సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చత్తీస్‌గఢ్‌లో సహకార సంఘాల విస్తరణకు సంబంధించిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర దేశీయ వ్యవహారాలు, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


ఈరోజు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన సమావేశం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘స‌హ‌కార్ సే స‌మృద్ధి’ కలను సాకారం చేసేందుకు దేశంలోని ప్ర‌తి పంచాయితీలో ఒక స‌హ‌కార సంఘం ఏర్పాటు



కంప్యూటరీకరణ తరువాత ప్రతి పీఏసీఎస్ ఒక కామన్ సర్వీస్ సెంటర్‌గా పని చేయాలి

తద్వారా పీఏసీఎస్‌ చేపట్టే పలు కార్యక్రమాల ప్రయోజనాలు గ్రామీణులకు చేరతాయి

వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ పోర్టల్‌లో పీఏసీఎస్‌ ద్వారా 100 శాతం నమోదు జరగాలి


అన్ని మార్కెట్లలోని వర్తకులు, అన్ని పీఏసీఎస్‌లు, సహకార సంఘాలు జిల్లా సహకార బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉండాలి


పీఏసీఎస్‌ల విస్తరణ కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొత్తగా 4 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులను ఏర్పాటు చేయాలి

ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 33 జిల్లాల్లో జల కమిటీలుగా పని చేసే పీఏసీఎస్‌లను ప్రారంభించిన శ్రీ అమిత్ షా

‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో భాగంగా, “పీపల్ ఫర్ పీపుల్” కార్యక్రమం కింద మొక్కలు నాటిన శ్రీ అమిత్ షా

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అభివృద్ధి పనులను కూడా ప్రారంభించిన మంత్రి.

Posted On: 25 AUG 2024 5:13PM by PIB Hyderabad

రాష్ట్రంలో సహకార సంఘాల విస్తరణకు సంబంధించిన సమీక్షా సమావేశం కేంద్ర దేశీయ వ్యవహారాలు, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆయా జిల్లాలలో జల కమిటీలుగా పని చేస్తున్న ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ (పీఏసీఎస్)లను కూడా శ్రీ అమిత్ షా ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయికేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ అరుణ్ సావోకేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భుటానీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

'ఏక్ పేడ్ మా కే నామ్ప్రచారంలో భాగంగాకేంద్ర దేశీయ వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి "పీపల్ ఫర్ పీపుల్" కార్యక్రమం కింద మొక్కలు నాటారు. అలాగే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెందిన అనేక అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

 

సహకార సంఘాల సమీక్షా సమావేశంలో కేంద్ర సహకార మంత్రి ప్రసంగిస్తూప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలలుగన్న “సహకార్ సే సమృద్ధి” సాకారం కోసం దేశంలోని ప్రతి పంచాయతీలో సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొత్త ప్రజా డెయిరీ పథకాన్ని తీసుకురావాలన్నారు. డెయిరీ, ఫిషరీస్ సహకార సంస్థలుగా సేవలందించటంతో పాటు బహుళ ప్రయోజన యూనిట్‌గా కూడా పీఏసీఎస్‌లు పనిచేసేలా ఈ పథకాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.

 

ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 2058 పీఏసీఎస్‌లు మోడల్ బై-లాస్‌ను పెట్టుకున్నాయని కేంద్ర దేశీయ వ్యవహారాలు, సహకార మంత్రి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని డ్రై ఏరియాలను కనుగొనడానికి నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ ఉపయోగించాలనిఇది సహకార సంఘాల విస్తరణకు దోహదపడుతుందని ఆయన అన్నారు. కంప్యూటరీకరణ ద్వారాప్రతి పీఏసీఎస్‌ను కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)గా మార్చాలనితద్వారా పీఏసీఎస్ చేపట్టే పలు కార్యక్రమాల ప్రయోజనాలు గ్రామీణ ప్రజలకు అందుతాయని ఆయన పేర్కొన్నారు.

***

(Release ID: 2048817) Visitor Counter : 51