ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేపాల్ లో తనహున్ లో జరిగిన బస్సు దుర్ఘటన బాధితులకు ఎక్స్ గ్రేషియాను ప్రకటించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 24 AUG 2024 2:51PM by PIB Hyderabad

నేపాల్ లో తనహున్ జిల్లా లో బస్సు ప్రమాదం లో బాధితులకు ఎక్స్ గ్రేషియా ను ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల పరిహారాన్ని, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇస్తారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ మాధ్యమం లో నమోదు చేసిన ఒక సందేశంలో -

‘‘నేపాల్ లో తనహున్ జిల్లా లో జరిగిన బస్సు దుర్ఘటన మృతుల దగ్గరి సంబంధికులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల అనుగ్రహ రాశిని ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.

 

 

***

MJPS/TS


(Release ID: 2048552) Visitor Counter : 76