వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

అక్టోబర్ 5న మహారాష్ట్ర ‘వాషిం’లో ప్రధానమంత్రి ద్వారా ‘పీఎం-కిసాన్’ పథకం18వ విడత నిధుల విడుదల


ప్రత్యక్ష నగదు బదిలీల వల్ల20,000 కోట్ల

రూపాయల మేర 9.4 కోట్ల రైతులకు లబ్ధి

మహారాష్ట్ర ప్రభుత్వ ‘నమో షెట్కరీ మహా సమ్మాన్ నిధి యోజన’ 5వ విడత నిధుల పంపిణీ

పూర్తయిన 7516 వ్యవసాయ మౌలిక వసతుల ప్రాజెక్టులు జాతికి అంకితం

9200 ఎఫ్పీఓలు (వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలు) జాతికి అంకితం



పశువుల ఏకీకృత జీనోమిక్ చిప్, స్వదేశీ ‘లింగ-నిర్ధారణ వీర్య సాంకేతికత’ కార్యక్రమాల ప్రారంభం
అంతర్జాల మాధ్యమం ద్వారా గ్రామ పంచాయితీలకు

సామాజిక అభివృద్ధి నిధుల విడుదల
‘ఎంఎస్కేవీవై 2.0’ పథకం కింద 19 మెగావాట్ల సామర్థ్యం గల 5 సౌరశక్తి పార్కులు జాతికి అంకితం

Posted On: 04 OCT 2024 1:27PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీమహారాష్ట్ర వాషింలో అక్టోబర్ 5న ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (‘పీఎం-కిసాన్’) 18వ విడత నిధులను విడుదల చేస్తారుమధ్యవర్తుల ప్రమేయం లేకుండాసుమారు 20,000 కోట్ల రూపాయల సొమ్ము,  నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఈ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం వల్లదేశంలోని 9.4 కోట్ల రైతులు లబ్ధి పొందుతారు.

కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీ పీ రాధాకృష్ణన్కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్కేంద్ర మత్స్యపశు సంవర్ధకపాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండేఉప ముఖ్యమంత్రులు శ్రీ అజిత్ పవార్శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సహా ఇతర ప్రముఖులు పాల్గొంటారురాష్ట్ర మృత్తికజల సంరక్షణ శాఖ మంత్రి వాషింయవత్మల్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రి కూడా అయిన  శ్రీ సంజయ్ రాథోడ్ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. 732 ‘కృషి విజ్ఞాన్ కేంద్రాల’ రైతులు సహా దాదాపు 2.5 కోట్ల రైతన్నలుఒక లక్ష ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల సాధారణ సేవల కేంద్రాలు (కామన్ సర్వీస్ సెంటర్లు)  వెబ్ కాస్ట్ పద్ధతి ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నిధుల విడుదలను పురస్కరించుకుని, ‘పీఎం-కిసాన్ ఉత్సవ్ దివస్’ పేరిట వివిధ రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.

2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ‘పీఎం-కిసాన్’ పథకం సొంత భూమి ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాల్లో దాదాపు 6,000 రూపాయలను అందిస్తోందిఅక్టోబర్ 5న ప్రధానమంత్రి ‘పీఎం-కిసాన్’ 18వ విడత నిధులను విడుదల చేస్తారుఈ 18వ కోటా నిధుల విడుదలతో మొత్తం పంపిణీ సొమ్ము 3.45 లక్షల కోట్లకు చేరుకుంటుంది. 11 కోట్ల వ్యవసాయదారులు పథకం వల్ల లబ్ధి పొందుతున్నారుగ్రామీణాభివృద్ధివ్యవసాయరంగ సుసంపన్నం పట్ల ప్రభుత్వానికి గల నిబద్ధతకు ఈ పథకం అద్దం పడుతోంది.

పథకం కింద మహారాష్ట్రలోని 1.20 కోట్ల రైతన్నలకు 17 వాయిదాల్లో 32,000 కోట్ల రూపాయల సొమ్ము అందిందిపెద్దమొత్తంలో సొమ్ము అందుకున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. 18 వ విడత నిధుల విడుదల వల్ల మొత్తం రూ.1900 కోట్ల సొమ్మును 91.51 లక్షల రైతులకు పంపిణీ చేస్తారు.

రాష్ట్ర రైతులకు మరింత లబ్ధి చేకూరేలా ‘పీఎం-కిసాన్’ నిధుల విడుదల సహా ‘నమో షెట్కారీ మహాసమ్మాన్ నిధి యోజన’ పథకం 5వ విడత తాలూకు 2,000 కోట్ల రూపాయలను కూడా ప్రధాని విడుదల చేస్తారు.

వ్యవసాయ మౌలిక వసతులను మెరుగుపరిచే లక్ష్యంగానూతన ప్రభుత్వ తొలి వంద రోజుల్లోఅగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ – ‘ఏఐఎఫ్’ కింద అభివృద్ధి పరచిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు2020లో ప్రారంభించిన ‘ఏఐఎఫ్’ నిధిపంటకాలం పూర్తయ్యాక అవసరమైన నిల్వమార్కెటింగ్ తదితర సౌకర్యాల మెరుగుదలవ్యవసాయ ఆస్తుల నిర్వహణను మరింత సమర్ధవంతంగా చేసేందుకు అవసరమైన మధ్యకాలికదీర్ఘకాలిక రుణాలను అందిస్తుందిఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు లక్ష కోట్ల రూపాయల వరకూ రుణ సదుపాయం సహా రుణ గ్యారంటీవడ్డీ సొమ్ముపై 3% వరకూ ప్రభుత్వ సహాయం లభ్యమవుతాయిగత 100 రోజుల్లో6,541కోట్ల రూపాయల మేర, 10,066 వ్యవసాయ మౌలిక వ్యవస్థల ప్రాజెక్టులు మంజూరయ్యాయివీటిలో 97.67 కోట్ల రూపాయల నిధులు 101 ఎఫ్పీఓలకు మంజూరయ్యాయి. 1,929 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన 7,516 ప్రాజెక్టులు పూర్తయ్యాయిఇందులో 13.82 కోట్ల విలువైన 35 ఎఫ్పీఓలను రేపు జాతికి అంకితం చేస్తారుఈ ప్రాజెక్టులన్నీ వ్యవసాయ రంగంలోని నిల్వ సామర్థ్య పెంపుఆహారశుద్ధిమార్కెట్ రవాణా తదితర మౌలిక వ్యవస్థలను బలోపేతం చేస్తూ ఎఫ్పీఓల స్థాయిని పెంచుతున్నాయితద్వారా రైతులువ్యవసాయ రంగం లాభపడుతోంది.

బలమైన రవాణా వ్యవస్థను ఏర్పరిచిభూమిలేనిచిన్న సన్నకారు రైతులకు అండగా నిలవాలన్న ఆశయంతోదేశంలోని అన్ని బ్లాకుల్లో 10,000 ఎఫ్పీఓల ప్రారంభం కోసంప్రభుత్వం కేంద్రీయ రంగ పథకం – ‘సీఎస్ఎస్’ ను ప్రారంభించిందిఇప్పటి వకూ ఏర్పడ్డ 9,200 ఎఫ్పీఓల ద్వారా,  8.3 లక్షల మంది మహిళలు, 5.77 లక్షల షెడ్యూల్డ్ కులాలుతరగతుల వారు సహా 24 లక్షల మంది రైతులు లబ్ధి పొందారుప్రస్తుతంఈ ఎఫ్పీఓల మొత్తం వార్షిక ఆదాయం 1,300 కోట్లకు చేరుకుంది. కార్యక్రమం సందర్భంగా ప్రధాని ఈ ఎఫ్పీఓలను కూడా జాతికి అంకితమిస్తారు.

ప్రధానమంత్రి ఆశయాలైన ‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్’ సాకారం దిశగాఇదే కార్యక్రమంలోపశువుల పునరుత్పత్తి ప్రక్రియకు సంబంధించిన స్వదేశీ ‘లింగ-నిర్ధారణ వీర్య సాంకేతికత’ను ప్రారంభిస్తారుఅందుబాటు ధరలో ఉండే ఈ సాంకేతికతపాడి రైతులకు లాభసాటిగా ఉండే  పశువుల జననంలో ఉపకరించడమే కాకడోసుకు రెండు వందల రూపాయల మేర ఖర్చుని కూడా తగ్గిస్తుందిపశుసంవర్ధకపాడి పరిశ్రమ విభాగం-‘డీఏహెచ్డీ’ అభివృద్ధి పరిచిన ‘ఏకీకృత జీనోమిక్ చిప్’ ను కూడా శ్రీ మోదీ ప్రారంభిస్తారుఇందులో ‘గౌ’ చిప్ ఆవులకు, ‘మహిష్’ చిప్ గేదెల కోసం నిర్దేశించినవిభారతీయ పశు జాతులను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పరిచిన ఈ సాంకేతికతపాడి రైతుల అవసరాలకు తగ్గ పశువులను ఎంపిక చేసుకోవడంలోమేటి ఎద్దులను చిన్న వయసులోనే గుర్తించివాటిని తదనుగుణంగా పాడిలో వినియోగించుకోవడంలో సహాయకారిగా ఉంటుంది.

సౌరశక్తి  ప్రాజెక్టులు ‘కుసుమ్-సీ’, ‘ఎంఎస్కేవీవై 2.0’ పథకాలకు సంబంధించి 3,000 మెగావాట్ల ప్రాజెక్టులకు పురస్కార పత్రాల ప్రదాన కార్యక్రమ ప్రారంభంగ్రామ పంచాయితీలకు సామాజిక అభివృద్ధి నిధుల విడుదలను వీడియో మాధ్యమం ద్వారా శ్రీ మోదీ ప్రారంభిస్తారు. ‘ఎంఎస్కేవీవై 2.0’ పథకంలో భాగమైన 19 మెగావాట్ల ఐదు సౌరశక్తి పార్కులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారుదాంతోపర్యావరణ-హితఅందుబాటు ధరల్లో విద్యుత్తు లభించడమే కాకరైతులకు పగటిపూట కూడా విద్యుత్తు అందుబాటులోకి వస్తుందితమ భూములను లీజుకి ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని వారు సమకూర్చుకోగలుగుతారు.

అయిదు సౌరశక్తి పార్కుల వివరాలు:

(i) ధొండాల్ గావ్ఛత్రపతి శంభాజీ నగర్ – మెగావాట్లు  

(ii) బమ్నీ బీకేనాందేడ్ – 5 మెగావాట్లు  

(iii) కొండ్గిరికొల్హాపూర్ –  మెగావాట్లు  

(iv) జలాలాబాద్అకోలా – 3 మెగావాట్లు  

(v) పల్షీ బీకేబుల్ధానా - 5మెగావాట్లు  

 

***



(Release ID: 2062281) Visitor Counter : 4