సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
సరళీకృత పింఛను దరఖాస్తు ఫారం 6-ఎ, భవిష్య, ఈ-హెచ్ఆర్ఎంఎస్ అనుసంధానం
కొత్త ప్రక్రియను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్
పింఛనర్ల సమస్యల్ని తగ్గించడమే లక్ష్యంగా సరళీకృత ఫారం
Posted On:
29 AUG 2024 11:22AM by PIB Hyderabad
పింఛను నిబంధనలు, విధానాలను నిరంతరం మెరుగుపరచడం ద్వారా పింఛనర్లకు సంతోషకరమైన జీవనాన్ని అందించేందుకు పింఛన్లు, పింఛనర్ల సంక్షేమ శాఖ (డీవోపీపీడబ్ల్యూ) కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా- 2021 నాటి సీసీఎస్ (పింఛను) నిబంధనల్ని భవిష్యతో అనుసంధానించారు.
డీవోపీపీడబ్ల్యూ ఈ ఏడాది జూలై 16న విడుదల చేసిన ప్రకటన ద్వారా కొత్తగా ఒకే సరళీకృత పింఛను దరఖాస్తు ఫారం 6-ఎ ను విడుదల చేసింది. 2024 డిసెంబర్ నుంచి ఉద్యోగ విరమణ చేయబోయే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ భవిష్య/ఈ-హెచ్ఆర్ఎంఎస్ లో ఈ ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ-హెచ్ఆర్ఎంఎస్ లో ఉన్న ఉద్యోగులు 6-ఎ ఫారాన్ని ఈ-హెచ్ఆర్ఎంఎస్ ద్వారా (పదవీ విమరణ వయసులో) నింపుతారు. ఈ-హెచ్ఆర్ఎంఎస్ లో లేని ఉద్యోగులు ‘భవిష్య’లో ఫారం 6-ఎ ను నింపుతారు.
అయితే, ఈ కొత్త ఫారం భవిష్య/ఈ-హెచ్ఆర్ఎంఎస్ ల తేడాను తీసివేసింది. ఈ కొత్త ఫారం, భవిష్య/ఈ-హెచ్ఆర్ఎంఎస్ అనుసంధానాన్ని ఆగస్టు 30న న్యూఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హాజరవుతారు.
ఇది కొత్త ప్రభుత్వంలో డీవోపీపీడబ్ల్యూ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా దీనిని పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశించిన ‘గరిష్ట పాలన - కనీస ప్రభుత్వం’ విధానంలో ఫారం సరళీకరణ ముఖ్యమైన కార్యక్రమం.
ఈ కొత్త ఫారంలో పాత 9 ఫారాలు/ఫార్మాట్లను కలిపేశారు. ఫారం 6, 8, 4, 3, ఏ, ఫార్మాట్ 1, ఫార్మాట్ 9, ఎఫ్ఎంఏ, జీరో ఆప్షన్ ఫారాలను ఇందులో విలీనం చేశారు. 2021 నాటి సీసీఎస్ పింఛను నిబంధనలు, 53, 57, 58, 59, 60 నిబంధనలకు సవరణలు చేసి ఈ మార్పులు తెచ్చారు. వ్యయవిభాగం, న్యాయశాఖ, ముఖ్య గణాంకాధికారి, భారత కంప్ట్రోలర్- ఆడిటర్ జనరల్, సిబ్బంది- శిక్షణ వ్యవహారాల శాఖ వంటి భాగస్వాములందరితో సంప్రదింపుల అనంతరం ఈ సవరణను ప్రకటించారు.
భవిష్య ప్రక్రియలో ఈ కొత్త ఫారం, సంబంధిత మార్పులు సరికొత్త మార్పునకు నాంది అని భావిస్తున్నారు. ఒకవైపు ఒకే సంతకంతో ఉద్యోగి పింఛను ఫారం సమర్పణను తేవడంతోపాటు, మరోవైపు ఉద్యోగ విరమణ తర్వాత పింఛను చెల్లింపు మొదలయ్యే వరకూ పింఛను ప్రక్రియను పూర్తిగా కంప్యూటరీకరించారు. దీనివల్ల పింఛను ప్రక్రియలో కాగితాలను ఉపయోగించాల్సిన అవసరం తప్పిపోయింది. ఇన్నాళ్లూ... ఏ ఫారం వదిలివేస్తామోనన్న ఆందోళన పింఛనర్లలో ఉండేది.
****
(Release ID: 2049887)
Visitor Counter : 94