సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
లోక్ పాల్ సంస్థ లో 78వ స్వాతంత్ర్య దిన వేడుకలు
प्रविष्टि तिथि:
15 AUG 2024 12:39PM by PIB Hyderabad
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్ పాల్ సంస్థ కార్యాలయంలో జాతీయ జెండాను చైర్ పర్సన్ గౌరవనీయ శ్రీ జస్టిస్ అజయ్ మాణిక్ రావ్ ఖాన్ విల్ కర్ ఎగురవేశారు. సంస్థ సభ్యులు గౌరవనీయ శ్రీ జస్టిస్ సంజయ్ యాదవ్, శ్రీ సుశీల్ చంద్ర, శ్రీ పంకజ్ కుమార్, శ్రీ అజయ్ తిర్కీ లు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. గౌరవనీయ సభ్యులకు, ఉన్నతాధికారులకు, కార్యాలయ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు లోక్ పాల్ చైర్ పర్సన్ స్వాతంత్ర్య దిన శుభాభినందనలు తెలిపారు. స్వేచ్ఛ కలిగిన, స్వతంత్ర భారత్ ను మనకు ఇవ్వడానికి ప్రాణాలను అర్పించిన వారంతా చేసిన అనేక త్యాగాలను ఆయన గుర్తుకు వచ్చారు.
ఆత్మనిర్భర్ భారత్ ను, వికసిత్ భారత్ ను ఆవిష్కరించడానికి మన దేశం ప్రతి ఒక్క రంగంలో శరవేగంగా ముందుకు దూసుకుపోతోందని ఆయన నొక్కిచెప్పారు. ఈ వృద్ధితో వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయి, దాంతో పాటే కొందరిలో దురాశ పేరుకుపోతుంది. లోక్ పాల్ వంటి సంస్థలు కావలివ్యక్తిలా వ్యవహరించి తీరాలి, పారదర్శకత నిండిన పాలనకు, అవినీతి జాడ లేని పాలనకు అండదండలను అందించాలి. దేశ రాజ్యాంగం లో ఉల్లేఖించిన లక్ష్యాల సాధనకు లోక్ పాల్ సంస్థ అధికారులు, సిబ్బంది వారి వంతు సర్వోత్తమ సేవలను అందించాలని ఆయన ఉద్బోధించారు.
గౌరవ చైర్ పర్సన్, సభ్యులు ఈసందర్భంగా మొక్కలు నాటి నీరు పోశారు.
(रिलीज़ आईडी: 2045759)
आगंतुक पटल : 78