ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర లోని పాల్ఘర్ లో వధావన్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 30 AUG 2024 6:09PM by PIB Hyderabad

భారత్ మాతాకీ – జై!

భారత్ మాతాకీ – జై!

భారత్ మాతాకీ – జై!

మహారాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గారుప్రజాదరణ కలిగిన మన ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారుకేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారుసర్బానంద సోనోవాల్ గారుమహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ గారుఅజిత్ దాదా పవార్ గారుకేంద్ర మంత్రివర్గంలోని నా ఇతర సహచరులుమహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులుఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదర సోదరీమణులారా!

నేడు సంత్ సేనాజీ మహరాజ్ వర్ధంతిఆయన ముందు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానునా ప్రియమైన సోదరీమణులుసోదరులందరికీ నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

నేటి కార్యక్రమంలో మాట్లాడే ముందు నా మనసులోని భావాలను వ్యక్తపరచాలనుకుంటున్నాను. 2013లో భారతీయ జనతా పార్టీ నన్ను ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడునేను చేసిన మొదటి పని ఏమిటంటేనేను రాయగడ్ కోటను సందర్శించిఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి ముందు ప్రార్థించానుఒక భక్తుడు భక్తిశ్రద్ధలతో తన దేవుడిని ప్రార్థించినట్లుగానేనేను ఆ భక్తితో ఆశీర్వాదం తీసుకొని దేశ సేవలో నా నూతన ప్రయాణాన్ని ప్రారంభించానుతాజాగా సింధుదుర్గ్ లో ఏం జరిగిందంటే... నాకునా సహచరులకు ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు మాత్రమే కాదుమాకు ఛత్రపతి శివాజీ మహరాజ్ కేవలం రాజుచక్రవర్తి లేదా పాలకుడు మాత్రమే కాదుఆయన మన ఆరాధ్య దైవంఈ రోజు నా ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ పాదాల వద్ద శిరస్సు వంచి క్షమించమని ప్రార్థిస్తున్నానుమన విలువలు వేరు. ఇదే గడ్డపై జన్మించిన మహానుభావుడైన వీర్ సావర్కర్ గారిని నిరంతరం అవమానిస్తూఆయనపై అబద్ధాలు ప్రచారం చేసే రకం మనుషులు మనం కాదు. వారు నిరంతరం ఆయనను అగౌరవపరుస్తారుదేశభక్తుల మనోభావాలను అణచివేస్తారువీర్ సావర్కర్ ను అవమానించిన తరువాత కూడా వారు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరు, కోర్టులలో న్యాయ పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతటి గొప్ప పుత్రుడిని అవమానించినందుకు పశ్చాత్తాపం చెందని వారి విలువలను మహారాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలిఈ రోజు ఈ గడ్డపైకి వచ్చాక నేను చేసిన మొదటి పని నా ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ పాదాల వద్ద శిరస్సు వంచి క్షమించమని అడగడంఅంతే కాదుఛత్రపతి శివాజీ మహారాజ్ ను తమ దైవంగా భావించివారి హృదయాలను తీవ్రంగా గాయపరిచిన వారందరినీ నేను శిరస్సు వంచి క్షమించమని కోరుతున్నానునా విలువలు వేరుమనకు మన ఆరాధ్య దైవం కంటే గొప్పది ఏదీ లేదు.

మిత్రులారా,

మహారాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు చరిత్రాత్మకమైన రోజుభారత్ అభివృద్ధి ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. 'వికసిత్ మహారాష్ట్రఅనేది 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశందార్శనికతలో ఒక ముఖ్యమైన భాగంఅందుకే గత పదేళ్లలో గానీనా ప్రభుత్వం మూడోసారి నిరంతరం మహారాష్ట్ర కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నదిమహారాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బలంవనరులను కలిగి ఉంది. సుదీర్ఘ తీరప్రాంతంశతాబ్దాల నాటి అంతర్జాతీయ వాణిజ్య చరిత్ర. అంతేకాకుండాఇక్కడ భవిష్యత్తు కోసం అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను మహారాష్ట్రదేశం పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు వధావన్ పోర్టుకు నేడు శంకుస్థాపన జరిగిందిఈ పోర్టు కోసం రూ.76,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారుఇది దేశంలోనే  అతిపెద్ద కంటైనర్ పోర్టు కానుందిదేశంలోనే కాదులోతు పరంగా ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన  ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుందిఈ రోజుదేశంలోని అన్ని కంటైనర్ రేవుల గుండా వెళ్ళే మొత్తం కంటైనర్ల  సంఖ్య కేవలం వధావన్ రేవులో నిర్వహించే దానికంటే ఎక్కువగా ఉంటుందిమహారాష్ట్రతో పాటు దేశంలో వాణిజ్యపారిశ్రామిక పురోగతికి ఈ పోర్టు ఎంత పెద్ద కేంద్రంగా మారుతుందో ఊహించుకోవచ్చుఇప్పటి వరకు ఈ ప్రాంతం పురాతన కోటలకు ప్రసిద్ధి చెందిందికానీ ఇప్పుడు ఇది ఆధునిక ఓడరేవుకు కూడా ప్రసిద్ది గాంచనుందిపాల్ఘర్మహారాష్ట్రయావత్ దేశానికి నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

రెండుమూడు రోజుల క్రితమే మా ప్రభుత్వం డిఘీ పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధికి కూడా ఆమోదం తెలిపిందిఇది మహారాష్ట్ర ప్రజలకు రెండు రెట్ల శుభవార్త.ఈ పారిశ్రామిక ప్రాంతం ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజధాని అయిన రాయగఢ్ లో అభివృద్ధి చెందుతుంది. అందువల్లఇది మహారాష్ట్ర గుర్తింపునకు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కలలకు ప్రతీకగా ఉంటుందిడిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా పర్యాటక రంగాన్నిపర్యావరణ రిసార్టులను ప్రోత్సహిస్తుంది.

మిత్రులారా,

నేడు మన మత్స్యకార సోదర సోదరీమణుల కోసం రూ.700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంభించాం. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూ.400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాఈ ప్రాజెక్టుల కోసం నా మత్స్యకార సోదర సోదరీమణులకుమీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నానుఅది వధావన్ పోర్టు అయినాడిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి అయినాఫిషరీస్ ప్రణాళికలు అయినా ఇలాంటి ముఖ్యమైన పనులు మాతా మహాలక్ష్మి దేవిమాతా జీవదానీతుంగరేశ్వర్ ఆశీస్సులతోనే జరుగుతున్నాయిమాతా మహాలక్ష్మి దేవికిమాతా జీవదానీకితుంగరేశ్వరుడికి వందసార్లు తలవంచి నమస్కరిస్తున్నాను.

మిత్రులారా,

ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నశక్తివంతమైన దేశాలలో ఒకటిగా ఉండేదిభారతదేశ శ్రేయస్సుకు ఒక ముఖ్యమైన పునాది దాని సముద్ర బలంఈ విషయం మహారాష్ట్ర కంటే ఎవరికి బాగా తెలుసుఛత్రపతి శివాజీ మహారాజ్ సముద్ర వాణిజ్యాన్నినౌకాదళ శక్తిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారుదేశ ప్రగతి కోసం కొత్త విధానాలు రూపొందించి నిర్ణయాలు తీసుకున్నారుమొత్తం ఈస్టిండియా కంపెనీ కూడా సీ కమాండర్ కన్హోజీ ఆంగ్రేకు ఏమాత్రం తట్టుకోలేని విధంగా మన బలం ఉండేదికానీస్వాతంత్య్రానంతరం ఆ వారసత్వానికి దక్కాల్సిన శ్రద్ధ లభించలేదుపారిశ్రామిక అభివృద్ధి నుండి వాణిజ్యం వరకుభారతదేశం వెనుకబడిపోయింది.

కానీ మిత్రులారా,

ఇది ఇప్పుడు నవ భారతంచరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొంటున్న నవ భారతంతన బలాన్ని గుర్తిస్తోన్న  నవ భారత్ ఇదితన గౌరవాన్ని గుర్తిస్తున్న నవ భారత్ ఇదివలసవాదపు ప్రతి ఆనవాళ్లను వదిలి సముద్ర మౌలిక సదుపాయాలలో కొత్త మైలురాళ్లను నిర్మిస్తోంది నవ భారతం.

మిత్రులారా,

గత దశాబ్ద కాలంలో భారత్ తీర ప్రాంతాల్లో అభివృద్ధి అనూహ్యంగా ఊపందుకుందిఓడరేవులను ఆధునీకరించి జలమార్గాలను అభివృద్ధి చేశాంభారత్ లో నౌకా నిర్మాణం జరగాలనితద్వారా మన ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఉద్ఘాటించిందిఈ దిశగా కోట్లాది రూపాయలు వెచ్చించి నేడు ఫలితాలను చూస్తున్నాంమునుపటితో పోలిస్తే చాలా ఓడరేవుల సామర్థ్యం రెట్టింపు అయిందిప్రైవేట్ పెట్టుబడులు పెరిగాయి, నౌకల రాక పోకల (టర్న్అరౌండ్) సమయం కూడా తగ్గింది. దీని వల్ల ప్రయోజనం ఎవరికి లభిస్తోందిమన పరిశ్రమలకుమన వ్యాపారులకు ఖర్చులు తగ్గాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మన యువతకు కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తోందిమెరుగైన సౌకర్యాలను అనుభవిస్తున్న మన నావికులకు కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తోంది.

మిత్రులారా,

ఈ రోజు ప్రపంచం మొత్తం వధావన్ పోర్టును గమనిస్తోంది. 20 మీటర్ల లోతు ఉన్న వధావన్ రేవు లోతుకు సరితూగే ఓడరేవులు ప్రపంచంలో చాలా తక్కువవేలాది నౌకలు ఇక్కడ దిగుతాయికంటైనర్లను నిర్వహిస్తారుఇది మొత్తం ప్రాంతం ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తుందిప్రభుత్వం వధావన్ పోర్టును రైలుహైవే కనెక్టివిటీతో అనుసంధానం చేయనుందిఈ పోర్టు కారణంగా ఇక్కడ అనేక కొత్త వ్యాపారాలు ప్రారంభమవుతాయిగిడ్డంగి కార్యకలాపాలు వేగవంతం అవుతాయి. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్(పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్), ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే చాలా దగ్గరగా ఉండటంతో దాని స్థానం ఒక సువర్ణావకాశంఇక్కడి నుండి ఏడాది పొడవునా సరుకు రవాణా జరుగుతుంది. దీని నుండి గరిష్ట ప్రయోజనం మీకుమహారాష్ట్ర ప్రజలకునా భవిష్యత్ తరాలకు లభిస్తుంది.

మిత్రులారా,

మహారాష్ట్ర అభివృద్ధే నా ప్రథమ ప్రాధాన్యంనేడు మహారాష్ట్ర 'మేకిన్ ఇండియాకార్యక్రమం ప్రయోజనాలను పొందుతోందినేడు ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్ప్రచారం ద్వారా మహారాష్ట్ర ప్రయోజనం పొందుతోందినేడుభారతదేశ పురోగతిలో మహారాష్ట్ర గణనీయమైన పాత్ర పోషిస్తోందికానీ మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు ఎల్లప్పుడూ మీ అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకోవడానికి  ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఇందుకు సంబంధించిన మరో ఉదాహరణ ఇవాళ మీకు ఇస్తాను.

సోదర సోదరీమణులారా,

ప్రపంచ దేశాలతో వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి మన దేశానికి చాలా సంవత్సరాలుగా ఒక పెద్ద, ఆధునిక నౌకాశ్రయం అవసరందీనికి మహారాష్ట్రలోని పాల్ఘర్ అత్యంత అనువైన ప్రదేశంఈ పోర్టు అన్ని సీజన్లలో పనిచేయగలదుఅయితే ఈ ప్రాజెక్టు 60 ఏళ్లు ఆలస్యమైందిమహారాష్ట్రకుదేశానికి ఎంతో కీలకమైన ఈ పని ప్రారంభం కావడానికి కూడా కొందరు అనుమతించలేదు.. 2014లో మీరు మాకు ఢిల్లీలో సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు, 2016లో మా సహచరుడు దేవేంద్ర గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయిపోర్టు నిర్మించాలని 2020లో నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత ప్రభుత్వం మారి రెండున్నరేళ్లుగా ఇక్కడ పనులు జరగలేదుఒక్క ఈ ప్రాజెక్టుతోనే కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 12 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనామహారాష్ట్ర ఈ అభివృద్ధితో ఎవరికి సమస్య ఉందిమహారాష్ట్ర పురోగతిని అడ్డుకుంటున్న వ్యక్తులు ఎవరుమహారాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడాన్ని వ్యతిరేకించిన వారు ఎవరుగత ప్రభుత్వాలు ఈ పనులను ఎందుకు ముందుకు సాగనివ్వలేదుఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదునిజం ఏమిటంటేకొంతమంది మహారాష్ట్ర  అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారుఅయితే మా ఎన్డీఏ  ప్రభుత్వంఇక్కడ మా మహాయుతి (మహా కూటమిప్రభుత్వం మహారాష్ట్రను దేశంలో అగ్రగామిగా చేయాలనుకుంటున్నాయి.

మిత్రులారా,

సముద్రానికి సంబంధించిన అవకాశాల విషయానికి వస్తేమన మత్స్యకార సోదర సోదరీమణులు అత్యంత ముఖ్యమైన భాగస్వాములుమత్స్యకార సోదరసోదరీమణులుమన 526 మత్స్యకార గ్రామాలు, 15 లక్షల మంది మత్స్యకారుల జనాభాతో మహారాష్ట్ర మత్స్యరంగంలో గణనీయమైన ఉనికిని కలిగి ఉందిఇప్పుడే పీఎం మత్స్య సంపద పథకం లబ్ధిదారులతో మాట్లాడుతున్నానుగత పదేళ్లలో ఈ రంగం చూసిన మార్పు వారి కృషి ద్వారాప్రభుత్వ పథకాలు కోట్లాది మంది మత్స్యకారుల జీవితాలను ఎలా మార్చాయో ఈ రోజు కనిపిస్తుందిమీ కృషి ప్రభావాన్ని తెలుసుకోవడానికి మీరు కూడా సంతోషించాలినేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారత్ అవతరించింది. 2014లో దేశంలో కేవలం 80 లక్షల టన్నుల చేపలు మాత్రమే ఉత్పత్తి అయ్యాయిప్రస్తుతం భారత్ 170 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తోందిఅంటే కేవలం పదేళ్లలో చేపల ఉత్పత్తి రెట్టింపు అయిందినేడు భారత్ సీఫుడ్(సముద్రపు ఆహారం) ఎగుమతులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయిపదేళ్ల క్రితం మన దేశం రూ.20,000 కోట్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేసిందిప్రస్తుతం రూ.40 వేల కోట్లకు పైగా విలువైన రొయ్యలు ఎగుమతి అవుతున్నాయిఅంటే రొయ్యల ఎగుమతులు కూడా రెట్టింపు అయ్యాయిమేం ప్రారంభించిన నీలి విప్లవం పథకం విజయం ప్రతిచోటా కనిపిస్తుందిఈ పథకం ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగావకాశాలు లభించాయిమా ప్రభుత్వ నిరంతర కృషి వల్ల కోట్లాది మంది మత్స్యకారుల ఆదాయం పెరిగివారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.

మిత్రులారా,

చేపల ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందిప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద వేలాది మంది మహిళలకు ఆసరాగా నిలిచారుచేపల వేటకు వెళ్లే వారు తరచూ ప్రాణాంతక ప్రమాదాలను ఎదుర్కొంటారని మీకు తెలుసువారి కుటుంబాలుముఖ్యంగా ఇంట్లో మహిళలు నిత్యం ఆందోళనకు గురవుతున్నారుఆధునిక సాంకేతిక పరిజ్ఞానంశాటిలైట్ సాయంతో ఈ ప్రమాదాలను తగ్గిస్తున్నాంఈ రోజు ప్రారంభించిన నౌక కమ్యూనికేషన్ వ్యవస్థ మన మత్స్యకార సోదర సోదరీమణులకు గొప్ప వరంఫిషింగ్ బోట్లలో లక్ష ట్రాన్స్ పాండర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందిదీనితో మన మత్స్యకారులు వారి కుటుంబాలుపడవ యజమానులుమత్స్య శాఖ, సముద్రంలో భద్రతకు భరోసా ఇచ్చే వారితో ఎల్లప్పుడూ అనుసంధానంగా ఉంటారుతుపానులుసముద్రంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మన మత్స్యకారులు ఉపగ్రహం ద్వారా తీరంలోని సంబంధిత ప్రజలకు సందేశాలు పంపగలరుమీ ప్రాణాలను కాపాడుకోవడం, సంక్షోభ సమయంలో మొదట మిమ్మల్ని చేరుకోవడం ప్రభుత్వానికి ఉన్న మొదటి ప్రాధాన్యత.

మిత్రులారా,

మత్స్యకారుల బోట్లు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు 110కి పైగా ఫిషింగ్ హార్బర్లుల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నాంకోల్డ్ చైన్ప్రాసెసింగ్ సౌకర్యాలుబోట్లకు రుణాలుపీఎం మత్స్య సంపద యోజన ఇలా అన్ని పథకాలు మన మత్స్యకార సోదరసోదరీమణుల ప్రయోజనం కోసం రూపొందించినవేతీరప్రాంత గ్రామాల అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తున్నాంమత్స్యకారుల సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ప్రభుత్వ సంస్థలుసహకార సంఘాలను బలోపేతం చేస్తున్నాం.

మిత్రులారా,

వెనుకబడిన తరగతుల కోసం పని చేసినాఅణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించినా బీజేపీఎన్డీయే ప్రభుత్వాలు పూర్తి అంకితభావంనిజాయితీతో పనిచేశాయిమన దేశంలో దశాబ్దాలుగా మత్స్యకార సోదరసోదరీమణులుగిరిజన సమాజాల పరిస్థితిని చూడండిగత ప్రభుత్వాల విధానాలు ఈ వర్గాలను ఎప్పుడూ అంచుల్లోనే ఉంచాయిదేశంలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉన్నప్పటికీ గిరిజన సంక్షేమానికి అంకితమైన మంత్రిత్వ శాఖ ఎప్పుడూ లేదుబీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందిమత్స్యకారుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసిందిఎంతోకాలంగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాలు ఇప్పుడు పీఎం జన్మన్ పథకం ద్వారా లబ్ది పొందుతున్నాయిమన గిరిజన సమాజాలు, మన మత్స్యకార సంఘాలు నేడు భారతదేశ పురోగతికి గణనీయమైన సహకారం అందిస్తున్నాయి.

మిత్రులారా,

ఈ రోజుమహాయుతి (మహాకూటమిప్రభుత్వం మరో విజయాన్ని సాధించినందుకు నేను ప్రత్యేకంగా అభినందించాలనుకుంటున్నానుమహిళల నేతృత్వంలో అభివృద్ధిమహిళా సాధికారతలో మహారాష్ట్ర దేశంలోనే ముందంజలో ఉందినేడు మహారాష్ట్రలో చాలా మంది మహిళలు వివిధ ఉన్నత పదవుల్లో అద్భుతంగా పనిచేస్తున్నారురాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సుజాత సౌనిక్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర పరిపాలనకు దిశానిర్దేశం చేస్తున్నారురష్మీ శుక్లా తొలిసారి డీజీపీగా రాష్ట్ర పోలీసు శాఖకు నాయకత్వం వహిస్తున్నారుతొలిసారిగా షోమితా బిశ్వాస్ రాష్ట్ర ఫారెస్ట్ ఫోర్స్ అధిపతి గా వ్యవహరిస్తున్నారుశ్రీమతి సువర్ణ కేవలే గారు మొదటిసారిగా రాష్ట్ర న్యాయశాఖ అధిపతిగా ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారుఅదేవిధంగా జయ భగత్ గారు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ గా కొనసాగుతున్నారుముంబైలో కస్టమ్స్ విభాగానికి ప్రాచీ స్వరూప్ నేతృత్వం వహిస్తున్నారుముంబైలోని విశాలమైనసవాలుతో కూడుకున్న అండర్ గ్రౌండ్ మెట్రో-3కి ముంబై మెట్రో ఎండీగా అశ్విని భిడే నేతృత్వం వహిస్తున్నారు.. మహారాష్ట్రలో ఉన్నత విద్యారంగంలో కూడా మహిళలు ముందంజలో ఉన్నారులెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ మాధురీ కనిత్కర్ జీ మహారాష్ట్ర హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్మహారాష్ట్ర స్కిల్స్ యూనివర్శిటీ తొలి వైస్ చాన్స్ లర్ గా డాక్టర్ అపూర్వ పాల్కర్ కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారుమహారాష్ట్రలో మహిళలు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్న ఇలాంటి ముఖ్యమైనఅత్యంత బాధ్యతాయుతమైన పదవులు అనేకం ఉన్నాయి. 21వ శతాబ్దానికి చెందిన నారీ శక్తి (మహిళా శక్తిసమాజాన్ని కొత్త దిశలో నడిపించడానికి సిద్ధంగా ఉందనడానికి వారి విజయమే నిదర్శనంఈ నారీ శక్తి 'వికసిత్ భారత్'కు ముఖ్యమైన పునాది.

 

***


(Release ID: 2050864) Visitor Counter : 53