ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘బిలీనియం’ సీఈవో గవెల్ లోపిన్స్కితో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 22 AUG 2024 9:22PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘బిలీనియం’ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) గవెల్ లోపిన్స్కితో సమావేశమయ్యారు. ఇది మహారాష్ట్రలోని పుణె నగరంలోగల ప్రముఖ పోలాండ్ సమాచార సాంకేతిక రంగ కంపెనీ.

   ఈ సందర్భంగా భారతదేశంలో సానుకూల పెట్టుబడి వాతావరణంతోపాటు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా దేశం ప్రగతి పథంలో సాగుతుండటాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే బిలీనియం సంస్థ విస్తరణ ప్రణాళికల గురించి వాకబు చేయడంతోపాటు నవ్య-వర్ధమాన సాంకేతికతలు, కృత్రిమ మేధ (ఎఐ), సైబర్ భద్రత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల్లో భారత్-పోలాండ్ మధ్య వ్యాపార సహకారానికిగల అవకాశాలపై చర్చించారు.

   భార‌త్‌లో వాణిజ్య సౌలభ్య కల్పనసహా పెట్టుబడి అనుకూల వాతావరణ సృష్టిపై ప్రభుత్వ నిబద్ధత గురించి శ్రీ లోపిన్స్కీకి ప్రధానమంత్రి  వివరించారు.

 

***

MJPS/AK


(Release ID: 2047958) Visitor Counter : 38