రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఫరీదాబాద్ లోని జేసీ బోస్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి

Posted On: 21 AUG 2024 2:35PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2024, ఆగస్టు 21న హర్యానాలోని ఫరీదాబాద్‌లో జేసీ బోస్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. నేడు ప్రపంచం మొత్తం నాలుగో పారిశ్రామిక విప్లవ యుగంలో ఉందన్నారు. ఈ విప్లవం సవాళ్లను ఎదుర్కోవడానికి, దాని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి భారతదేశం కూడా సిద్ధంగా ఉందని, ఈ జాతీయ లక్ష్యాన్ని సాధించడంలో, జేసీ బోస్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సంస్థల పాత్ర చాలా ముఖ్యమైనదని ఆమె తెలిపారు. 

ఈ యూనివర్సిటీ గత కొన్నేళ్లుగా అనేక పారిశ్రామిక, విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. అనేక బహుళజాతి కంపెనీలు విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్ ను కూడా ఏర్పాటు చేశాయి. ఈ ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల నేడు ప్రగతికి అనేక దారులు తెరుచుకున్నాయని రాష్ట్రపతి అన్నారు. ఉదాహరణకు, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయడం వల్ల అనేక ఆన్‌లైన్ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి, కానీ సాంకేతికతను సరైన, స్థిరమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలన్న విషయం మనం గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి చెప్పారు. దాని తప్పుగా వినియోగిస్తే వినాశనానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. 

యువత నైపుణ్యం, స్వావలంబనను సాధించడంలో జేసీ బోస్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందుకు రాష్ట్రపతి ప్రశంసించారు. దేశ విదేశాల్లో అనేక రంగాల్లో విశేష కృషి చేస్తున్న పూర్వ విద్యార్థులు ఎందరో ఈ యూనివర్సిటీ వారు ఉండడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థుల సంఘం సహకారం మరింత ప్రభావవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె యూనివర్సిటీ పాలకవర్గానికి సూచించారు.

చెట్లు, మొక్కలకు కూడా కొన్ని భావాలు ఉంటాయని శాస్త్రీయంగా నిరూపించిన జగదీష్ చంద్రబోస్ గొప్ప శాస్త్రవేత్త అని అన్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఆద్యుడు అయిన జగదీష్ చంద్రబోస్ పేరు ఈ విశ్వవిద్యాలయానికి  పెట్టారని రాష్ట్రపతి అన్నారు. అతని విప్లవాత్మక ఆవిష్కరణల వల్ల, వృక్షశాస్త్ర ప్రపంచాన్ని మనం చూసే విధానాన్ని మార్చివేసిందని, విద్యార్థులు ఆయన జీవితాన్ని, రచనలను స్ఫూర్తిగా తీసుకుని టెక్నాలజీ ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని రాష్ట్రపతి కోరారు.

 

***



(Release ID: 2047534) Visitor Counter : 18