సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ముంబయిలో చలనచిత్ర రంగ సంస్థల కార్యకలాపాలను సమీక్షించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
యానిమేషన్ కి చెందిన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పురోగతి గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
ఏవీజీసీ రంగం మొత్తం రూపురేఖలు మారాలంటూ మంత్రి స్పష్టీకరణ
Posted On:
23 SEP 2024 6:39PM by PIB Hyderabad
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ), నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ డీసీ) ల కార్యకలాపాలపై సమీక్షను నిర్వహించేందుకు ఇవాళ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ముంబయిలోని ఎన్ఎఫ్ డీసీ కార్యాలయాన్ని సందర్శించారు.
మంత్రి గుల్షన్ మహల్ వారసత్వ భవనంతో పాటు నేషనల్ మ్యూజియం ఆఫ్ సినిమాను ఆయన సందర్శించారు. మూకీ నుంచి వర్తమానం వరకూ భారతదేశ చలనచిత్ర రంగంలో చోటు చేసుకున్న సంపన్న, వైవిధ్య భరిత వారసత్వం, దేశ సాంస్కృతికి సినిమా రంగం అందించిన కృషికి సంబంధించిన కళాకృతులను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
సర్టిఫికేషన్ ప్రక్రియలో, సంపూర్ణ చలనచిత్ర పరిశ్రమలో చోటు చేసుకొన్న సరికొత్త మార్పులను మంత్రి దృష్టికి సీబీఎఫ్ సీ ఛైర్మన్ శ్రీ ప్రసూన్ జోషి తీసుకు వచ్చారు.
చలనచిత్ర రంగంలో ఉపాధి అవకాశాలను ఇబ్బడిముబ్బడిగా పెంచేందుకు ప్రయత్నాలు జరగాలని సమీక్షలో భాగంగా మంత్రి సూచించారు. ఉన్నతమైన ఉద్యోగాలను, వాణిజ్యపరంగా ఉపయోగకరంగా ఉండేవిగా ఆ ఉద్యోగాలు ఉండాలని ఆయన చెప్పారు. భారతదేశ చలనచిత్ర పరంపరను పునరుద్ధరించడంతో పాటు దానిని సంరక్షించడంలో ఎన్ఎఫ్ డీసీ-ఎన్ఎఫ్ఎఐ (నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా) గొప్పగా పాటుపడుతోందని మంత్రి ప్రశంసించారు.
దేశ సాంస్కృతిక, చరిత్రాత్మక వారసత్వంలో కీలక భాగంగా ఉన్న చలన చిత్రాలను పరిరక్షించుకోవడంపై మరింత దృష్టి సారించాలని, భావితరాలు వాటి నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. యానిమేషన్, విజువల్ అఫెక్టులు, గేమింగ్ అండ్ కామిక్స్ (ఎవీజీసీ) రంగంలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను స్థాపించే దిశలో చేపడుతున్న కార్యకలాపాలలో భాగంగా యావత్తు పరిశ్రమ రూపురేఖల్ని మార్చాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
యానిమేషన్ రంగానికి చెందిన- నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పురోగతిని సైతం శ్రీ అశ్వినీ వైష్ణవ్ సమీక్షించారు. భారతదేశంలో వినోద పరిశ్రమలో తెర మీద కదిలే బొమ్మల కళ (యానిమేషన్)కు, విజువల్ ఎఫెక్టులకు ప్రవర్ధమాన రంగాలుగా ప్రాముఖ్యం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో సమాచార-ప్రసార శాఖ పశ్చిమ ప్రాంతం డైరెక్టర్ జనరల్ స్మిత వత్స్ శర్మ, ఎన్ఎఫ్ డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రీతుల్ కుమార్, సీబీఎఫ్ సీ సీఈఓ శ్రీ రాజేంద్ర సింగ్ లతో పాటు ఎన్ఎఫ్ డీసీ , సీబీఎఫ్ సీ లకు చెందిన ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
‘ఏక్ పేడ్ మా కే నామ్’లో భాగంగా ఎన్ఎఫ్ డీసీ ఆవరణలో మంత్రి ఒక మొక్కను నాటి, నీళ్లు పోశారు.
****
(Release ID: 2058123)
Visitor Counter : 44