హోం మంత్రిత్వ శాఖ

ముంబయి సమాచార్ ‘200 నాట్ అవుట్’ డాక్యుమెంటరీని విడుదల చేసిన హోంమంత్రి శ్రీ అమిత్ షా


పాత్రికేయంలో విశ్వసనీయతకు ముంబై సమాచార్ ఉదాహరణగా నిలిచింది. కష్టపడితేనే ఇది సాధ్యం
ప్రపంచంలోని అన్ని దేశాల మైనార్టీలు పార్శీ సమాజాన్ని చూసి నేర్చుకోవాలి

మైనారిటీల్లో మైనారిటీలు ఎవరైనా ఉంటే అది పార్శీలే

మైనారిటీ హక్కుల కోసం పోరాడుతున్నవారు పార్శీ సమాజం నుంచి నేర్చుకోవాలి, వారు ఏదీ ఆశించకుండా బాధ్యతాయతంగా జీవిస్తూ ప్రతీ రంగంలోనూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

ఝాన్సీ రాణి ఏ ఉద్దేశ్యంతో ప్రాణత్యాగం చేశారో అదే లక్ష్యంతో ఓ గుజరాతీ 2014లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరి వార్తలను ప్రచురించిన ఏకైక వార్తాపత్రిక 'ముంబయి సమాచార్'


ఏ భావజాలంతోనూ సంబంధం లేకుండా పాఠకులకు ఎల్లప్పుడూ వాస్తవాలను అందిస్తోంది

'ముంబయి సమాచార్' ఆసియాలో అత్యంత పురాతనమైనది,

ప్రపంచంలో నేటికీ కొనసాగుతున్న మూడో అత్యంత పురాతన వార్తాపత్రిక

‘ముంబయి సమాచార్’ ఏది ప్రచురించినా అది కచ్చితంగా నిజమేనన్న నమ్మకం

నూతన విద్యావిధానంలో మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మోదీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

పిల్లలకు మన భాషను నేర్పడం, రేపటి తరానికి అందించడం మన బాధ్యత

Posted On: 08 SEP 2024 10:23PM by PIB Hyderabad

ముంబయి సమాచార్ ప్రతిక ‘‘200 నాట్ అవుట్’’ డాక్యుమెంటరీని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా విడుదల చేశారు. ముంబయి సమాచార్ దినపత్రిక 200 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి పాల్గొన్నారు. ఆయనతోపాటు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా హోం మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ ఏ సంస్థనైనా రెండు శతాబ్దాలకు పైగా నిర్వహించడం కష్టమని, స్థానికంగా వార్తాపత్రికల ప్రచురణ మరింత కష్టమని అన్నారు. విశ్వసనీయతకు ముంబయి సమాచార్ ఉదాహరణగా నిలిచిందనీ, ఎవరైనా ఆ నమ్మకాన్ని సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని శ్రీ షా పేర్కొన్నారు. ఏ భావజాలంలేని రాజకీయ నాయకుడు సరిగా పనిచేయలేడు. భావజాలంతో ఉండే పత్రికలు మంచి చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ముంబయి సమాచార్ భావజాలంతో కాకుండా, పాఠకుల కోసం పనిచేసిందని, వారికి వాస్తవాలను తెలియజేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు.

ఝాన్సీరాణి ఏ ఉద్దేశంతో ప్రాణత్యాగం చేసిందో, అదే లక్ష్యంతో ఓ గుజరాతీ 2014లో ప్రమాణ స్వీకారం చేశారని, ఈ రెండు వార్తలనూ ప్రచురించిన ఏకైక పత్రిక 'ముంబయి సమాచార్అని హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. 1857 తిరుగుబాటుకాంగ్రెస్ స్థాపనలోకమాన్య బాలగంగాధర తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాలుగోఖలే-తిలక్ మధ్య పోరాటంగాంధీజీ ప్రాబల్యం పెరగడం, క్విట్ ఇండియా ఉద్యమంఉప్పు సత్యాగ్రహం, స్వాతంత్ర్య దినోత్సవం75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు తదితర వార్తలను ప్రచురించిన ఏకైక వార్తా పత్రిక ఇదేనని ఆయన చెప్పారు.

దీర్ఘకాలం పాటు పాత్రికేయ విలువలకు కట్టుబడి వార్తాపత్రికను నడపడం చాలా కష్టమైన పని అనీదానిని ముంబయి సమాచార్ సాధించిందని శ్రీ అమిత్ షా అన్నారు. దేశం ఒడిదొడుకులకు లోనైన 1962లో భారత్ – చైనా యుద్ధంకచ్ భూకంపంస్వాతంత్ర్య ఉద్యమంఆత్యయిక స్థితికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటం తదితర సందర్భాల్లో.. పాత్రికేయ విలువలను ఈ సంస్థ కొనసాగించిందని అన్నారు. పాత్రికేయంలో గుజరాతీ భాషను ఉపయోగిస్తూ, ఆ భాషను వాడుకలో సజీవంగా ఉంచడంలో ముంబయి సమాచార్ కీలకపాత్ర పోషించింది. వార్తా పత్రిక చేసే సేవకూ, పాఠకుల సంఖ్య ప్రామాణికం కాకపోవచ్చుకానీ ముంబయి సమాచార్ అందించిన సేవలు దాని సర్క్యులేషన్ కంటే చాలా గొప్పవి అని అన్నారు.

మైనారిటీల్లోకెల్లా మైనారిటీ ఎవరైనా ఉంటే, అది పార్శీలేనని కేంద్ర హోం మంత్రి అన్నారు.  మైనార్టీల హక్కుల కోసం పోరాడే వారు పార్శీ సమాజాన్ని చూసి నేర్చుకోవాలనివారికి చేస్తున్న పని పట్ల తప్ప, మరో ధ్యాస ఉండదనీ, నిస్వార్థంతో ప్రతీ రంగంలోనూ తమ వంతు సేవల్ని అందిస్తున్నారని అన్నారు. దేశంలో  న్యాయరంగంపారిశ్రామికాభివృద్ధిఫిన్‌టెక్ లేదా ఐటీ రంగాల్లో పార్శీ సమాజం ముందంజలో

ఉందన్నారు. పాత్రికేయ రంగంలో ముంబయి సమాచార్ పత్రిక ద్వారా ‘కామా’ కుటుంబం చేసిన సేవలను గుజరాత్గుజరాతీలుభారతదేశం ఎన్నటికీ మరువలేవని అన్నారు. బాంబే పేరును ముంబయిగా

మార్చినప్పుడు కోర్టులో సమర్పించిన అతిపెద్ద సాక్ష్యం ముంబయి సమాచార్ పేరేనని అని ఆయన తెలిపారు.

భాషలు భారతదేశ వారసత్వ సంపద అనిప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇన్ని మాండలికాలుభాషలు లేవని శ్రీ అమిత్ షా అన్నారు. నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం ద్వారా మాతృభాషలో ప్రాథమిక విధ్యను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తప్పనిసరి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఇంట్లో మాతృభాషలో మాట్లాడాలని హోంమంత్రి  హితవు చెబుతూ, ఇది పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.  భాషకు దూరమైతే మన సంస్కృతికి కూడా దూరమవుతామని అన్నారు. పిల్లలకు మాతృభాష నేర్పించడం, తర్వాతి తరానికి మన భాషను అందించడం మన బాధ్యతేనని అన్నారు.

భాషను పరిరక్షించడంపోషించడంమరింత అర్థవంతంగాఅనువైనదిగా మార్చడంసోదర భాషల్లోని  పదజాలాన్ని చేర్చడం ద్వారా మన భాష సుసంపన్నమవుతుందని కేంద్ర హోంమంత్రి అన్నారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ అంశంపై పని చేసిందనీ, హిందీ నిఘంటువును విస్తరించిందనీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ భాషల్లోని 22,831 పదాలను తీసుకురావడం ద్వారా హిందీని సంపూర్ణ భాషగా మార్చేందుకు కృషి చేశామని శ్రీ అమిత్ షా తెలిపారు. మాతృభాష కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

ముంబయి సమచార్ ఆసియాలోనే అతి ప్రాచీన ప్రతిక అనీప్రపంచంలో మూడో ప్రాచీన పత్రిక అని అమిత్ షా తెలిపారు. ప్రపంచంలోనే విశ్వసనీయతను నిలబెట్టుకున్న ఏకైక దినపత్రిక కూడా ఇదేని ఆయన చెప్పారు.  భారత్ చరిత్రలో గత 200 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయని శ్రీ షా పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాతప్రస్తుతం మన ముందున్న మార్గం స్పష్టంగాసుగమంగాగొప్పగా ఉందనికానీ గతంలో 125 ఏళ్లు ఒడిదొడుకులతోనే సాగిందని, ఈ సమయంలో ముంబయి సమాచార్‌ ఏనాడూ లాభాల గురించి పట్టించుకోలేదనిపాత్రికేయ స్ఫూర్తిని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేసిందన్నారు.

50 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని యథాతథంగా హిందీఇంగ్లిషుల్లో కూడా అందించాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. రెండు శతాబ్దాల తర్వాత కూడా ఈ స్థానిక భాషా దినపత్రిక నిరాటంకంగా కొనసాగుతుందనిమూడో శతాబ్దిని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉందని, ఈ డాక్యుమెంటరీ ద్వారా ముంబయి సమాచార్ గురించి దేశం మొత్తానికి తెలుస్తుందని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందనిప్రపంచంలో పదకొండో స్థానం నుంచి ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని శ్రీ అమిత్ షా అన్నారు. నేడు ప్రపంచం మొత్తం భారత్‌ను ఒక వెలుగు రేఖగా చూస్తోందని, ప్రస్తుతం జి-20 దేశాల్లో భారత్ అత్యధిక వృద్ధి రేటు కలిగి ఉందనిత్వరలో మనం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని శ్రీ షా తెలిపారు. స్వాతంత్ర్యం సిద్ధించిన 75 నుంచి 100 ఏళ్ల మధ్య కాలాన్ని అమృత కాలంగా ప్రధానమంత్రి అభివర్ణించారనిఈ ప్రయాణం ప్రపంచంలోని ప్రతి రంగంలోనూ భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు. 2047 ఆగస్టు 15న ప్రపంచంలోని ప్రతి రంగంలోనూ భారతదేశం ప్రథమ స్థానంలో ఉండాలన్న మోదీ తీర్మానాన్ని దేశంలోని 140 కోట్ల మంది పౌరులు ఆమోదించారని హోంమంత్రి తెలిపారు.



(Release ID: 2053151) Visitor Counter : 21