ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2024’ పేరిట రేపటి నుంచి నాలుగు రోజులపాటు న్యూఢిల్లీలో భారీ సదస్సు


‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 ప్రదర్శనలో 90 దేశాలు, 26 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, 18 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, సంబంధిత విభాగాలు

భారత్ భాగస్వామిగా జపాన్, ప్రత్యేక అధ్యయన దేశాలుగా వియత్నాం, ఇరాన్

ప్రత్యేక ఇతివృత్తాలపై చర్చలు, 40 ఎంపిక చేసిన అంశాలపై సదస్సులు సహా వివిధ రాష్ట్రాలు, దేశాలపై ప్రత్యేక సదస్సులు

Posted On: 18 SEP 2024 2:16PM by PIB Hyderabad

న్యూఢిల్లీ భారత మండపంలో 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరిగే  ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2024’ సదస్సుకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆతిథ్యం ఇవ్వనుందిసెప్టెంబర్ 19 నుంచి 22 వరకు జరిగే ఈ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉందిసమావేశాల్లో 90 కి పైగా దేశాలు, 26 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, 18 కేంద్ర మంత్రిత్వశాఖలుసంబంధిత విభాగాలు పాల్గొంటాయిఆహార తయారీ లేదా ఆహార శుద్ధి రంగంలో సృజనాత్మకతనూతన సాంకేతికతపర్యావరణహిత అంశాల కలబోతగా ఈ సదస్సు ఉంటుంది.

సదస్సు ప్రారంభానికి మరొక్క రోజే ఉండడంతో దేశ విదేశ ప్రతినిధులకు అపురూపమైన అనుభూతిని అందించేందుకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ అన్ని సన్నాహాలూ చేస్తోందిప్రపంచ మేటి ఫుడ్ ప్రాసెసింగ్ దేశంగా ఆవిర్భవిస్తున్న భారత్ సత్తాను ఈ నాలుగు రోజుల కార్యక్రమం చాటుతుంది.

కార్యక్రమంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలుఆహారప్రజాపంపిణీపునరుత్పాదక ఇంధన మంత్రి శ్రీ ప్రహ్లాద జోషిఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్  పాశ్వాన్కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖరైల్వే శాఖల  సహాయ మంత్రి శ్రీ రవ్ నీత్ సింగ్ బిట్టు పాల్గొంటారుశ్రీయుతులు చిరాగ్  పాశ్వాన్రవ్ నీత్ సింగ్ పరిశ్రమల నేతలతో ప్రత్యక్షంగా భేటీ అవుతారువిదేశీ ప్రతినిధులతోఆయా దేశాల మంత్రులతో  ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు.

భారతదేశంలో ఆహార తయారీ రంగ అభివృద్ధిభవిష్య ప్రణాళికలుప్రభుత్వ పథకాలు వంటి అంశాలను కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్  పాశ్వాన్ తమ ప్రసంగం ద్వారా ప్రముఖులతో పంచుకుంటారు

తొలి రోజు జరిగే ఉన్నతస్థాయి సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర వాణిజ్యపరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్మరో మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ తో  సహ అధ్యక్షత వహిస్తారు.  శ్రీ రవ్ నీత్ సింగ్ బిట్టు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు.

అపెడాఎంపెడాఇతర ఉత్పత్తుల బోర్డులు  ఏర్పాటు చేస్తున్న రివర్స్ బయ్యర్స్ మీట్ లో వెయ్యి మందికి పైగా కొనుగోలుదార్లు పాల్గొననున్నారువరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కార్యక్రమం జరిగే సమయంలోనేసెప్టెంబర్ 20,21 తేదీల్లో ఆహార భద్రతా సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార భద్రతాధికరా సదస్సు రెండో దఫా సమావేశాలు  జరుగుతాయివరల్డ్ ఫుడ్ ఇండియా 2024కి జపాన్ భాగస్వామ్య దేశంగా వ్యవహరించనుందివియత్నాం ఇరాన్ దేశాలు ప్రత్యేక అధ్యయన దేశాలుగా పాల్గొంటున్నాయి.

కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఇతివృత్తాలపై చర్చలు సహా 40 ఎంపిక చేసిన అంశాలపై సదస్సులువివిధ రాష్ట్రాలుదేశాలపై  ప్రత్యేక సదస్సులు ఉంటాయిప్రపంచ అగ్రి ఫుడ్ కంపెనీలకు చెందిన 100 మంది సీఈఓలు పాల్గొనే పరిశ్రమ వర్గాల అంశాల వారీగా చర్చలు ఏర్పాటవుతున్నాయి.

సీనియర్ విధానకర్తలువిదేశీ ప్రముఖులుపరిశ్రమ పెద్దలువిద్యావేత్తలను ఒక దగ్గరకు చేర్చే ప్రారంభ వేడుకసమావేశాలకి శుభారంభాన్ని ఇవ్వనుందిఆహార పరిశ్రమ రంగంలోని  వివిధ కోణాలను పరిచయం చేసే అంతర్జాతీయ పెవిలియన్కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పెవిలియన్పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకమైన పెవిలియన్ వంటి వివిధ ప్రదర్శనలను వివిధ హాళ్లలో ఏర్పాటు చేశారుహాల్ నెంబర్ 14 లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపట్టిన కొత్త పథకాలుఅంకుర పరిశ్రమల సృజనాత్మకతను ప్రదర్శిస్తారుటెక్నాలజీ పెవిలియన్ లో ఆహార తయారీ రంగంలో యంత్రాలుఆహార భద్రతఉత్తమ ప్యాకేజింగ్ తదితర రంగాలలో తాజా ప్రగతి గురించిన ప్రదర్శనలు ఉంటాయిఅంతే కాక ఆహార తయారీ యంత్రాలుప్యాకేజింగ్ఆహార వడ్డన ఉపకరణాల ఆధునిక పోకడలను ప్రదర్శించేందుకు ప్రత్యేక స్థలం కేటాయిస్తారు.


 

వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు మన దేశంలోని వివిధ రాష్ట్రాల స్థానిక వంటల ప్రత్యేకత చాటే విధంగా ‘స్వాద్  సూత్ర’  పేరిట వంటల పోటీని ఏర్పాటు  చేశారు.

ప్రభావవంతమైన చర్చలకు వేదికగా నిలిచేందుకునూతన భాగస్వామ్యాలకు అవకాశం కల్పించేందుకుప్రపంచ ఆహార పరిశ్రమలో పెరుగుతున్న భారత ప్రాముఖ్యాన్ని తెలియచేయడం లక్ష్యంగా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న  ఈ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జరగనుంది.

 

***


(Release ID: 2056407) Visitor Counter : 68