పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంగీకార పత్రంపై సంతకాలు చేసిన పంచాయతీరాజ్ శాఖ, యునిసెఫ్

Posted On: 06 SEP 2024 12:25PM by PIB Hyderabad

వ్యవస్థలను మెరుగుపరచడానికి, సామాజిక మార్పులో ప్రజలను భాగస్వాములను చేయడానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి(యునిసెఫ్ -ఇండియా) అంగీకార పత్రం(ఎల్ఓఐ)పై సంతకాలు చేశాయి.

మంత్రిత్వ శాఖకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్ సంస్థలు, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే వారి మధ్య సమర్థమైన సమాచార వ్యవస్థను సంస్థాగతంగా ఏర్పాటు చేయడమే ఈ భాగస్వామ్య లక్ష్యం. తద్వారా గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు సమాచార వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి మెరుగైన సేవలు అందించడంతో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి దోహదపడుతుంది.

సమాచార, ఫీడ్‌బ్యాక్ వ్యవస్థలను మెరుగుపరచి ముఖ్యమైన ప్రభుత్వ విధానాలను గ్రామీణ ప్రాంతాలకు వేగంగా, సమర్థంగా చేరవేయడానికి సాంకేతితకను ఉపయోగించేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. ఈ ప్రయత్నం గ్రామీణ ప్రజలకు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సేవలను మెరుగ్గా అందించడానికి, పాలనలో పారదర్శకతను పెంచడానికి, సమ్మిళితమైన, అనుసంధానిత గ్రామీణ భారత్ ను ఏర్పాటు చేసేందుకు దోహదపడుతుంది.

 

***


(Release ID: 2052680) Visitor Counter : 85