రాష్ట్రపతి సచివాలయం
అక్టోబరు 3-4 తేదీల్లో రాష్ట్రపతి రాజస్థాన్ పర్యటన
Posted On:
02 OCT 2024 6:27PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అక్టోబరు 3-4 తేదీల్లో రాజస్థాన్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా తొలిరోజు (3న) ఉదయపూర్‌లోని మోహన్‌లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొంటారు.
మరుసటి రోజు (4న) మౌంట్ అబూలో ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ‘స్పిరిచ్యువాలిటీ ఫర్ క్లీన్ అండ్ హెల్దీ సొసైటీ’ అంశంపై నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్రపతి హాజరవుతారు. అలాగే బన్స్వాడాలోని మాన్‌గఢ్ ధామ్‌లో రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించే ‘ఆది గౌరవ్ సమ్మాన్ సమరోహ్’లో కూడా ఆమె పాల్గొంటారు.
(Release ID: 2061334)
Visitor Counter : 56