ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 31 AUG 2024 10:39PM by PIB Hyderabad

నమస్కారం.

 

శుభ సాయంత్రం.

 

ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరం ఈ ఎడిషన్ కు హాజరైన ఇంతమంది సుపరిచిత ముఖాలను చూడటం ఆనందంగా ఉందిభారతదేశ ఉజ్వల భవిష్యత్తు కు సంబంధించి ఇక్కడ ఉత్తమమైన చర్చలు జరిగాయని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ప్రపంచం మొత్తం భారతదేశంపై నమ్మకంగా ఉన్న సమయంలో ఈ సంభాషణలు జరిగాయి .

మిత్రులారా,

భారతదేశం ఈ రోజు ఒక ప్రత్యేకమైన విజయ గాథను రాస్తోంది. దేశంలో సంస్కరణల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ పనితీరుపై స్పష్టంగా కనిపిస్తోంది. అంచనాలకు మించి దేశం అనేక సార్లు తోటి దేశాల కంటే మెరుగ్గా పని చేసింది. గత పదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 35 శాతం వృద్ధి చెందితే, ఈ పది సంవత్సరాల్లో మన ఆర్థిక వ్యవస్థ దాదాపు 90 శాతం పెరిగింది. ఇదే మనం సాధించిన స్థిరమైన వృద్ధి. ఇది మేం వాగ్దానం చేసిన స్థిరమైన వృద్ధి. భవిష్యత్తులో కొనసాగే సుస్థిర వృద్ధి కూడా ఇదే.

 

మిత్రులారా.

గత కొన్నేళ్లుగా కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడంలో విజయం సాధించాంలెక్కలేనంత మంది ప్రజల జీవితాలను మా ప్రభుత్వం తాకింది. దేశ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కట్టుబడి ఉన్నాంసంస్కరణపనితీరుపరివర్తన మా మంత్రం. మమ్మల్ని నడిపించే సేవా స్ఫూర్తిని దేశ ప్రజలు గుర్తించారుగత దశాబ్దకాలంలో దేశం సాధించిన విజయాలకు వారు సాక్షులుగా ఉన్నారు. అందుకే ఈ రోజుదేశ ప్రజలు కొత్త విశ్వాసంతో ఉన్నారుతమపైదేశ ప్రగతిపైవిధానాలపైనిర్ణయాలపైమన ఉద్దేశాలపై వారికి విశ్వాసం ఉందిఈ ఏడాది అనేక ప్రధాన దేశాలు ఎన్నికలు నిర్వహించిట్రెండ్ మార్పు వైపు మొగ్గుచూపడంప్రభుత్వాలు సవాళ్లను ఎదుర్కోవడం వంటి ప్రపంచ పరిస్థితులను పరిశీలిస్తేభారత్ అందుకు పూర్తి విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుందిఈ ధోరణికి విరుద్ధంగా భారత పౌరులు ఒక ఆదేశాన్ని, తీర్పును ఇచ్చారు.  60 ఏళ్లలో తొలిసారిగా భారత ఓటర్లు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు.  దేశంలోని యువతమహిళలు- కొనసాగింపునకూరాజకీయ స్థిరత్వానికీఆర్థిక వృద్ధికీ ఓటు వేశారు. ఇందుకు భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు కృతజ్ఞత అన్న పదం సరిపోదు.

మిత్రులారా.

నేడు భారత్ పురోగతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోందిగణాంకాలు ఎంత ముఖ్యమోమారుతున్న జీవితాలను పరిగణనలోకి తీసుకోవడం కూడా అంతే ముఖ్యంఈ మార్పు భారత్ భవిష్యత్తుకు కీలకంగత దశాబ్ద కాలంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ వ్యక్తులు పేదరికం నుండి బయటపడడమే కాకుండాకొత్త మధ్య తరగతిని సృష్టించారుప్రపంచవ్యాప్తంగా ఏ ప్రజాస్వామిక సమాజంలోనూ ఈ మార్పు వేగంపరిమాణం అపూర్వంపేదల పట్ల ప్రభుత్వ వైఖరిని మార్చడం వల్లే భారత్ లో ఇది సాధ్యమైందిపేదలకు ఆకాంక్షలుస్థితిస్థాపకత ఉన్నాయిఅవి తరచుగా మనకంటే ఎక్కువగా ఉన్నాయికానీ అనేక అడ్డంకులు వారికి ఉన్నాయి. వారికి బ్యాంకు ఖాతాలుకనీస సౌకర్యాలు లేవుదీనికి ప్రతిస్పందనగాపేదల సాధికారత మార్గాన్ని మేం ఎంచుకున్నాం.వారి మార్గంలో అడ్డంకులను తొలగించి చేయి చేయి కలిపి వారికి అండగా నిలిచాంమరి మార్పు చూడండిదశాబ్దాలుగా బ్యాంకు ఖాతాలు లేని వారు ఇప్పుడు తమ ఖాతాల నుంచి డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారుఒకప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరమైన వారు ఇప్పుడు పూచీకత్తు గ్యారంటీలు లేకుండా బ్యాంకు రుణాలు పొంది పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారుప్రపంచంలో జరుగుతున్న మార్పుల గురించి తెలియని వారికి ఇప్పుడు పరికరాలు, కనెక్టివిటీ ఉందిఇది వారిని మంచి అవగాహన కలిగిన పౌరులుగా చేస్తుంది.



పేదరిక పోరాటం నుంచి బయటపడిన వారిని ప్రగతి కాంక్షతో నడిపిస్తున్నారుతమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించాలని కోరుకుంటారువారి ఆకాంక్షలు కొత్త మౌలిక సదుపాయాల సృష్టికి ఆజ్యం పోస్తున్నాయివారి సృజనాత్మకత ఆవిష్కరణను ప్రేరేపిస్తోందివారి నైపుణ్యాలు పరిశ్రమ దిశానిర్దేశం చేస్తున్నాయి. వారి అవసరాలు మార్కెట్ పోకడలను నిర్ణయిస్తున్నాయి. పెరుగుతున్న ఆదాయాలు మార్కెట్ డిమాండును ప్రభావితం చేస్తున్నాయి. భారత్ లోని ఈ నవ మధ్యతరగతి దేశాన్ని ముందుకు నడిపించే గొప్ప శక్తిగా నిరూపిస్తోంది.

మిత్రులారా,

ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పుడు మా మూడో పదవీకాలంలో ప్రభుత్వం మూడు రెట్లు వేగంగా పని చేస్తుందని నేను చెప్పాను. మా సంకల్పం మరింత బలపడిందని నేను మీకు హామీ ఇస్తున్నానుదేశంలోని ప్రతి పౌరుడిలాగే ప్రభుత్వం కూడా ఆశలువిశ్వాసంతో నిండి ఉందిఈ మూడోసారి ప్రభుత్వం ఏర్పడి ఇంకా 100 రోజులు కూడా కాలేదు. అయితే భౌతిక మౌలిక సదుపాయాల ఆధునికీకరణసామాజిక మౌలిక సదుపాయాల విస్తరణసంస్కరణల పురోగతి పట్ల మనం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాం. గత మూడు నెలలుగా పేదలురైతులుయువతమహిళల ప్రయోజనాల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నాంపేదలకు మూడు కోట్ల కొత్త ఇళ్లు మంజూరు చేశాంఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రకటించాంవ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని లక్ష కోట్లకు విస్తరించాం, 100 రకాలకు పైగా మెరుగైన విత్తనాలను విడుదల చేశాంరూ .2 లక్షల కోట్ల విలువైన పిఎం ప్యాకేజీని ప్రారంభించడం వల్ల  4 కోట్లకు పైగా యువతకు నేరుగా ప్రయోజనం చేకూర్చాంఅంతేకాకకేవలం 100 రోజుల్లోనేసాధారణ కుటుంబాలకు చెందిన 11 లక్షల మంది గ్రామీణ మహిళలు 'లఖ్ పతి'లుగా మారారుఇది మహిళల ఆర్థిక సాధికారతను ముందుకు తీసుకెళ్లడంలో ఒక గొప్ప విజయం.



మిత్రులారా,

నిన్ననే నేను మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఉన్నానుఅక్కడ మేం రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడితో వధావన్ పోర్టుకు శంకుస్థాపన చేశాంమూడు రోజుల కిందట రూ.30 వేల కోట్ల పెట్టుబడితో 12 కొత్త పారిశ్రామిక నగరాల నిర్మాణానికి ఆమోదం తెలిపాంఅంతేకాకుండా రూ.50 వేల కోట్లకు పైగా విలువైన ఎనిమిది హైస్పీడ్ కారిడార్లు మంజూరయ్యాయిరూ.30,000 కోట్లతో పుణెథానేబెంగళూరు మెట్రో వ్యవస్థల విస్తరణకు ఆమోదం తెలిపిందిమరోవైపు లద్దాఖ్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగ మార్గంలో పనులు ప్రారంభమయ్యాయి.



మిత్రులారా

మాకుమౌలిక సదుపాయాల కల్పన అంటే కేవలం పొడవువెడల్పుఎత్తును పెంచడం మాత్రమే కాదు. భారతీయ పౌరుల సౌలభ్యాన్నిజీవన నాణ్యతను మెరుగుపరిచే సాధనం కూడా. గతంలో రైల్వే బోగీలను తయారు చేసేవారుకానీ ఇప్పుడు వందే భారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టామనిఇవి వేగంసౌకర్యం రెండింటినీ అందిస్తున్నాయి. ఈ రోజు ఉదయం నేను మూడు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించానురోడ్లు ఎప్పుడో నిర్మించారు. కానీ నేడు మేం ఆధునిక ఎక్స్ ప్రెస్ వేల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాంగతంలో విమానాశ్రయాలు ఉండేవి. కానీ ఇప్పుడు మేం భారతదేశంలోని రెండోమూడో శ్రేణి నగరాలను గగనతల అనుసంధానం ద్వారా కలుపుతున్నాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలుప్రభుత్వ శాఖలు పని చేసే సంస్కృతి నుంచి విముక్తం కావాలనే లక్ష్యంతో పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ను ప్రవేశపెట్టాంఈ ప్రయత్నాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తున్నాయిమన ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలకు చాలా ప్రయోజనం చేకూరుస్తున్నాయి.



మిత్రులారా.

21
వ శతాబ్దపు మూడో దశాబ్దం భారత్ కు 'లిఫ్ట్ ఆఫ్దశాబ్దాన్ని సూచిస్తుందిఇది ఎలా జరుగుతుందిఎవరికి లాభంఅది జరిగేలా చేసేది మేమే. అది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తుందిభారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న మీరందరూప్రయివేటు రంగానికి చెందిన మిత్రులతో ఈ రోజు ఇక్కడున్న వారితో నేను అభివృద్ధి చెందిన భారత్ సృష్టిని వేగవంతం చేసే స్తంభాల గురించి చర్చించాలనుకుంటున్నానుఈ స్తంభాలు భారతదేశ శ్రేయస్సును మాత్రమే కాకుండాప్రపంచ శ్రేయస్సును కూడా సూచిస్తాయినేడుభారతదేశంలో అవకాశాలు ప్రతి దిశలో విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇస్తోందిమనం ఒక పెద్ద అడుగు ముందుకు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దీన్ని సాధించేందుకు దీర్ఘకాలిక దృష్టితో కృషి చేస్తున్నాం..

మిత్రులారా,

భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో తయారీ రంగంగా మారాలనేది ప్రతి భారతీయుడి ఆకాంక్షప్రపంచం మనపై పెట్టుకున్న ఆశ కూడా ఇదేఈ లక్ష్యసాధన దిశగా నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న విప్లవాన్ని మీరు చూడవచ్చుమన ఎంఎస్ఎంఈలకు అపూర్వమైన మద్దతు లభిస్తోందినగరాల్లో ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాంఎకనామిక్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాంకీలకమైన ఖనిజాల ఉత్పత్తిని చురుగ్గా ప్రోత్సహిస్తున్నారుభారత్ లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ ఐపథకాల విజయం చెప్పుకోదగినది కాదు.



మిత్రులారా.

వలసపాలన కాలానికి ముందు దేశ శ్రేయస్సుకు ప్రధాన పునాదుల్లో ఒకటి మన గొప్ప జ్ఞానం, సంప్రదాయంవ్యవస్థఅభివృద్ధి చెందిన భారత్ కు ఇది ఒక మూలస్తంభంగా మిగిలిపోయిందిభారతదేశం నైపుణ్యాలువిజ్ఞానంపరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా మారాలని మనలో ఎవరు కోరుకోరుఇందుకోసం ప్రభుత్వం పరిశ్రమలువిద్యావేత్తల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందిస్తోందిఈ ప్రాధాన్యత ఈ ఏడాది బడ్జెట్లో బలంగా ప్రతిబింబించిందిరూ.లక్ష కోట్లతో రీసెర్చ్ ఫండ్ ఏర్పాటు వెనుక హేతుబద్ధత ఇదేభారత్ లో అగ్రశ్రేణి విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ లను తెరవడానికి కూడా దేశం ప్రయత్నిస్తోందివిదేశాలలో విద్య కోసం గణనీయమైన మొత్తాలను ఖర్చు చేసే మన మధ్యతరగతి పిల్లలు ఆ డబ్బును ఆదా చేయడానికి వీలు కల్పిస్తుందిఉదాహరణకుస్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాలలోదేశంలో ఎంబిబిఎస్, ఎండీ సీట్ల సంఖ్య 80,000 వరకు ఉందిమన విద్యార్థులు చాలా మంది వైద్య విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళవలసి వచ్చిందిఅయితే గత పదేళ్లలో దేశవ్యాప్తంగా కొత్తగా లక్ష ఎంబీబీఎస్ఎండీ సీట్లు పెరిగాయిప్రస్తుతం భారత్ లో లక్షా ఎనభై వేలకు పైగా ఎంబీబీఎస్ఎండీ సీట్లు ఉన్నాయివచ్చే ఐదేళ్లలో భారత్ లో వైద్య రంగానికి కొత్తగా 75,000 సీట్లు వస్తాయని ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రకటించానుఆరోగ్యం, శ్రేయస్సుకు భారతదేశం ఒక ముఖ్యమైన ప్రపంచ కేంద్రంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు.



మిత్రులారా,

భారతదేశం మరో గొప్ప ఆశయాన్ని కలిగి ఉందిప్రపంచ ఆహార బుట్టగా మారడంప్రపంచవ్యాప్తంగా ప్రతి డైనింగ్ టేబుల్ పై 'మేడ్ ఇన్ భారత్ ఫుడ్ ప్రొడక్ట్ ఉండాలనేది మా జాతీయ సంకల్పంఈ విజన్ ను నెరవేర్చేందుకు ఏకకాలంలో అనేక చర్యలు తీసుకుంటున్నాంనేడు సేంద్రియప్రకృతి సేద్యానికి పెద్దపీట వేస్తున్నారుపాల ఉత్పత్తులు, సీఫుడ్ నాణ్యతను మెరుగుపరచడంపై కూడా దృష్టి ఉందిగత సంవత్సరం ప్రపంచమంతా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని జరుపుకున్న విషయం మీకు గుర్తుండే ఉంటుందిభారతదేశం ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారుఈ సూపర్ ఫుడ్స్ ప్రకృతికి, మానవ పురోగతికి ప్రయోజనకరంగా ఉంటాయిభారత్ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ ఫుడ్ బ్రాండ్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం పట్ల నేను సంతోషిస్తున్నాను.



మిత్రులారా.

అభివృద్ధి చెందిన భారత్ కు గ్రీన్ ఎనర్జీ రంగం మరో బలమైన స్తంభంగా మారనుందిజి-20 శిఖరాగ్ర సదస్సులో భారత్ సాధించిన విజయాన్ని మీరు చూశారుఅక్కడ మన గ్రీన్ హైడ్రోజన్ చొరవ పాల్గొనే అన్ని దేశాల మద్దతును పొందింది. 2030 నాటికి మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి భారత్ కట్టుబడి ఉందిఅదనంగా, 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

మిత్రులారా,

గత కొన్నేళ్లుగాసాంకేతికత మన వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా ఉందిఇప్పుడు సాంకేతిక విజ్ఞానంతో పాటు పర్యాటక రంగం కూడా భారతదేశ అభివృద్ధికి కీలక స్తంభంగా మారనుందిప్రపంచం నలుమూలల నుండివివిధ విభాగాల నుండి పర్యాటకులకు అగ్ర గమ్యస్థానంగా నిలవడానికి దేశం కృషి చేస్తోందినేడుదేశ చారిత్రక, సాంస్కృతిక కేంద్రాలను పునరుద్ధరిస్తున్నారు, మరింత అద్భుతంగా, గొప్పగా చేస్తున్నారుమన బీచ్ లు, చిన్న ద్వీపాలలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోంది. అదే సమయంలోదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల జాబితాను రూపొందించడానికి పౌరులు ఓటు వేసే 'దేఖో అప్నా దేశ్పీపుల్స్ ఛాయిస్అనే ఒక ప్రత్యేకమైన ప్రచారం దేశంలో జరుగుతోందిభారత ప్రజలు అగ్ర గమ్యస్థానాలుగా గుర్తించిన పర్యాటక ప్రాంతాలను మిషన్ మోడ్లో అభివృద్ధి చేస్తారుఇది గణనీయమైన ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.



మిత్రులారా,

 మన దేశం ఇప్పుడు దాని పరివర్తనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంపై దృష్టి పెడుతోందిజి-20 అధ్యక్ష పదవి లో ఉన్న కాలం లో మనం మన ఆఫ్రికా మిత్రుల కు సాధికారిత ను కల్పించాం.  గ్లోబల్ సౌత్ గళాన్ని లేవనెత్తాముఅన్ని దేశాలప్రత్యేకించి ప్రపంచ దక్షిణ ప్రాంత దేశాల సమ్మిళిత అభివృద్ధికి భరోసా ఇచ్చే ప్రపంచ క్రమాన్ని మనం ఇప్పుడు కోరుకుంటున్నాం. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ దక్షిణ ప్రాంత దేశాలు ప్రపంచంలో గొప్ప అవకాశాలను అందిస్తాయిఎందుకంటే మానవాళిలో ఎక్కువ భాగం ఈ ప్రాంతాలలో నివసిస్తుంది. 'విశ్వబంధుస్ఫూర్తితో భారత్ ఈ దేశాల గొంతుకగా ఆవిర్భవిస్తోంది.

మిత్రులారా,

ఈ రోజు ప్రపంచం చైతన్య వంతం (డైనమిక్) గా ఉందిఅందువల్లమన ప్రభుత్వ విధానాలు వ్యూహాలు కూడా అంతే చైతన్య వంతం (డైనమిక్) గా ఉన్నాయిఅభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాంమా విధానాలను నిన్నటి ఆధారంగా కాకుండారేపటిని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నాంరేపటి సవాళ్లుఅవకాశాల కోసం ఈ రోజు దేశాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు మా దృష్టి భవిష్యత్తుపై బలంగా ఉందిగ్రీన్ హైడ్రోజన్ మిషన్క్వాంటమ్ మిషన్సెమీకండక్టర్ మిషన్ లేదా డీప్ ఓషన్ మిషన్ ఏదైనా సరేభారత్ ఈ కార్యక్రమాలపై చురుకుగా పనిచేస్తోందిఅంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల నిధిని ఇటీవల ప్రకటించింది. ఈ రోజుభారతదేశం నిజంగా అవకాశాల భూమిమన భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుందని మేం నమ్ముతున్నాము.



మిత్రులారా.

2047 
నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశాంమీరు కూడా ఈ ప్రయాణంలో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నారని మాకు తెలుసుభారత్ లో మరిన్ని కంపెనీలు గ్లోబల్ బ్రాండ్స్ గా మారాలని కోరుకుంటున్నాంప్రపంచ వేదికపై భారత్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాంమా వాగ్దానం ఏమిటంటే మేము మీకు సౌకర్యాలు కల్పిస్తాముమీ వాగ్దానం ఏమిటంటే ఆవిష్కరణలు. మా వాగ్దానం సంస్కరణమీ వాగ్దానం నెరవేర్చేదై  ఉండాలి. ఒక స్థిరమైన పాలన ను అందించాలన్నదే మా వాగ్దానం సానుకూల మార్పులను సృష్టించడం మీ వాగ్దానంగా ఉండాలిఅధిక వృద్ధిపై దృష్టి పెట్టడం మా వాగ్దానంఅధిక నాణ్యతపై దృష్టి పెట్టడం మీ వాగ్దానంగా ఉండాలిదేశం కోసం కలిసి రాయడానికి మాకు చాలా విజయగాథలు ఉన్నాయి కాబట్టి గొప్పగా ఆలోచించండి

నేటి భారతం ప్రపంచంలోనే గొప్ప అవకాశాలకు నిలయంసంపద సృష్టికర్తలకు నేటి భారత్ విలువ ఇస్తుందిబలమైన భారత్ మానవాళి మొత్తానికి గణనీయమైన అభివృద్ధిని అందించగలదుసుసంపన్నమైన భారత్ ప్రపంచ శ్రేయస్సుకు బాటలు వేస్తుందిఇన్నోవేషన్ఇన్ క్లూజన్ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనే మంత్రాలను మనం గుర్తుంచుకోవాలిస్వదేశంలోనైనావిదేశాల్లోనైనా ప్రతి భారతీయుడికిభారత్ మద్దతుదారునికిఈ ప్రయాణంలో కలిసి నడుద్దామని నేను చెబుతున్నానుప్రపంచ సౌభాగ్యం భారత సౌభాగ్యంతో పెనవేసుకుపోయింది కాబట్టి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేద్దాంఈ లక్ష్యాన్ని మనం సాధించగలమనే నమ్మకం నాకుందిఈ నమ్మకంతో మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.



ధన్యవాదాలు.

 

 

***


(Release ID: 2050844) Visitor Counter : 92