అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

భూ పరిశీలక ఉపగ్రహం ఈవోఎస్-08ను ప్రయోగించిన ఇస్రో

Posted On: 16 AUG 2024 10:51AM by PIB Hyderabad

ఇస్రో తాజా భూపరిశీలక ఉపగ్రహం ఈవోఎస్-08ను సూక్ష్మ ఉపగ్రహ వాహక నౌక (ఎస్ఎస్ఎల్వీ)-డీ3 ద్వారా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 9:17 గంటలకు ప్రయోగించారు.

సూక్ష్మ ఉపగ్రహ రూపకల్పన, అభివృద్ధి, సూక్ష్మ ఉపగ్రహ పరికరాలను ఉంచే చట్రాని (బస్సు)కి అనుకూలంగా పరికరాలను తయారుచేయడం, భవిష్యత్ కార్యాచరణ ఉపగ్రహాలకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం వంటివి ఈవోఎస్-08 మిషన్ ప్రధాన లక్ష్యాలు.

మైక్రోశాట్/ఐఎంఎస్-1 బస్సు (ప్రధాన చట్రం)పై నిర్మించిన ఈవోఎస్-08 మూడు పేలోడ్లను రవాణా చేయగలదు. విద్యుత్కాంతీయ పరారుణ పేలోడ్ (ఈవోఐఆర్), అంతర్జాతీయ గమన (నేవిగేషన్) ఉపగ్రహ వ్యవస్థ- పరావర్తన మాపక పేలోడ్ (జీఎన్ఎస్ఎస్-ఆర్), ఎస్ఐసీ యూవీ డోసిమీటర్. మధ్య తరంగ ఇన్ఫ్రా రెడ్ (ఎంఐఆర్), దీర్ఘ తరంగ ఇన్ఫ్రా రెడ్ (ఎల్ డబ్ల్యూఐఆర్) తరంగ దైర్ఘ్యాల్లో పగలూ రాత్రీ- రెండు సమయాల్లో చిత్రాలను సంగ్రహించే విధంగా ఈవోఐఆర్ పేలోడ్ ను రూపొందించారు. ఉపగ్రహ ఆధారిత నిఘా, విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పర్యవేక్షణ, అగ్నిని గుర్తించడం, అగ్నిపర్వత కార్యకలాపాల పరిశీలన, పారిశ్రామిక, విద్యుత్ ప్లాంటు విపత్తు పర్యవేక్షణ వంటి అంశాల్లో దీనిని ఉపయోగిస్తారు.

సముద్ర ఉపరితలపు వాయు విశ్లేషణ, నేలలో తేమను అంచనా వేయడం, హిమాలయ ప్రాంతంలో క్రయోస్ఫియర్ అధ్యయనాలు, వరదల గుర్తింపు, ఉపరితల జలవనరుల గుర్తింపు వంటి అవసరాల కోసం జీఎన్ఎస్ఎస్-ఆర్ పేలోడ్ ఉపకరిస్తుంది. ఇది రిమోట్ సెన్సింగ్ ద్వారా పనిచేస్తుంది. మరోవైపు, ఎస్ఐసీ యూవీ డోసిమీటర్ ‘‘గగనయాన్ మిషన్’’ లోని క్ర్యూ మాడ్యూల్ వీక్షణ ద్వారం వద్ద అతినీల లోహిత కిరణాల ఉద్గారాన్ని పర్యవేక్షిస్తుంది. అలాగే గామా కిరణాల ఉద్గారం ఎక్కువగా ఉన్నపుడు హెచ్చరించడానికి కూడా ఉపకరిస్తుంది.

475 కిలోమీటర్ల ఎత్తులో అంటే 37.4 డిగ్రీల వంపుతో భూమికి సమీప కక్ష్య (ఎల్ఈవో)లో పనిచేసేలా ఈ ఉపగ్రహ కార్యకలాపాలను నిర్దేశించారు. ఏడాదిపాటు పని చేసే ఈ ఉపగ్రహం బరువు దాదాపు 175.5 కిలోలు. ఇది దాదాపు 420 వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎస్ఎస్ఎల్వీ-డీ3 వాహక నౌకతో ఇది సమాచార బంధాన్ని కలిగి ఉంటుంది.

ఉపగ్రహ ప్రధాన చట్రంలో సమాచార వినిమయం, బేస్ బ్యాండ్, సమాచార నిల్వ, పొజిషనింగ్ ప్యాకేజీ వంటి వన్నీ కలిస్తే- అది సమీకృత ఏవియానిక్స్ వ్యవస్థ అవుతుంది. ఈ తరహా అంతరిక్షపరమైన సాంకేతిక పురోగతికి ఈవోఎస్-08 ఒక సూచిక. ఈ వ్యవస్థలో రెడీమేడ్ గా అందుబాటులో ఉండే పరికరాలను ఉపయోగించారు. 400 జీబీ సమాచారాన్ని నిల్వ చేయడానికి ఇవి ఉపకరిస్తాయి. 400 జీబీ వరకు సమాచారాన్ని నిల్వ చేయగలదు. అదనంగా, ఈ ఉపగ్రహంలో పీసీబీతో పొందుపరిచిన నిర్మాణాత్మక ప్యానెల్, పొందుపరిచిన బ్యాటరీ, సూక్ష్మ – డీజీఏ (ద్వంద్వ గింబల్ యాంటెనా), ఎం-పీఏఏ (ఫేజ్డ్ అర్రే యాంటెనా), అనువైన సౌర ప్యానెల్, ఉంటాయి – ఆన్ బోర్డు సాంకేతిక ప్రదర్శనలో ప్రతి ఒక్కటీ కీలక విభాగాలుగా పనిచేస్తాయి.

ఉపగ్రహం దాని యాంటెనాలో గుర్తింపు యంత్రాంగం, సెకనుకు 6 డిగ్రీల భ్రమణ వేగాన్ని సాధించగల సమర్థత, ±1 డిగ్రీలతో కచ్చితత్వాన్ని కొనసాగించేలా ఒక సూక్ష్మ నమూనాను ఉపయోగిస్తుంది. సూక్ష్మీకృత క్రమబద్ధ అర్రే యాంటెనా ప్రసార సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుంది. మరోవైపు అమరిక సౌలభ్యం గల సౌర ఉపరితల ప్యానెల్, జీఎఫ్ఆర్పీ నాళం, సీఈఆర్పీ హనీకాంబ్ దృఢమైన అంచుగల పానెల్ తో అనువైన సోలార్ ప్యానెల్ ఉంటుంది. ఇది మెరుగైన విద్యుదుత్పత్తి, నిర్మాణ సమగ్రతను అందిస్తుంది.

350 వాట్స్/మీటర్ కెవిన్ అధిక ఉష్ణ వాహకత్వానికి ప్రసిద్ధి చెందిన పైరొలైటిక్ గ్రాఫైట్ పొర వ్యాప్తి ఫలకం ద్రవ్యరాశిని తగ్గిస్తుంది. అందులో వివిధ ఉపగ్రహ విధుల అనువర్తనాలను గమనించవచ్చు. అంతేకాక, ఈవోఎస్-08 మిషన్ మడత బందులను ఉపయోగించి ఉపగ్రహ ప్యానెళ్లను ఏకీకృతం చేసే కొత్త పద్ధతిని అవలంబించారు. అమరిక, సమీకరణ, పరీక్ష (ఏఐటీ) దశకు సంబంధించిన వ్యవధిని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.

అదనపు కొత్త విధానాలను ప్రవేశపెట్టి, ఈవోఎస్-08 మిషన్ ఎక్స్-బ్యాండ్ డేటా ప్రసారం ద్వారా ఉపగ్రహ సాంకేతికతను మెరుగుపరుస్తుంది. ఎక్స్-బ్యాండ్ డేటా వాహకాల కోసం ధాతు రూపకల్పన (పల్స్ షేపింగ్), ఫ్రీక్వెన్సీ కాంపెన్సేటెడ్ మాడ్యులేషన్లను ఉపయోగిస్తుంది. ఉపగ్రహ బ్యాటరీ నిర్వహణ వ్యవస్థలో ఎస్ఎస్ టీసీఆర్-ఆధారిత ఛార్జింగ్, బస్సు నియంత్రణ, 6 హెచ్.జెడ్ పౌనఃపున్యం వద్ద తంతులను శ్రేణిగా చేర్చడం లేదా మినహాయించడం వంటివి ఉంటాయి.

సౌర ఫలకాల తయారీ (సోలార్ సెల్ ఫ్యాబ్రికేషన్), సూక్ష్మ ఉపగ్రహ అనువర్తనాల కోసం నానో నక్షత్ర గ్రాహక వినియోగ ప్రక్రియలలో దేశీయతా దిశగా ఈ మిషన్ కృషి స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా, ప్రతిచర్య వలయ ఐసొలేటర్ల ద్వారా జడత్వ వ్యవస్థ ప్రయోజనం పొందుతుంది. అది ప్రకంపనలను తగ్గించడంతో పాటు; టీటీసీ, ఎస్పీఎస్ అనువర్తనాల కోసం ఒకే యాంటెనా సమన్వయాన్ని ఉపయోగిస్తుంది. సీవోటీఎస్ విభాగాల ఊష్ణ లక్షణాల నిర్వహణ కోసం ఏఎఫ్ఈ బీజీఏ, కింటెజ్ ఎఫ్ పీజీఏ, జర్మేనియం బ్లాక్ కప్టన్, స్టామెట్ (సిలికాన్-అల్యూమినియం మిశ్రమం) బ్లాక్ కప్టాన్ వంటి మూలకాలను ఉపయోగిస్తారు. ఈ మిషన్ లో స్వీయ ప్రయోగ కేంద్రాన్ని స్వయంచాలకంగా ప్రారంభించే లక్షణం కూడా ఉంటుంది. సృజనాత్మక నిర్వహణ దిశగా ఈ మిషన్ రూపుదిద్దుకున్నది.  

 

***


(Release ID: 2046493) Visitor Counter : 236