భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
భారత ప్రభుత్వానికి ముఖ్య విజ్ఞానశాస్త్ర సలహాదారు కార్యాలయం
Posted On:
03 SEP 2024 11:19AM by PIB Hyderabad
6న పారిస్ లో చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్-2024 ఎడిషన్, భారత్, యునెస్కోల సంయుక్త నిర్వహణ
చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ (సిఎస్ఎఆర్) తాలూకు 2024వ సంచిక ను 6న ఫ్రాన్స్ లోని పారిస్ లో ఐక్య రాజ్య సమితి విద్య, విజ్ఞాన శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రధాన కేంద్రం లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, యునెస్కో లో నేచురల్ సైన్సెస్ సెక్టర్ లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. జి-20 కూటమి కి 2023లో భారత్ అధ్యక్ష పదవీ బాధ్యతలను నిర్వహించిన కాలంలో ఈ చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ (సిఎస్ఎఆర్) ను ప్రతిపాదించి, షెర్పా-ట్రాక్ కార్యక్రమంగా దీనిని మొదలు పెట్టారు.
‘‘విజ్ఞానశాస్త్రాన్ని ఎటువంటి పరిమితులకు లోబడకుండా ప్రోత్సహించడం, జ్ఞానం పరంగా నెలకొన్న సౌష్ఠవ రాహిత్య సమస్యను పరిష్కరించడం, ప్రపంచ స్థాయిలో విజ్ఞానశాస్త్ర ఆధారిత సలహాల సంబంధిత సామర్థ్యాన్ని పటిష్ట పరచడం’’ అనే విషయాలపై చర్చించడానికి ముఖ్య విజ్ఞానశాస్త్ర సలహాదారులు (సిఎస్ఎ) లేదా నామినేట్ చేసిన తత్సమాన అధికారుల నాయకత్వంలో 28 దేశాల ప్రతినిధి వర్గాలతో పాటు 6 అంతర్జాతీయ సంస్థలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాలుపంచుకోనున్నాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, యునెస్కో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఎడిజి - నేచురల్ సైన్సెస్) డాక్టర్ లిడియా బ్రిటో సహాధ్యక్షత వహించనున్నారు.
సిఎస్ఎఆర్ 2024 సెప్టెంబరు 6న ఆరంభం కావడాని కన్నా ముందు ఒక ఓపెన్ నాలెడ్జ్ సెషన్ ను నిర్వహిస్తారు. ఆ సదస్సులో విజ్ఞానశాస్త్రంలో విశ్వాసాన్ని పెంచడంలో విజ్ఞానశాస్త్ర సలహా యంత్రాంగాల ప్రభావాన్ని చర్చిస్తారు. దేశాల స్థాయి, ప్రాంతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలలో విజ్ఞానశాస్త్ర సలహాల సంబంధిత సామర్థ్యం పెంపుదలపై నిశిత ఆలోచనలను ప్రోత్సహిస్తారు. అలాగే, ఈ బహిరంగ సదస్సు ముఖ్య విజ్ఞానశాస్త్ర సలహాదారులకు, తత్సమాన హోదాను కలిగివుండేటటువంటి అధికారులకు, యునెస్కో లో వేరు వేరు సభ్యత్వ దేశాలకు చెందిన శాశ్వత ప్రతినిధి వర్గాలకు, ఇంకా అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర, విజ్ఞానశాస్త్ర సలహాలిచ్చే సంస్థల ప్రతినిధులకు మధ్య సంభాషణ జరగడానికి ఒక వేదికను సమకూర్చనుంది.
రౌండ్ టేబుల్ సమావేశం తాలూకు ఈ 2024 ఎడిషన్ దక్షిణాఫ్రికా నాయకత్వంలో, ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా ముందుకు తీసుకుపోయేందుకు బాటను పరచనుంది.
****
(Release ID: 2051361)
Visitor Counter : 108