ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో శ్రీ అనూర కుమార దిశనాయకే గెలిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

Posted On: 23 SEP 2024 12:11AM by PIB Hyderabad

శ్రీలంకలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో శ్రీ అనూర కుమార దిశనాయకే గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజున అభినందనలను తెలియజేశారుఅనేక రంగాల్లో ఇప్పుడు కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలపరచడానికి శ్రీ లంకతో కలసి మరింత ఎక్కువ కృషి చేయాలని ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రసార మాధ్యమ వేదిక ఎక్స్’ లో శ్రీ నరేంద్ర మోదీ ఒక అభినందన సందేశాన్ని పోస్టు చేశారు:

‘‘శ్రీలంక అధ్యక్ష ఎన్నికలలో గెలిచినందుకు శ్రీ @anuradisanayake, మీకు ఇవే అభినందనలు. భారతదేశం అనుసరిస్తున్న ‘పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యం’ విజన్ సాగర్ (Vision SAGAR) విధానాల్లో శ్రీ లంకకు ఒక విశిష్ఠ స్థానం ఉందిఅనేక రంగాల్లో ప్రస్తుతం మన రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని మన ప్రజల ప్రయోజనాలతో పాటు యావత్తు ప్రాంతం అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని మరింత పటిష్ట పరచేందుకు మీతో కలసి ఇప్పటి కన్నా మిన్నగా కృషి చేయాలని నేను ఆశపడుతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.


(Release ID: 2058075) Visitor Counter : 49