@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

భారతదేశంలో యానిమీ- మాంగా సంస్కృతికీ, సృష్టికర్తలకూ ఆదాయం అందించే ‘క్రియేటర్ ఎకానమీ’కి పెద్ద ఎత్తున ప్రోత్సాహం


సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వేవ్స్ యానిమీ, మాంగా పోటీని ప్రారంభించిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ

విద్యార్థులు, నిపుణుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడానికీ, భారతీయ ప్రతిభను ప్రపంచ వేదికపై చాటేందుకూ ఈ పోటీలు: సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు

 Posted On: 24 SEP 2024 5:36PM |   Location: PIB Hyderabad

భారతదేశంలో యానిమీ, మాంగా సంస్కృతిని ప్రోత్సహించడానికి ఇండియా మీడియా,  ఎంటర్ టైన్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఇఎఐ)తో కలిసి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, అధికారికంగా వేవ్స్ (డబ్ల్యుఎవిఇఎస్) యానిమీ-  మాంగా కాంటెస్ట్ (డబ్ల్యుఎఎం!)ను ప్రారంభించింది. స్థానికంగా ప్రతిభను ప్రోత్సహించడానికీ, జపనీస్ మాంగా యానిమీపై భారతీయ ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తిని ఉపయోగించడానికి లక్ష్యంగా రూపొందించిన "క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్"లో భాగంగా ఈ వినూత్నమైన పోటీని నిర్వహిస్తున్నారు. 

కేంద్ర సమాచార, ప్రసార, రైల్వే, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ 2024 ఆగస్టు 22న న్యూఢిల్లీలో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్- మొదటి సీజన్ ను ప్రారంభించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన 'డిజైన్ ఇన్ ఇండియా, డిజైన్ ఫర్ ది వరల్డ్' దార్శనికతకు అనుగుణంగా రాబోయే వేవ్స్ సదస్సుకు ఈ పోటీ (ఛాలెంజ్)  ముందస్తుగా నిర్వహిస్తున్న కార్యక్రమం. 

డబ్ల్యుఏఏం గురించి...

వామ్! భారతీయ సృష్టికర్తలకు జపనీస్ కళా (ఆర్ట్) రీతుల్లో స్థానిక (లోకలైజ్డ్)  వెర్షన్ లను సృష్టించే ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఇది దేశీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఉంటుంది గణనీయమైన మార్కెటింగ్ మద్దతు,  అంతర్జాతీయ గుర్తింపు కోసం అవకాశాలను అందిస్తూ, ఈ పోటీ మాంగా, యానిమీలో సృజనాత్మక వ్యక్తీకరణకు బలమైన వేదికను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

వామ్! ఇందులో మూడు కేటగిరీలు ఉన్నాయి. ప్రతి ఒక్కటీ సృజనాత్మక వ్యక్తీకరణకు ప్రత్యేకమైన వేదికను అందిస్తాయి:

1.పోటీ విభాగాలు 

1. మాంగా (జపనీస్ కామిక్స్): విద్యార్థులు, నిపుణుల విభాగాలలో వ్యక్తిగత పోటీ

2. వెబ్ టూన్ (డిజిటల్ మాధ్యమాల కోసం వర్టికల్ కామిక్స్): విద్యార్థి, ప్రొఫెషనల్ కేటగిరీలో వ్యక్తిగత పోటీ 

3. యానిమీ (జపనీస్ యానిమేషన్): టీమ్ (4 మంది వరకు) స్టూడెంట్, ప్రొఫెషనల్ కేటగిరీలో పోటీ. 

2. ఫార్మాట్ అండ్  డెలివరీ: స్క్రిప్ట్ ను అక్కడికక్కడే అందిస్తారు. పాల్గొనేవారు సృష్టించవలసినవి

  1. 1. మాంగా (విద్యార్థులు, వ్యక్తిగత) - 2 పేజీల మాంగా, ప్రతి పేజీ కనీసం 4 ప్యానెల్‌లతో, మిశ్రమ శ్రేణిలో ఇంక్, రంగులతో (భౌతిక / డిజిటల్)

  2. 1. మాంగా (ప్రొఫెషనల్  , వ్యక్తిగత) - 2 పేజీల మాంగా, ప్రతి పేజీ కనీసం 4 ప్యానెల్‌లతో, ఇంక్, రంగులతో (భౌతిక / డిజిటల్).

  3. 1. వెబ్‌టూన్ (ప్రొఫెషనల్, వ్యక్తిగత): 10 ప్యానెల్‌లతో, ఇంక్ రంగులతో.

  4. యానిమీ (స్టూడెంట్, టీమ్స్) - ఇచ్చిన  స్క్రిప్ట్ ప్రకారం 10 సెకన్ల యానిమేషన్

  5. యానిమీ (ప్రొఫెషనల్, టీమ్స్) - ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం 15 సెకన్ల యానిమేషన్

పోటీ తీరు,  షెడ్యూల్:

విద్యార్థి, ప్రొఫెషనల్స్ కేటగిరీలలో పాల్గొనేవారు వ్యక్తిగతంగా లేదా బృందాలుగా (4 మంది వరకు) పోటీపడవచ్చు. పోటీలు రెండు స్థాయిల్లో ఉంటాయి. పదకొండు నగరాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు, జాతీయ స్థాయి ఫైనల్ పోటీలు నిర్వహిస్తారు.

ప్రతి రాష్ట్రస్థాయి పోటీ ఉదయం 9:00 గంటలకు రిజిస్ట్రేషన్ తో ప్రారంభమవుతుంది. తరువాత ఉదయం 9:30 గంటలకు స్వాగత, వివరణ (బ్రీఫింగ్) సెషన్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే వారికి పరిశ్రమ అవకాశాలు తెలిపేలా ఎక్స్ పో, జాబ్ మేళా నిర్వహిస్తారు. సాయంత్రం 6:00 గంటల నుండి 8:00 గంటల వరకు కాస్ ప్లే పోటీలు, సంగీత ప్రదర్శనలు, వాయిస్ యాక్టింగ్ సెషన్లు ఉంటాయి. ఆకర్షణీయ బహుమతుల ప్రదానంతో ముగింపు వేడుకలు ఉంటాయి.

వామ్ నిర్వహించే తేదీలు, ప్రదేశాలు

 •   వామ్! బెంగళూరు: అక్టోబర్ 27, 2024

   *  వామ్! చెన్నై: నవంబర్ 10, 2024

   • వామ్! కోహిమా: నవంబర్ 22, 2024

   • వామ్! కోల్ కతా: నవంబర్ 24, 2024

  • వామ్! భువనేశ్వర్: నవంబర్ 26, 2024

   • వామ్! వారణాసి: నవంబర్ 28, 2024

    • వామ్! ఢిల్లీ: నవంబర్ 30, 2024

    • వామ్! ముంబై: డిసెంబర్ 15, 2024

    • వామ్! అహ్మదాబాద్: డిసెంబర్ 17, 2024

    • వామ్! నాగపూర్: డిసెంబర్ 19, 2024

    • వామ్! హైదరాబాద్: డిసెంబర్ 21, 2024

వామ్ వెబ్ సైట్ www.meai.in/wam  లో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఎలాంటి రుసుమూ లేకుండా అన్ని కేటగిరీలకు ఉచితంగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. 

వామ్! 2025 ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే వేవ్స్ సదస్సు లో భాగంగా ఫైనల్స్ నిర్వహిస్తారు. విజేతలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయంతో యానిమి జపాన్ కు ఇంకా ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్లకు అన్ని ఖర్చులతో కూడిన పర్యటన అవకాశం లభిస్తుంది.

 వెబ్ టూన్స్, యానిమీ,  మాంగ 

వెబ్‌టూన్స్, యానిమీ అండ్ మాంగాలకు భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్న విస్తృతమైన అవకాశాల గురించి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ "సమృద్ధమైన కథనాలు, సృజనాత్మక శైలులు, సజీవమైన ప్రాణవంతమైన కళలతో, వామ్ భారతీయ ప్రతిభను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉందని, కొత్తతరానికి ధైర్యంగా కలలు కనేందుకు,  ప్రపంచంలో ఉన్న సృజనాత్మకతకు అత్యంత చేరువ కావడానికి ప్రేరణ ఇస్తుందని చెప్పారు.  ఇటువంటి సృజనాత్మకంగా అల్లిన కథలకు భారతీయ వినియోగదారులలో ఉన్న మక్కువను తీర్చడంలోనూ, మన సృజనాత్మక పరిధిని సుసంపన్నం చేయడంలో కూడా దీనికి సామర్థ్యం ఉందని తెలిపారు. 

వామ్ గురించి మాట్లాడుతూ 10 రాష్ట్రాలలో పోటీ వర్టికల్స్ లో శ్రీ జాజు మాట్లాడుతూ "ఇది విద్యార్థులు, నిపుణుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందిస్తుంది. సృజనాత్మకత, నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. వారి ప్రతిభను ప్రదర్శించడానికి వేదికలను అందించడం ద్వారా, సృజనాత్మకతకు పెద్దపీట వేయడం ద్వారా పరిశ్రమలో ఔత్సాహిక కళాకారులను గుర్తించవచ్చు.

10 రాష్ట్రాలలో పోటీ విభాగాల గురించి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ “ఇది విద్యార్థులు, నిపుణుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందిస్తుంది. ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధినీ ప్రోత్సహిస్తుంది. వారి ప్రతిభను ప్రదర్శించడానికి వేదికలను అందించడం ద్వారా కళలను ప్రోత్సహించే వీలు కలుగుతుంది. పరిశ్రమలో ఆవిర్భవిస్తున్న ప్రతిభను సమర్థవంతంగా గుర్తించగలం” అన్నారు. 

మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఇఎఐ) కార్యదర్శి శ్రీ అంకుర్ భాసిన్ మాట్లాడుతూ “ భారతదేశంలో యానిమీ- మంగా శక్తివంతమైన సంస్కృతిని తెరపైకి తీసుకురావడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ప్రతిభావంతులైన సృష్టికర్తలు తమ ప్రతిభను ప్రదర్శించడానికీ, ప్రపంచ ప్రేక్షకులను చేరుకోవడానికీ ఒక వేదికను అందించడం ద్వారా, సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా 'క్రియేట్ ఇన్ ఇండియా' దార్శనికతను బలోపేతం చేస్తున్నాం. ఈ చొరవ స్థానిక ప్రతిభను పెంపొందించడానికి, దేశంలోని ఎవిజిసి-ఎక్స్ఆర్, మీడియా రంగాలకు సానుకూల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అన్నారు. 

 

***


Release ID: (Release ID: 2058509)   |   Visitor Counter: 109