రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆగస్టు 23 నుంచి 26 వరకూ రక్షణ మంత్రి అమెరికా పర్యటన


యుఎస్ రక్షణ మంత్రి శ్రీ లాయడ్ ఆస్టిన్ తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్న శ్రీ రాజ్ నాథ్ సింగ్

భారతదేశం-యుఎస్ విస్తృత ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచడం ఈ సందర్శన ధ్యేయం

Posted On: 21 AUG 2024 10:01AM by PIB Hyderabad

అమెరికా రక్షణ శాఖ మంత్రి శ్రీ లాయడ్ ఆస్టిన్ ఆహ్వానం మేరకు, రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ 2024 ఆగస్టు 23 నుంచి 26 వరకూ అమెరికా ఆధికారిక పర్యటనలో ఉంటారు. ఇరుదేశాల రక్షణ మంత్రుల స్థాయి- ద్వైపాక్షిక సమావేశంలో ఆయన పాల్గొంటారు. అమెరికా జాతీయ భద్రతా వ్యవహారాల్లో అధ్యక్షునికి సహాయకుడైన శ్రీ జాక్  సల్లివాన్ తో కూడా శ్రీ రాజ్ నాథ్ సింగ్ సమావేశం కానున్నారు.

భారత, అమెరికా సంబంధాలు ఒకవైపు వేగం పుంజుకుంటున్నాయి. మరోవైపు రక్షణ రంగాల్లో ఇరుదేశాలూ కలిసి వివిధ స్థాయుల్లో ఇప్పటికే పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి అమెరికా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.

 ఈ సందర్శన భారత, అమెరికాల విస్తృత ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడంతో పాటు పటిష్ట పరచగలదన్న భావన వ్యక్తం అవుతోంది.

 

రక్షణ రంగంలో వర్తమానంలో అమలవుతున్న సహకార పూర్వక ఒప్పందాలతో పాటు రాబోయే కాలంలో ఆ దిశగా ఆశించే సహకారం వంటి అంశాలపై అమెరికా రక్షణ రంగ పరిశ్రమ ప్రతినిధులతో జరగనున్న ఒక ఉన్నత స్థాయి సమావేశానికి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఇదే సందర్భంగా, అమెరికాలోని ప్రవాస భారతీయలను కూడా ఆయన కలుస్తారు. 

***

 



(Release ID: 2047251) Visitor Counter : 29