ప్రధాన మంత్రి కార్యాలయం
‘జిఇఎమ్’ పోర్టల్‌కు 8 ఏళ్లు భాగస్వాములందరికీ ప్రధాని అభినందనలు
Posted On:
09 AUG 2024 1:40PM by PIB Hyderabad
ప్రభుత్వ ఎలక్ట్రానిక్ విక్రయ వేదిక (గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్-జిఇఎమ్) ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇందులో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలిపారు.
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ‘ఒబిసి’ వర్గాలవారికి ఈ వేదిక ఎన్నో అవకాశాలు కల్పించిందని ఈ సందర్భంగా శ్రీ మోదీ గుర్తుచేశారు. అలాగే మహిళలకు సాధికారత కల్పించడంలోనూ ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘ప్రభుత్వ ఎలక్ట్రానిక్ విక్రయ వేదిక-జిఇఎమ్ @GeM_India 8 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భాగస్వాములందరికీ అభినందనలు. ఈ వేదిక ఇప్పటిదాకా దాదాపు రూ.10 లక్షల కోట్లకుపైగా విక్రయాలతో అద్భుత పనితీరును ప్రదర్శించింది. ప్రధానంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు... ప్రత్యేకించి, ‘ఎమ్ఎస్ఎమ్ఇ’లు, అంకుర సంస్థలతో ముడిపడినవారికి అవకాశాలు కల్పించింది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, ‘ఒబిసి’ సామాజిక వర్గాలకు ఉపాధి మార్గాలు చూపడమేగాక మహిళా సాధికారతకు ఎనలేని తోడ్పాటునిచ్చింది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2046847)
Visitor Counter : 38
Read this release in:
Kannada
,
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Malayalam