ప్రారంభమైందిఈ మెట్రో లైన్ కోసం ముంబయి ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారుఈ రోజు నేను జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానుజపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ద్వారా జపాన్ ఈ ప్రాజెక్టుకు భారీ సహాయాన్ని అందించి, భారత్జపాన్ మధ్య స్నేహానికి చిహ్నంగా మార్చింది.

సోదర సోదరీమణులారా,

బాలాసాహెబ్ ఠాక్రేకు థానేతో ప్రత్యేక అనుబంధం ఉందిఇది దివంగత ఆనంద్ దిఘే గారి నగరం కూడాఈ నగరం దేశానికి మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషిని ఇచ్చిందినేడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ మహనీయుల కలలను సాకారం చేస్తున్నాంఈ ప్రాజెక్టుల విషయంలో థానేముంబై ప్రజలతో పాటు మహారాష్ట్ర ప్రజలందరినీ నేను అభినందలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,


 

నేడు దేశంలోని ప్రతి పౌరుడికీ ఒక లక్ష్యం ఉందిఅదే 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం). అందుకే మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంప్రతి ప్రతిజ్ఞప్రతి కల 'వికసిత్ భారత్'కు అంకింతమౌతున్నాయిఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముంబయిథానే వంటి నగరాలను భవిష్యత్తుకు అనుగుణంగా సిద్ధం చేయాలిఅయితే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగిల్చిన లోటును పూడ్చుకుంటూ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నందున రెట్టింపు కష్టపడాలిముంబయిథానే వంటి నగరాలను కాంగ్రెస్దాని మిత్రపక్షాలు ఎలా నడిపించాయో గుర్తుందాజనాభా పెరుగుతోందిట్రాఫిక్ పెరుగుతోందికానీ ఆ సమస్యలకు పరిష్కారాలు ఉండేవి కావుదేశ ఆర్థిక రాజధాని ముంబయి నెమ్మదించటంనిలిచిపోవటం జరుగుతుందన్న భయం నిజమౌతున్నట్లు ఉండేదిఈ పరిస్థితిని మార్చడానికి మా ప్రభుత్వం కృషి చేసిందిప్రస్తుతం ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతంలో దాదాపు 300 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాల నిర్మాణం జరుగుతోందిమెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రాకు ప్రయాణం ఇప్పుడు కోస్టల్ రోడ్డు గుండా 12 నిమిషాల్లో పూర్తవుతుందిఅటల్ సేతు దక్షిణ ముంబయినవీ ముంబయి మధ్య దూరాన్ని తగ్గించిందిఆరెంజ్ గేట్ నుంచి మెరైన్ డ్రైవ్ వరకు భూగర్భ సొరంగం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయిజాబితాలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయివాటన్నింటిని చెప్పాలంటే చాలా సమయం పడుతుందివెర్సోవా-బాంద్రా సీ బ్రిడ్జ్ఈస్టర్న్ ఫ్రీవేథానే-బోరివాలి సొరంగంథానే సర్క్యులర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్టులు ఆయా నగరాల రూపురేఖలను మారుస్తున్నాయిఈ ప్రాజెక్టులు ముంబయి ప్రజలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయిఅవి ముంబయిదాని చుట్టుపక్కల నగరాలలో ఇబ్బందులను తగ్గించి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయిఅంతేకాకుండా పరిశ్రమలను పెంచుతాయి.

మిత్రులారా,

ఒకవైపు మహారాష్ట్ర అభివృద్ధికి అంకితమైన మహాకూటమి ప్రభుత్వం ఉందిమరోపక్క అవకాశం దొరికినప్పుడల్లా అభివృద్ధి పనులను అడ్డుకునే కాంగ్రెస్మహా అఘాడీలు ఉన్నాయిఅభివృద్ధి ప్రాజెక్టులను జాప్యం చేయడంఅడ్డుకోవడందారి మళ్లించడంలో మహా అఘాడీకి మంచి పేరుందిఇందుకు ముంబయి మెట్రోనే సాక్షిదేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముంబయి మెట్రో లైన్ పనులు ప్రారంభించారు. 60 శాతం పనులు ఆయన పదవీకాలంలో పూర్తయ్యాయికానీ అప్పుడు మహా అఘాడీ ప్రభుత్వం వచ్చి అహంకారంతో ప్రాజెక్టును నిలిపివేసిందిరెండున్నరేళ్ల పాటు నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.14,000 కోట్లు పెరిగిందిఈ 14 వేల కోట్ల రూపాయలు ఎవరివిఅది మహారాష్ట్ర డబ్బు కాదాఇది రాష్ట్ర ప్రజల డబ్బు కాదాఇది మహారాష్ట్ర పన్ను చెల్లింపుదారులు కష్టపడి సంపాదించిన సొమ్ము.

సోదర సోదరీమణులారా,

ఒకవైపు పనులు పూర్తి చేసే మహాయుతి ప్రభుత్వంమరోవైపు అభివృద్ధిని అడ్డుకునే మహా అఘాడీ ప్రజలు ఉన్నారుమహా అఘాడీ అభివృద్ధి వ్యతిరేకమని తన ట్రాక్ రికార్డ్ ద్వారా నిరూపించిందివారు అటల్ సేతును వ్యతిరేకించారుముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలును అడ్డుకునేందుకు కుట్ర పన్నారుఅధికారంలో ఉన్నప్పుడు బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముందుకు సాగనివ్వలేదుమహారాష్ట్రలోని కరవు పీడిత ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులను కూడా అడ్డుకున్నారుఈ ప్రాజెక్టులు మహారాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉద్దేశించినవి. కానీ మహా అఘాడి ప్రభుత్వం వీటిని నిలిపివేసిందిమీకు సంబంధించిన పనులన్నీ నిలిపివేశారుఇప్పుడుమీరు వారిని నిలిపివేయాలిమహారాష్ట్రలో అభివృద్ధి విషయంలో శత్రువులను అధికారానికి దూరంగా ఉంచాలి-వారిని మైళ్ల దూరంలో ఉంచండి!

మిత్రులారా,


 

భారత్‌లో కాంగ్రెస్ అత్యంత నిజాయితీలేనిఅవినీతి పార్టీఏ కాలం అయినాఏ పరిస్థితి అయినా కాంగ్రెస్ స్వభావం మారదుగత వారం జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే.. భూకుంభకోణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేరు తెరపైకి వచ్చిందివారి మంత్రుల్లో ఒకరు మహిళలను దూషిస్తూఅవమానిస్తున్నారుహర్యానాలో ఓ కాంగ్రెస్ నేత డ్రగ్స్‌తో పట్టుబడ్డాడుఎన్నికల సమయంలో కాంగ్రెస్ భారీ స్థాయి హామీలు ఇస్తుందికానీ అధికారంలోకి రాగానే ప్రజలను దోపిడీ చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారువారి కుంభకోణాలకు నిధులు సమకూర్చడానికి ప్రతిరోజూ కొత్త పన్నులు విధించడం వారి ఎజెండాహిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందిఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పన్ను విధించిందిఅదేమిటో ఊహించలేంఈ కొత్త పన్ను ఏమిటి? 'టాయిలెట్ ట్యాక్స్విధించారుఓ వైపు మరుగుదొడ్లు నిర్మించుకోండి అని మోదీ చెబుతుంటేమరోవైపు మరుగుదొడ్లపై పన్ను విధిస్తాం అంటున్నారుమరో మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ నిజంగా దోపిడీమోసాల ప్యాకేజివాళ్లు మీ భూమిని దొంగిలిస్తారుయువతను మాదకద్రవ్యాలలోకి నెట్టేస్తారుమీపై పన్నులు భారం మోపుతారుమహిళలను దూషిస్తారుగుర్తుంచుకోండినేను ఇటీవలి ఒక సందర్భాన్నే మాత్రమే మీతో పంచుకున్నానుఅది కూడా పరిమితమైన సమయం కారణంగా పూర్తిగా చెప్పలేదుకొన్నేళ్లుగా కాంగ్రెస్ ఇలానే చేస్తోంది.


 

సోదర సోదరీమణులారా,


 

ఇప్పటికే మహారాష్ట్రలో తమ నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టారుమహారాష్ట్ర మహిళల కోసం మహాయుతి ప్రభుత్వం 'లడ్కీ బహిన్ యోజన'ను ప్రారంభించిందిఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.1,500, ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు లభిస్తాయిదీన్ని మహా అఘాడీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారుఅవకాశం కోసం ఎదురు చూస్తున్నారుమహా అఘాడీ ప్రభుత్వానికి అవకాశం రాదుకానీ ఒకవేళ వస్తే వాళ్లు తీసుకునే మొదటి చర్య షిండేపై తమ ఆగహాన్ని వెళ్లగక్కుతారుషిండే ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేస్తారుడబ్బులు అక్కాచెల్లెళ్ల చేతుల్లోకి కాకుండా దళారుల జేబుల్లోకి చేరాలని మహా అఘాడీ కోరుకుంటోందిఅందుకే మన మాతృమూర్తులుసోదరీమణులు కాంగ్రెస్మహా అఘాడీ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.

మిత్రులారా,


 

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశాభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఎందుకు ఇబ్బంది పడుతోందనే ప్రశ్న తరచూ ఉండేదికానీ వారు అధికారానికి దూరమవడంతో వారే సమాధానం చెప్పారునేడు కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందికాంగ్రెస్‌ను ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతోందిప్రపంచవ్యాప్తంగాభారతదేశ పురోగతిని ఆపాలనుకునేవారికి కాంగ్రెస్ ఇప్పుడు బహిరంగంగా మద్దతుగా నిలుస్తోందిఅందుకే ఘోర పరాజయాలు చవిచూసినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కలలు కంటోందితమ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉంటుందని కాంగ్రెస్‌కు తెలుసుకానీ ఇతరులు సులభంగా చీలిపోతారుఅందువల్ల కాంగ్రెస్దాని మిత్రపక్షాలకు ఒక లక్ష్యం ఉందిసమాజాన్ని విభజించడంప్రజలను విభజించడంఅధికారాన్ని చేజిక్కించుకోవడంకాబట్టి గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలిమన ఐక్యతను దేశ రక్షణ కవచంగా మార్చుకోవాలిదానికి కారణమైన వాళ్లు సంబరాలు చేసుకుంటారని గుర్తుంచుకోవాలికాంగ్రెస్మహా అఘాడీ సభ్యుల ప్రణాళికలు విజయవంతం కానివ్వం.

మిత్రులారా,

కాంగ్రెస్ ఎక్కడ అడుగు పెట్టినా అది వినాశనానికి దారి తీస్తుందిదేశాన్ని పేదరికంలోకి నెట్టేశారువారు మహారాష్ట్రను నాశనం చేశారుమహారాష్ట్ర రైతులను నాశనం చేశారుఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రాష్ట్రాలకు కూడా నాశనం చేశారుఅంతే కాదు వారితో అనుబంధం ఉన్న పార్టీలు కూడా నాశనమౌతున్నాయిఒకప్పుడు జాతీయవాదం గురించి మాట్లాడిన వారు ఇప్పుడు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారుఅక్రమ వక్ఫ్ బోర్డు ఆక్రమణల తొలగింపునకు మా ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందేకానీ కాంగ్రెస్ కొత్త శిష్యులు తమ బుజ్జగింపు రాజకీయాలలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకించే పాపం చేస్తున్నారుఅక్రమ వక్ఫ్ బోర్డు ఆక్రమణల తొలగింపును అనుమతించబోమని చెబుతున్నారుపైగా కాంగ్రెస్ నేతలు వీర్ సావర్కర్‌ను అవమానించడంచెడుగా మాట్లాడటం చేసినా ఆ పార్టీ అనుచరులు వారికి అండగా నిలుస్తున్నారుఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ బాహాటంగానే ప్రకటిస్తుంటే వారి శిష్యులు మాత్రం మౌనంగానే ఉన్నారుకేవలం కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకోవడానికి భావజాలం క్షీణించడంకాంగ్రెస్‌లో ఈ బుజ్జగింపు ధోరణికాంగ్రెస్ ప్రభావానికి లోనయ్యే ప్రతి ఒక్కరి అధోగతి స్పష్టంగా కనిపిస్తోంది.

మిత్రులారా,


 

నేడు దేశానికిమహారాష్ట్రకు స్పష్టమైన విధానాలతో గల నిజాయితీస్థిరమైన ప్రభుత్వం అవసరంభాజపామహాయుతి ప్రభుత్వం మాత్రమే దీన్ని సాధించగలవుసామాజిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించింది భాజపా మాత్రమేరహదారులుఎక్స్ ప్రెస్ రహదారులువిమానాశ్రయాల అభివృద్ధిలో రికార్డులు నెలకొల్పాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాందేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేం చేయాల్సింది ఇంకా చాలా ఉందిమహారాష్ట్రలోని ప్రతి పౌరుడు ఈ సంకల్పానికి కట్టుబడి ఎన్డీయేకు అండగా ఉంటాడని నేను నమ్ముతున్నానుఅందరం కలిసి మహారాష్ట్ర కలలను సాకారం చేసుకుందాంఈ ఆత్మవిశ్వాసంతో.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలుజరుగుతోన్న విస్తారమైన పనులకు సంబంధించి మీ అందరికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నానునాతో పాటుగా అనండి:

భారత్ మాతా కీజై!

భారత్ మాతా కీజై!

భారత్ మాతా కీజై!

చాలా ధన్యవాదాలు!

గమనికప్రధాన మంత్రి ప్రసంగానికి దాదాపు దగ్గరగా ఉన్న అనువాదం. వాస్తవ ప్రసంగం హిందీలో ఉంది.

 

***


(Release ID: 2062659) Visitor Counter : 47