యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కాంస్య పతకాన్ని సాధించిన మోనా అగర్వాల్!


పారా షూటింగ్ ఆశాజ్యోతి

Posted On: 01 SEP 2024 11:16AM by PIB Hyderabad

 పరిచయం:

మోనా అగర్వాల్... పారా షూటింగ్‌ విజయాలకు పర్యాయపదంగా మారిన పేరు. పారాలింపిక్స్ 2024 లో ఆర్ 2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించి... ప్రపంచ క్రీడా రంగంలో తన ఆధిక్యతను ప్రదర్శించారు. జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించి... క్రీడా రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించే వరకు... మోనా ప్రయాణం ఆమె ధైర్యాన్నిసంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.

ప్రారంభ జీవితంవిద్య

రాజస్థాన్ లోని సికార్ లో 8 నవంబర్ 1987 న జన్మించిన మోనాకేవలం తొమ్మిది నెలల వయసులోనే పోలియో బారినపడి రెండు కాళ్లపైనా ప్రభావం చూపింది. అయినప్పటికీ పట్టుదలతో చదువును కొనసాగించారు. ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందిన ఆమెప్రస్తుతం దూరవిద్య ద్వారా సైకాలజీ మాస్టర్స్ చదువుకుంటున్నారు.  

పట్టుదలసంకల్ప ప్రయాణం

23 ఏళ్ల వయసులో మోనాఇంటిని వదిలి స్వతంత్ర జీవితం గడపాలన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అనేక శారీరక సవాళ్లను అధిగమించి హెచ్ఆర్మార్కెటింగ్ రంగాల్లో రాణించారు. 2016లో పారా అథ్లెటిక్స్ పై దృష్టి సారించిన ఆమె త్రో ఈవెంట్లతో అరంగేట్రం చేసి మూడు విభాగాల్లో స్వర్ణం సాధించారు. రాష్ట్రస్థాయి పారా పవర్ లిఫ్టింగ్ లో కూడా పాల్గొని అనేక పతకాలు సాధించారు.

సిట్టింగ్ వాలీబాల్‌లో దేశంలో అగ్రగామిగా...

మోనా తన క్రీడా విజయాలతో పాటుదేశంలో మహిళలకు సిట్టింగ్ వాలీబాల్ లో సైతం మార్గదర్శకురాలు. కెప్టెన్ గాఆమె 2019 లో మహిళల కోసం మొదటి జాతీయ సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో రాజస్థాన్ రాష్ట్ర జట్టుకు స్వర్ణం అందించారు. అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ఎంపికైనప్పటికీ గర్భధారణ కారణంగా పాల్గొనలేకపోయారు.
 

 
రైఫిల్ షూటింగ్ వైపు పయణం...

డిసెంబర్ 2021 లోమోనా తిరిగి వ్యక్తిగత క్రీడను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రైఫిల్ షూటింగ్ ను ఎంచుకున్నారు. 2022లో జాతీయ స్థాయిలో రజత పతకం సాధించి ఆమె సహజ ప్రతిభను కనబరిచారు. 2023 మధ్య నాటికిఆమె తన మొదటి అంతర్జాతీయ ప్రపంచకప్  మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించారు. 4వ ఆసియా పారా గేమ్స్ లో వ స్థానంలో నిలిచారు. నాలుగో అంతర్జాతీయ క్రీడల్లో మోనా పట్టుదలకు ఫలితం దక్కింది. అక్కడ ఆమె స్వర్ణ పతకంతో పాటుపారాలింపిక్ కోటాను సాధించి ఆసియాలో సకొత్త  రికార్డును నెలకొల్పారు. ఈ అద్భుత విజయంతో ప్రపంచ వేదికపై పారా షూటింగ్ లో అత్యుత్తమ పోటీదారుగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

శిక్షణమద్దతు

పారా షూటింగ్ లో విజయం దిశగా మోనా అగర్వాల్ చేసిన ప్రయత్నానికి భారత ప్రభుత్వం అండగా నిలిచింది. ఖేలో ఇండియా పథకంనేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి కార్యక్రమాల ద్వారా మోనా తన శిక్షణపోటీ అవసరాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందారు. ఈ కార్యక్రమాలు ఆమెకు న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ లో భోజనంవసతితో సహా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు అవసరమైన క్రీడా పరికరాలుఉపకరణాలను పొందారు. పారాలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాలన్న మోనా తన కలను సాకారం చేసుకోవడానికినైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ సమగ్ర మద్దతు వ్యవస్థ కీలకంగా మారింది.
 

స్ఫూర్తి  బావుటా
మోనా అగర్వాల్ సంకల్పంవిజయం అందరికీ స్ఫూర్తిదాయకం. పారిస్ 2024 పారాలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమె సాధించిన విజయాలు ఔత్సాహిక క్రీడాకారులకు ఆశాదీపంగాస్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.



ఆధారాలు: 


(Release ID: 2050661) Visitor Counter : 70