ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్రలోని జలగావ్ లో జరిగిన లఖ్పతి దీదీ సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 25 AUG 2024 5:07PM by PIB Hyderabad

మహారాష్ట్ర సోదర సోదరీమణులకు!

జై శ్రీ కృష్ణ...

రేపు శ్రీ కృష్ణ జన్మాష్టమిఈ సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ గారుముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారుకేంద్ర మంత్రివర్గంలో నా సహచరులువ్యవసాయగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారుఈ ప్రాంతానికి చెందిన నా తోటి మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్కేంద్ర ప్రభుత్వంలో మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారుఈ ప్రాంత ఆడబిడ్డ రక్షా ఖడ్సే గారు.  ఉప ముఖ్యమంత్రులు శ్రీ అజిత్ పవార్ గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారుమహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులుఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చిన తల్లులు, సోదరీమణులు...  నా కళ్ళు చూడగలిగినంతవరకు ఇక్కడ మాతృమూర్తుల సముద్రం ఉన్నట్లు అనిపిస్తుందిఈ దృశ్యం మనసుకు ఎంతో  హాయినిస్తోంది.

నేను మాట్లాడే ముందునేపాల్ లో జరిగిన బస్సు ప్రమాదం గురించి నా ఆవేదనను వ్యక్తం చేయాలనుకుంటున్నానుఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందినముఖ్యంగా జలగావ్ కు చెందిన మన స్నేహితులను చాలా మందిని కోల్పోయాంబాధిత కుటుంబాలన్నింటికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానుప్రమాదం జరిగిన వెంటనే భారత ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వాన్ని సంప్రదించిందివెంటనే నేపాల్ వెళ్లాలని మా మంత్రి రక్షా తాయ్ ఖడ్సేను కోరాంవైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చాంక్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారువారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులందరికీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను.

మిత్రులారా,

నేడు 'లఖ్పతి దీదీలఈ మహత్తర సదస్సు జరుగుతోందినా 'ప్రియమైన సోదరీమణులుపెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారుఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది 'సఖి మండలాలు' (మహిళా స్వయం సహాయక సంఘాలుకోసం రూ.6,000 కోట్లకు పైగా విడుదలయ్యాయిఅనేక పొదుపు సంఘాలతో అనుబంధం ఉన్న మహారాష్ట్రకు చెందిన మన సోదరీమణులకు కూడా కోట్లాది రూపాయల సాయం అందిందిఈ డబ్బు లక్షలాది మంది సోదరీమణులను 'లఖ్పతి దీదీలుచేయడానికి సహాయపడుతుందితల్లులుసోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

మీ అందరిలో మహారాష్ట్ర గర్వించదగ్గ సంస్కృతివిలువలను నేను చూస్తున్నానుమహారాష్ట్ర, ఈ విలువలు భారతదేశం అంతటా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయినేను నిన్ననే ఒక విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చానుయూరప్ లోని పోలాండ్ వెళ్లానుఅక్కడ కూడా మహారాష్ట్ర ప్రభావం చూశానుమహారాష్ట్ర సంస్కృతివిలువలను చూశానుపోలండ్ ప్రజలు మహారాష్ట్ర ప్రజలను ఎంతో గౌరవిస్తారుఇక్కడ కూర్చొని దీన్ని ఊహించలేంఅక్కడ రాజధానిలో కొల్హాపూర్ మెమోరియల్ ఉందికొల్హాపూర్ ప్రజల సేవ, ఆతిథ్యాన్ని గౌరవిస్తూ పోలాండ్ ప్రజలు ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు.

కొల్హాపూర్ రాజకుటుంబం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పోలాండ్ నుండి వేలాది మంది తల్లులు, పిల్లలకు ఆశ్రయం ఇచ్చిందని మీలో కొంతమందికి తెలుసుఛత్రపతి శివాజీ మహరాజ్ విలువలకు అనుగుణంగా రాజకుటుంబంసాధారణ ప్రజలు శరణార్థులకు సేవలందించారుమహారాష్ట్ర ప్రజల సేవమానవత్వం పట్ల చూపుతున్న ప్రేమకు ప్రశంసలు వినగానే నా మనస్సు గర్వంతో ఉప్పొంగిందిమహారాష్ట్రను అభివృద్ధి చేస్తూ అంతర్జాతీయంగా దాని పేరును పెంచాలి.

మిత్రులారా,

మహారాష్ట్ర విలువలను ఇక్కడి ధైర్యవంతులుదృఢ సంకల్పం కలిగిన తల్లులు సృష్టించారుఈ భూమిలోని మాతృశక్తి యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చిందిమా జల్గావ్ వార్కారీ సంప్రదాయానికి చెందిన పుణ్యక్షేత్రంఇది గొప్ప సాధువు ముక్తాయ్ భూమిఆమె ధ్యానంతపస్సు నేటి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయిబహినాబాయి కవితలు ఇప్పటికీ సమాజాన్ని కఠినమైన నిబంధనలకు అతీతంగా ఆలోచించేలా చేస్తున్నాయిమహారాష్ట్రలోని ఏ మూల అయినాచరిత్రలో ఏ కాలమైనా మాతృశక్తి సహకారం సాటిలేనిదిఛత్రపతి శివాజీ జీవితానికి దిశానిర్దేశం చేసింది ఎవరుమాతా జిజియా ఈ పని చేసింది.

ఆడపిల్లల చదువుకుపనికి సమాజం ప్రాముఖ్యత ఇవ్వనప్పుడు సావిత్రిబాయి ఫూలే ముందడుగు వేశారుఅంటేసమాజం, దేశ భవిష్యత్తును రూపొందించడంలో దేశ మాతృశక్తి ఎల్లప్పుడూ గణనీయమైన సహకారాన్ని అందించిందినేడుమన దేశం అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నప్పుడుమన మాతృశక్తి మరోసారి ముందుకు వస్తోందిరాజమాత జిజియాసావిత్రిబాయి ఫూలేల ప్రభావం మహారాష్ట్రలోని సోదరీమణులందరిలోనూ కనిపిస్తోంది.

మిత్రులారా,

లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను మీ వద్దకు వచ్చినప్పుడు కోట్ల మంది సోదరీమణులను 'లఖ్పతి దీదీలు'గా మార్చాలని చెప్పానుఅంటే స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తూ ఏడాదికి లక్ష రూపాయలకు పైగా సంపాదించే కోట్ల మంది సోదరీమణులుగత పదేళ్లలో కోటి మంది లఖపతి దీదీలు సృష్టించగలిగాం . గత రెండు నెలల్లోనే మరో 11 లక్షల మంది లఖపతి దీదీలు చేరారు. వీరిలో మహారాష్ట్ర నుంచి కొత్తగా లక్ష 'లఖ్పతి దీదీలుపుట్టుకొచ్చారుఇక్కడి మహాయుతి ప్రభుత్వం ఈ విజయం కోసం ఎంతో కృషి చేసిందిఏక్ నాథ్ జీదేవేంద్ర జీ, అజిత్ దాదా ల బృందం మొత్తం తల్లులు, సోదరీమణుల సాధికారతకు అంకితం చేయబడిందితల్లులుసోదరీమణులుయువతరైతుల కోసం మహారాష్ట్రలో అనేక పథకాలుకొత్త కార్యక్రమాలు అమలవుతున్నాయి.

మిత్రులారా,

'లఖ్పతి దీదీలుఅనే ప్రచారం కేవలం అక్కాచెల్లెళ్ల ఆదాయాన్ని పెంచడమే కాదుఇది మొత్తం కుటుంబాలను, భవిష్యత్ తరాలను శక్తివంతం చేసే గొప్ప ప్రచారంఇది గ్రామాల మొత్తం ఆర్థిక వ్యవస్థను మారుస్తోందిఇక్కడ ఉన్న ప్రతి సోదరి, కుమార్తె సంపాదన ప్రారంభించినప్పుడుఆమె హక్కులు పెరిగి, కుటుంబంలో ఆమె గౌరవం పెరుగుతుందని బాగా తెలుసుసోదరి ఆదాయం పెరిగినప్పుడుకుటుంబం ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బు ఉంటుందిమరో మాటలో చెప్పాలంటేఒక సోదరి కూడా 'లఖ్పతి దీదీ'గా మారినప్పుడుఅది కుటుంబం మొత్తం తలరాతను మారుస్తుంది.

ఇక్కడికి రాకముందు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సోదరీమణుల అనుభవాలను వింటున్నానులఖ్పతి దీదీలందరిలోనూ ఆత్మవిశ్వాసం అమోఘంనేను వారిని లఖ్పతి దీదీస్ అని పిలుస్తానుకాని కొందరు రెండు లక్షలుకొందరు మూడు లక్షల రూపాయలుమరికొందరు ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారుగత కొద్ది నెలల్లోనే వారు ఈ విజయాన్ని సాధించారు.

మిత్రులారా,

నేడుభారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని మీరు ప్రతిచోటా వింటున్నారుఈ విజయంలో మన సోదరీమణులుకూతుళ్లది కీలక పాత్రఅయితే కొన్నేళ్ల క్రితం ఈ పరిస్థితి ఉండేది కాదుసోదరీమణులు ప్రతి ఇంట్లోప్రతి కుటుంబంలో సంతోషానికి గ్యారంటీకానీ వారికి ఎలాంటి సాయం అందుతుందనే గ్యారంటీ ఎవరూ లేరుదేశవ్యాప్తంగా లక్షలాది మంది సోదరీమణుల పేరిట ఎలాంటి ఆస్తులు లేవువారికి బ్యాంకు నుంచి రుణం కావాలంటే అది లభించలేదుఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కుదరలేదుఅందుకే మీ సోదరుడుమీ కొడుకు ఒక తీర్మానం చేశారునా దేశం లోని తల్లులుసోదరీమణులుకుమార్తెలు ఎదుర్కొంటున్న సమస్యలను నేను ఏ విధంగానైనా పరిష్కరించాలని నిర్ణయించుకున్నాను. అందుకే మోదీ ప్రభుత్వం మహిళలకు అనుకూలంగా నిర్ణయాలు ఒకదాని తర్వాత మరొకటి తీసుకుందిఒక వైపు గత ప్రభుత్వాల ఏడు దశాబ్దాలను మరొక వైపు మోదీ ప్రభుత్వ పది సంవత్సరాలతో పోల్చమని నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. దేశంలోని సోదరీమణులుకుమార్తెల కోసం మోదీ ప్రభుత్వం చేసిన పని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఏ ఇతర ప్రభుత్వం చేయలేదు.

 

మిత్రులారా,

పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది మా ప్రభుత్వమేఇప్పటివరకు నిర్మించిన కోట్ల ఇళ్లలో ఎక్కువ భాగం మహిళల పేరిటే ఉన్నాయిమరో కోట్ల ఇళ్లు నిర్మించబోతున్నామువీటిలో చాలా వరకు మన తల్లులుసోదరీమణుల పేరిటనే ఉంటాయి. మేము చేసిన రెండవ ప్రధాన మార్పు బ్యాంకింగ్ వ్యవస్థలోమొదటమేము జన్ ధన్ ఖాతాలను ప్రారంభించాముఈ ఖాతాల్లో ఎక్కువ శాతం సోదరీమణుల పేరిటనే తెరిచారుఆ తర్వాత ముద్ర యోజనను ప్రారంభించిపూచీకత్తు లేకుండా రుణాలు అందించాలని బ్యాంకులను ఆదేశించాంఅవసరమైతే మోదీ హామీగా అక్కడే ఉన్నారుఈ పథకం లబ్ధిదారుల్లో 70 శాతం మంది తల్లులుసోదరీమణులేదేశంలో కొందరు మహిళలకు రుణాలు ఇవ్వకూడదనిఎందుకంటే అవి డిఫాల్ట్ (బకాయిలు చెల్లించలేరు)అవుతాయనిఇందులో ప్రమాదం ఉందని చెప్పారుకానీ నేను భిన్నంగా ఆలోచించానుమీ మీదమా మాతృశక్తి మీదమీ నిజాయితీ మీదమీ సామర్ధ్యాల మీద నాకు పూర్తి నమ్మకం ఉందిమా తల్లులుసోదరీమణులు కష్టపడి నిజాయితీగా అప్పులు తీర్చారు.

ఇప్పుడు ముద్రా రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాంమేము వీధి వ్యాపారుల కోసం పిఎం స్వనిధి పథకాన్ని కూడా ప్రారంభించాముపూచీకత్తు లేకుండా రుణాలను అందిస్తాముఈ పథకం మన సోదరీమణులు, కుమార్తెలకు కూడా చాలా ప్రయోజనం చేకూర్చిందిమా సోదరీమణులలో చాలా మంది హస్తకళలు చేసే విశ్వకర్మ సమాజంలో భాగంమా ప్రభుత్వం వారికి హామీలు ఇచ్చింది.

మిత్రులారా,

స్వయం సహాయక సంఘాలు లేదా సఖి మండలాల గురించి నేను మాట్లాడినప్పుడువాటి ప్రాముఖ్యతను చూడగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారుకానీ నేడు ఈ గ్రూపులు భారత ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన శక్తిగా మారుతున్నాయిగ్రామాలుమారుమూల గిరిజన ప్రాంతాల్లో సఖి మండలాలు తెచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయిగత పదేళ్లలో 10 కోట్ల మంది సోదరీమణులు ఈ ఉద్యమంలో చేరారుఈ సంఖ్య చాలా పెద్దదివాటిని బ్యాంకులతో అనుసంధానం చేశాంవారికి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పొందేలా చేశాం.

మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక గణాంకాన్ని నేను మీకు చెప్తాను, మన దేశం ఇంతకు ముందు ఎలా పనిచేసింది అనే దాని గురించి చెప్తే మీకు కోపం రావచ్చు. 2014 వరకు సఖి మండలాలకు రూ.25 వేల కోట్ల బ్యాంకు రుణాలు మాత్రమే ఇచ్చారుగుర్తుంచుకోండినేను మహిళా స్వయం సహాయక సంఘాల గురించి మాట్లాడుతున్నానుకేవలం 25,000 కోట్లు మాత్రమేగత పదేళ్లలో దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. 25,000 కోట్లు, 9 లక్షల కోట్లు పోల్చండిఅంతేకాకుండా ప్రభుత్వం అందించే ప్రత్యక్ష ఆర్థిక సహాయం దాదాపు 30 రెట్లు పెరిగిందిఫలితంగా గ్రామాల్లోని మన సోదరీమణులు తమ ఆదాయాన్ని పెంచుకుంటూ దేశాన్ని బలోపేతం చేస్తున్నారునేను మళ్ళీ చెబుతున్నానుఇది కేవలం ట్రైలర్ మాత్రమేఅక్కాచెల్లెళ్ల పాత్రను మరింత విస్తరిస్తున్నాంప్రస్తుతం 1.25 లక్షలకు పైగా బ్యాంకింగ్ కరస్పాండెంట్లు లేదా బ్యాంక్ సఖీలు గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారుకొందరు సోదరీమణులు కోటి రూపాయల వరకు లావాదేవీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

డ్రోన్ పైలట్లుగా మారేందుకు మహిళలకు శిక్షణ ఇస్తున్నాంఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు తోడ్పడేలా మహిళా సంఘాలకు లక్షల రూపాయల విలువైన డ్రోన్లను ఇస్తున్నాంపశు పోషకులకు సహాయం చేయడానికి మేము లక్షల పశు సఖీలకు (పశువుల పెంపకంలో నిమగ్నమైన మహిళలుశిక్షణ ఇస్తున్నాముఆధునికప్రకృతి సేద్యానికి నాయకత్వం వహించడానికి మహిళలకు సాధికారత కల్పిస్తున్నాంఇందుకోసం కృషి సఖి (అగ్రికల్చర్ ఫ్రెండ్కార్యక్రమాన్ని ప్రారంభించాంరాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా గ్రామాల్లో లక్షలాది కృషి సఖిలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాంఈ కార్యక్రమాలు ఆడపిల్లలకు ఉపాధి కల్పిస్తాయివారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, ఆడపిల్లల సామర్థ్యానికి సంబంధించి సమాజంలో కొత్త మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి.

మిత్రులారా,

గత నెలలోనే దేశం బడ్జెట్ ను ప్రవేశపెట్టిందితల్లులుసోదరీమణులుకూతుళ్లకు సంబంధించిన పథకాలకు బడ్జెట్ లో రూ.3 లక్షల కోట్లు కేటాయించారుఎక్కువ మంది ఆడపిల్లలు పనిచేసేందుకు వీలుగా కార్యాలయాలుకర్మాగారాలకు ప్రత్యేక సౌకర్యాలు ప్రకటించారుపని చేసే మహిళలకు వారి పిల్లల కోసం హాస్టళ్లుశిశుగృహాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందిఒకప్పుడు ఆంక్షలు ఎదుర్కొన్న ఆడపిల్లల కోసం మా ప్రభుత్వం ప్రతి రంగాన్ని తెరుస్తోందిప్రస్తుతం త్రివిధ దళాల్లో మహిళా అధికారులను నియమించిమహిళలను ఫైటర్ పైలట్లుగా నియమిస్తున్నారుకుమార్తెలు సైనిక్ స్కూల్స్మిలటరీ అకాడమీల్లో ప్రవేశం పొందుతున్నారుమన పోలీసు బలగాలుపారామిలిటరీ యూనిట్లలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందిగ్రామాల్లో వ్యవసాయంపాడిపరిశ్రమల నుంచి స్టార్టప్ విప్లవం వరకు ఎంతోమంది ఆడపిల్లలు నేడు వ్యాపారాలు నిర్వహిస్తున్నారురాజకీయాల్లో ఆడబిడ్డల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నారీ శక్తి వందన్ చట్టాన్ని తీసుకొచ్చాం.

మిత్రులారా,

తల్లులుసోదరీమణులుకుమార్తెలకు సాధికారత కల్పించడంతో పాటువారి భద్రత కూడా జాతీయ ప్రాధాన్యతఎర్రకోట నుంచి నేను ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించాను. మన అక్కాచెల్లెళ్లు ఏ స్థితిలో ఉన్నా వారి బాధలుకోపాన్ని నేను అర్థం చేసుకోగలనుమహిళలపై నేరాలు క్షమించరాని పాపాలని ప్రతి రాజకీయ పార్టీనిరాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరుతున్నానుదోషులు ఎవరే అయినా తప్పించుకోలేరు.వారికి ఏ రూపంలో సహాయం చేసిన వారు కూడా తప్పించుకోకూడదుఅది ఆసుపత్రి అయినాపాఠశాల అయినాకార్యాలయం అయినాపోలీస్ స్టేషన్ అయినాప్రతి స్థాయిలో జవాబుదారీతనం ఉండాలిఈ పాపం క్షమించరానిదని పై నుంచి కింది వరకు సందేశం స్పష్టంగా ఉండాలిప్రభుత్వాలు వస్తుంటాయిపోతాయికానీ ప్రాణాలను కాపాడటంమహిళల గౌరవాన్ని కాపాడటం ఒక సమాజంగాప్రభుత్వంగా మనకు ముఖ్యమైన బాధ్యత.

మిత్రులారా,

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా మా ప్రభుత్వం చట్టాలను నిరంతరం బలోపేతం చేస్తోందిఇంత పెద్ద సంఖ్యలో అక్కాచెల్లెళ్లుకూతుళ్లు ఈ రోజు ఇక్కడ ఉన్నందునఈ విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటున్నానుఎఫ్ఐఆర్లు సకాలంలో నమోదు కావడం లేదనివిచారణలు ఆలస్యమవుతున్నాయనికేసులు ఎక్కువ కాలం నడుస్తున్నాయని గతంలో ఫిర్యాదులు వచ్చాయిభారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో ఇలాంటి ఎన్నో అడ్డంకులను పరిష్కరించాంఇందులో మహిళలుచిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి మొత్తం అధ్యాయాన్ని కేటాయించారుబాధిత మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లలేకపోతే ఇంటి నుంచే ఈ-ఎఫ్ ఐఆర్ నమోదు చేసుకోవచ్చు-ఎఫ్ఐఆర్తో పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎలాంటి జాప్యంట్యాంపరింగ్ జరగకుండా చూశాందర్యాప్తు వేగవంతం కావడానికిదోషులను కఠినంగా శిక్షించడానికి ఇది దోహదపడుతుంది.

మిత్రులారా,

కొత్త చట్టాల్లో మైనర్లపై లైంగిక నేరాలకు మరణశిక్షయావజ్జీవ కారాగార శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయిఆడపిల్లలను పెళ్లి పేరుతో మోసం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయిగతంలో దీనిపై స్పష్టమైన చట్టం లేదుఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో పెళ్లి పేరుతో తప్పుడు వాగ్దానాలుమోసాలు స్పష్టంగా నిర్వచించబడ్డాయిమహిళలపై అఘాయిత్యాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇస్తున్నానుభారతీయ సమాజం నుంచి ఈ పాపపు మనస్తత్వాన్ని నిర్మూలించే వరకు మనం విశ్రమించకూడదు.

అందుకని మిత్రులారా,

నేడుభారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే మార్గంలో ముందుకు సాగుతోంది, ఇందులో మహారాష్ట్ర గణనీయమైన పాత్ర పోషిస్తుందిమహారాష్ట్ర 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశంకి ప్రకాశవంతమైన నక్షత్రంప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు మహారాష్ట్ర ఆకర్షణీయమైన కేంద్రంగా  మారుతోందిమరిన్ని పెట్టుబడులుకొత్త ఉద్యోగావకాశాలపైనే మహారాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.

మహాయుతి ప్రభుత్వం పెట్టుబడులుఉద్యోగాలకు హామీ ఇస్తుందిమహారాష్ట్రకు సుస్థిరమైన మహాయుతి ప్రభుత్వం చాలా సంవత్సరాలు అవసరంమహారాష్ట్రకు ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహించే ప్రభుత్వం అవసరంయువత విద్యనైపుణ్యాలుఉపాధిపై దృష్టి సారించే ప్రభుత్వం మహారాష్ట్రకు అవసరంమహారాష్ట్ర సుస్థిరతశ్రేయస్సు కోసం ఇక్కడి తల్లులుసోదరీమణులు ముందుకు వచ్చి నాకు మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను.

సోదరీమణులారామీపై నాకు పూర్తి నమ్మకం ఉందిమహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వ పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇస్తూనేమీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నాతో పాటు చెప్పండి -

భారత్ మాతా కీ జై

రెండు చేతులూ పైకెత్తిపిడికిలి బిగించిపూర్తి శక్తితో చెప్పండి. -

భారత్ మాతా కీ జై

భారత్ మాతా కీ జై

భారత్ మాతా కీ జై

భారత్ మాతా కీ జై

భారత్ మాతా కీ జై

చాలా ధన్యవాదాలు.

 

 

****



(Release ID: 2049605) Visitor Counter : 10