భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

రిలయన్స్ ఇండస్ట్రీస్, వయాకామ్ 18, డిజిటల్ 18 మీడియా, స్టార్ ఇండియా, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ (ఎస్ టి పి ఎల్ ) కలయికను ఆమోదించిన సీసీఐ

Posted On: 28 AUG 2024 6:34PM by PIB Hyderabad

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)వయకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (వయకామ్ 18), డిజిటల్ 18 మీడియా లిమిటెడ్స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐపిఎల్)స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ (ఎస్ టి పి ఎల్) లతో కూడిన ప్రతిపాదిత కలయికను స్వచ్ఛంద మార్పులకు లోబడి  ఉండేలా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) గ్రూప్‌ లో భాగమైన  వయకాం 18 ,  వాల్ డిస్నీ కంపెనీ (టీడబ్ల్యూబీసీ)  పూర్తి అధీనం లో ఉన్న ఎస్ఐపిఎల్  వంటి సంస్థల వినోద వ్యాపారాలను ( గుర్తించిన కొన్ని ఇతర వ్యాపారాలు సహా) కలపడం ప్రతిపాదిత కలయిక  ఉద్దేశం. ఈ ఒప్పందం ఫలితంగాప్రస్తుతం తన అనుబంధ విభాగాల ద్వారా టీడబ్ల్యూబీసీ పూర్తి యాజమాన్యంలో ఉన్న ఎస్ఐపీఎల్- ఆర్ఐఎల్వయకామ్ 18 , ప్రస్తుత టీడబ్ల్యూబీసీ అనుబంధ సంస్థలు సంయుక్తంగా నిర్వహించే జాయింట్ వెంచర్ (జెవి) గా మారతాయి.

ఆర్ఐఎల్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు ఖనిజ వాయువు అన్వేషణ ఉత్పత్తి;  పెట్రోలియం శుద్ధి మార్కెటింగ్పెట్రో కెమికల్స్ తయారీ అమ్మకాలురసాయనాల తయారీ అమ్మకాలువ్యవస్థీకృత రిటైల్మీడియావినోద కార్యకలాపాలుభారతదేశం తో పాటు ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ డిజిటల్ సేవలు వంటి అనేక వ్యాపారాలను కలిగి ఉంది.

వయకామ్ 18 టెలివిజన్ (టివీ) ఛానళ్ల ప్రసారంఓటీటీల నిర్వహణటివీ ఛానెళ్లలో వాణిజ్య ప్రకటనలకు సమయాన్ని విక్రయించడంసరుకుల లైసెన్స్ భారతదేశంలోనూప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసార (లైవ్ ) ఈవెంట్ల నిర్వహణ మొదలైన వ్యాపారాలు కలిగి ఉంది. వయకామ్ 18 సినీ నిర్మాణంపంపిణీ వ్యాపారంలో కూడా నిమగ్నమైంది.

ఇక ఎస్ఐపీఎల్  టీవీ బ్రాడ్ కాస్టింగ్ఏవీ కంటెంట్చిత్ర నిర్మాణంఓటీటీల నిర్వహణటీవీ ఛానళ్లుఓటీటీలలో వాణిజ్య ప్రకటనల సమయాన్ని విక్రయించడం వంటి పలు మీడియా కార్యకలాపాల్లో నిమగ్నమైంది. ఎస్ఐపీఎల్  ప్రత్యక్షంగాలేదాపరోక్షంగా పూర్తిగా టీడబ్ల్యూడీసీ యాజమాన్యం లోని  సంస్థ.

ఎస్ టీపీఎల్ బ్రిటిష్ వర్జిన్ దీవులలో నమోదైన సంస్థ. ఇది పరోక్షంగా టీడబ్ల్యూడీసీ  యాజమాన్యంలో ఉంది.

స్వచ్ఛంద మార్పులకు లోబడి ప్రతిపాదిత కలయికను కమిషన్ ఆమోదించింది.

సీసీఐ సవివరమైన ఉత్తర్వును కూడా వెలువరించనున్నారు.  

 

***


(Release ID: 2049607) Visitor Counter : 54