ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువత ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ‘పొగాకు-రహిత యువత ప్రచారోద్యమం 2.0 ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్

పొగాకు వ్యసనానికి దేశంలో ఏటా13 లక్షల మంది బలి

పొగాకు వాడకాన్ని ఆధునికతకు సంకేతంగా భావిస్తున్న యువత..

ఈ అలవాటు క్యాన్సర్ వంటి వ్యాధులకు దారి తీయవచ్చని తెలుసుకోవాలి: శ్రీ ప్రతాప్ రావు జాధవ్
“ఆరోగ్యవంతమైన యువత దేశాభివృద్ధికి కీలకం”

అపరశక్తి ఖురానా, మను భాకర్, నవ్ దీప్ సింగ్, అంకిత్ బయన్ పురియా, గౌరవ్ చౌధరి, జాహ్నవీ సింగ్ వంటి ప్రముఖులు, క్రీడాకారులు, సామాజిక మాథ్యమ ప్రభావశీలురు హాజరైన కార్యక్రమంలో పొగాకుకు వ్యతిరేకంగా అభిప్రాయాల వెల్లడి

Posted On: 24 SEP 2024 3:27PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాధవ్ఢిల్లీ లేడీ హాడింగ్ వైద్య కళాశాలలో నిన్న  జరిగిన కార్యక్రమంలో ‘పొగాకు-రహిత యువత ప్రచారోద్యమం రెండో ఎడిషన్ ను ప్రారంభించారుపొగాకు దుష్ప్రభావాల నుండి యువతను కాపాడే ధ్యేయంతో కార్యక్రమం ప్రారంభమయిందిఈ సందర్భంగా దేశంలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో పొగాకు వ్యసన విముక్తి కేంద్రాలను కూడా మంత్రి వీడియో మాథ్యమం ద్వారా ప్రారంభించారు.

పొగాకు వ్యసనానికి ఏటా 13 లక్షల మంది భారతీయులు బలి అవుతున్నారుధూమపానాన్ని ఆధునిక యువత ఫ్యాషన్ గా భావిస్తోందిధూమపానం కాన్సర్ వంటి వ్యాధులకు దారి తీస్తుందనియువత ఈ విషయాన్ని తెలుసుకోవాలి” అని శ్రీ జాధవ్ తెలిపారు.

పొగాకు అలవాటుకన్నా ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యతనివ్వాలని యువతకు సూచించిన మంత్రి.. “మంచి ఆరోగ్యంతోనేమన సంతోషంకుటుంబ సభ్యుల సంతోషం కూడా ముడిపడి ఉంది” అని పేర్కొన్నారుఆరోగ్యవంతమైన యువత దేశాభివృద్ధికి వెన్నెముకవంటిదన్న శ్రీ జాధవ్పొగాకు జోలికి పోబోమనిఇప్పటికే అలవాటు పడ్డవారు ఆ అలవాటును మానివేస్తామని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారుతమ ఇంటిలోని కౌమార వయస్కులు పొగాకు దురలవాటు బారిన పడకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

ఈ ఏడాది చేపట్టే 60 రోజుల ప్రచారోద్యమంలో అయిదు కీలకాంశాలపై దృష్టి సారిస్తున్నట్లు  మంత్రి పేర్కొన్నారు

1. యువతగ్రామీణ ప్రాంతాల వారిపై ప్రత్యేక దృష్టితో,  పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన పెంపు.

2. పొగాకు రహిత పాఠశాలలుకళాశాలలు లక్ష్యంగా ‘టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (టీఓఎఫ్ఈఐ)’ సవరించిన మార్గదర్శకాల మెరుగైన అమలు దిశగా చర్యలు.

3.    యువతకు పొగాకు అందుబాటులో లేకుండా తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా కోట్పా’ (సిగరెట్లుఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం)-2003, ‘ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్ (పిఇసిఎ)-2019’ వంటి పొగాకు నివారణ చట్టాల బలోపేతంకఠినమైన అమలు 

4. గ్రామాల్లో పొగాకు వాడకాన్ని పూర్తిగా దూరం పెట్టడం ద్వారా ఆరోగ్యకర సమాజ కోసం పాటుపడే గ్రామాలకు ప్రోత్సాహం.

5. డిజిటల్ వేదికలను వినియోగించి పొగాకు వాడకం కలిగించే దుష్ప్రభావాలనిదురలవాటు మానడం వల్ల కలిగే లాభాలని ప్రభావవంతంగా తెలియచేస్తూ,  సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లడం.

కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ‘నో టు టొబాకో’ అంటూ పొగాకుకు దూరం ఉంటామని ప్రతిజ్ఞ చేశారుఅనంతరం విద్యార్థులుసెలెబ్రిటీలు కలిసి ఫోటోలు దిగారుకార్యక్రమానికి హాజరైన అపరశక్తి ఖురానామను భాకర్నవ్ దీప్ సింగ్అంకిత్ బయన్ పురియాగౌరవ్ చౌధరిజాహ్నవీ సింగ్ వంటి సెలెబ్రిటీలుక్రీడాకారులుసామాజిక మాథ్యమ ప్రభావశీలురు పొగాకుకు వ్యతిరేకంగా అభిప్రాయాలను వెల్లడించారు

పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూవిద్యా సంస్థల్లో ప్రదర్శన కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వీడియోని విడుదల చేసిందికార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలనుద్దేశించిన (హెల్త్ వర్కర్స్ గైడ్పుస్తకంపొగాకు-రహిత గ్రామాల కోసం అనుసరించదగ్గ ప్రామాణిక విధివిధానాలు (ఎస్ఓపీస్ ఫర్ విలేజస్ టు బీ టొబాకో ఫ్రీ), 2024-సంవత్సర  పొగాకు నియంత్రణ చట్టాల సమర్ధవంతమైన అమలు దిశగా పాలనా యంత్రాగాలకు సూచనలు (గైడ్ లైన్స్ ఫర్ లా ఎన్ఫోర్సర్స్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టొబాకో కంట్రోల్ లాస్ 2024) -   పేరిట మూడు మార్గదర్శక సూత్రాలు విడుదలయ్యాయిపొగాకు వాడకం వల్ల క్యాన్సర్ బారినపడి కోలుకున్నవారు ‘వాయిస్ ఆఫ్ టొబాకో విక్టిమ్స్’(విఒటివిపేరిట బృందంగా ఏర్పడిక్యాన్సర్ పై తమ పోరాట అనుభవాలను పంచుకున్న వీడియోని కూడా కార్యక్రమంలో ప్రదర్శించారుప్రచారోద్యమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన బృందాలు – హార్లే ఓనర్స్ గ్రూప్ఢిల్లీ బైకర్స్ బ్రేక్ ఫాస్ట్ రన్ సభ్యుల ప్రదర్శన కూడా ఏర్పాటయ్యింది.

ప్రచారోద్యమంలో ఆసక్తికలవారందరూ సామాజిక మాధ్యమం ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవలసిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు చేసిన విజ్ఞప్తితో కార్యక్రమం ముగిసిందికార్యక్రమం గురించి అభిప్రాయాలనూతాజా సమాచారాన్నీ ఇతరులతో పంచుకోవాలనీపొగాకు వ్యతిరేక సందేశం దేశంలోని అందరికీ చేరువయ్యేలా మద్దతును తెలపాలనీ మంత్రిత్వశాఖ కోరింది.

నేపథ్యం:

గత ఏడాది మే 31ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నాడు తొలి ‘యువతలో పొగాకు నివారణ’ ప్రచారోద్యమాన్ని కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ  మొదలుపెట్టింది.  పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపుపొగాకు రహిత విద్యాసంస్థలు లక్ష్యంగా టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (టీఓఎఫ్ఈఐ)’ అమలు. కోట్పా’ (సిగరెట్లుఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం)-2003, ‘ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్ (పిఇసిఎ)-2019’ వంటి పొగాకు నివారణ చట్టాల బలోపేతంకఠినమైన అమలు. పొగాకు-రహిత గ్రామాల ఏర్పాటు అనే నాలుగు కీలకమైన వ్యూహాలను ఈ ప్రచారోద్యమం అనుసరించింది. 1,41,184 విద్యా సంస్థలు, 12,000 గ్రామాలు పొగాకు-రహితమని గుర్తించడానికి ఈ ప్రచారోద్యమం ఘనవిజయం సాధించిందికోట్పా’ (సిగరెట్లుఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం)-2003 కఠినమైన అమలులో భాగంగా పలు దఫాలు అపరాధ రుసుము వసూలు చేశారు.

ఈ విజయం ఆధారంగా యువతను పొగాకు వాడకానికి దూరంగా ఉంచే లక్ష్యంతో,  కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ ‘పొగాకు-రహిత యువత ప్రచారోద్యమం 2.0’ ను ప్రారంభించింది.  60 రోజులపాటు కొనసాగే ఈ ప్రచారోద్యమంఅవగాహన పెంచే ప్రచార సాహిత్యం;  పొగాకు చట్టాల అమలు కార్యక్రమాలు; ‘ఇన్ఫర్మేషన్-ఎడ్యుకేషన్-కమ్యూనికేషన్ (ఐఇసి)’ పేరిట ప్రత్యేక సమాచారప్రచారచైతన్య కార్యక్రమాలుపొగాకు-రహిత గ్రామాలువిద్యాసంస్థల ఏర్పాటుకు  ప్రోత్సాహంపొగాకు-రహిత జీవన శైలిని అవలంబించేందుకు యువతను ప్రోత్సహించడం వంటి చర్యలను చేపడుతుంది.    

సంపూర్ణ పాలనావ్యవస్థ’ విధానం ద్వారా వివిధ మంత్రిత్వశాఖల మధ్య సమన్వయాన్ని నెలకొల్పిశాఖల భాగస్వామ్యాన్ని పొందాలని ‘పొగాకు-రహిత యువత 2.0 ప్రచారోద్యమం’ భావిస్తోందికార్యక్రమంలో కేంద్రానికి చెందిన విద్యఎలెక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీసమాచార/ప్రసారపంచాయితీ రాజ్గ్రామీణాభివృద్ధియువజనవ్యవహారాలుక్రీడలుగిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు భాగ్యమయ్యాయి.   

ఈ కార్యక్రమంలో 500 మంది నేరుగా పాల్గొనగాఅనేక మంది వీడియో మాధ్యమం ద్వారా ఇందులో పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్రఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఓస్డీ శ్రీమతి పునియ సలిల శ్రీవాస్తవఆరోగయ సేల విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ గోయల్ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి విహెకాలి జమోని, లేడీ హార్డింగ్ వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ సరిత బెరిప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రతినిధి డాక్టర్ రొడేరికో ఆఫ్రిన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులుసెలెబ్రిటీలుసామాజిక మాధ్యమ ప్రభావశీలులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారుసమీపంలోని  పొగాకు–రహితపాఠశాలకు చెందిన 300 మంది విద్యార్థులు, ‘మై భారత్’ పథకానికి చెందిన ‘ఎన్ ఎస్ ఎస్’ స్వచ్ఛంద సేవకులుపౌర సేవా సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు

కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింద లింకును అనుసరించండిhttps://youtube.com/live/aosbWe7eNOY?feature=share

పొగాకు రహిత ప్రతిజ్ఞను వీక్షించేందుకు:   https://pledge.mygov.in/say-no-to-tobacco/

 

***


(Release ID: 2058601) Visitor Counter : 75