ప్రధాన మంత్రి కార్యాలయం
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు
Posted On:
17 SEP 2024 10:53PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ మేరకు ఇటలీ ప్రధానమంత్రి జార్జి మెలోనీకి పంపిన సందేశంలో:
‘‘ప్రధానమంత్రి జార్జి మెలోనీగారూ! @GiorgiaMeloni మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. భారత్-ఇటలీ దేశాలు రెండూ ప్రపంచ శ్రేయస్సు కోసం సదా తమవంతు కృషి చేస్తూనే ఉంటాయి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అలాగే నేపాల్ నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఒలీకి పంపిన సందేశంలో:
‘‘ప్రధానమంత్రి కె.పి.శర్మ ఒలీగారూ! @kpsharmaoli, మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు నా కృతజ్ఞతలు. మన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చే దిశగా మీతో భుజం కలిపి పనిచేయడానికి నేను సదా సిద్ధంగా ఉంటాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగన్నాథ్‌కు పంపిన సందేశంలో:
‘‘ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగన్నాథ్ గారూ! మీ ఆత్మీయ సందేశం, శుభాకాంక్షలకు నా అభివాదాలు. మన రెండు దేశాల ప్రజలకు, యావత్ మానవాళికి మెరుగైన భవిష్యత్తు దిశగా మా కృషిలో మారిషస్ మా సన్నిహిత భాగస్వామి అనడంలో సందేహం లేదు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2056561)
Visitor Counter : 38