రాష్ట్రపతి సచివాలయం
ఈ నెల 29 నుంచి వచ్చే నెల 6 వరకూ
రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్
28న మహోత్సవాన్ని ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి
Posted On:
17 SEP 2024 6:01PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సహకారంతో మొదటి భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి నిలయం నిర్వహించనుంది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు (సెప్టెంబర్ 29 – అక్టోబర్ 6) ఈ మహోత్సవం జరుగుతుంది. ఈ నెల 28న రాష్ట్రపతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఎనిమిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ఈశాన్య రాష్ట్రాల సుసంపన్నమైన, వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురకు చెందిన కళలు, సంస్కృతి, హస్తకళలు, ఆహార వైవిధ్యం గురించి ఈ ఉత్సవం ద్వారా సందర్శకులు తెలుసుకోవచ్చు. ఆయా రాష్ట్రాలకు చెందిన మూడు వందల మందికి పైగా కళాకారులు, హస్తకళా నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్య ప్రజలు ఈ మహోత్సవాన్ని సందర్శించవచ్చు. https://visit.rashtrapatibhavan.gov.in సందర్శకులు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశం ఉచితం. సందర్శకుల సౌకర్యార్థం సికింద్రాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద తక్షణ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
***
(Release ID: 2055853)
Visitor Counter : 75