కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

పెన్షనర్లు చందాదారులకు అవగాహన దిశగా 2024 ఆగస్టు 13న ‘ఇపిఎఫ్ఒ’ 5వ సదస్సు ప్రత్యక్ష కార్యక్రమం

Posted On: 12 AUG 2024 8:12PM by PIB Hyderabad

   ద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) ప్రత్యక్ష అవగాహన కల్పన కార్యక్రమాల్లో భాగంగా 2024 ఆగస్టు 13న 5వ సదస్సును నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో ‘ఇపిఎఫ్ ఖాతా బదిలీ’పై అవగాహన కల్పిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ‘ఇపిఎఫ్ఒ’ సామాజిక మాధ్యమ ఖాతాలు- ఫేస్‌బుక్‌ (@socialepfo), ఇన్‌స్టాగ్రామ్‌ (@social_epfo), యూ ట్యూబ్ (@socialepfo) ద్వారా చూడవచ్చు. ఈ సందర్భంగా ‘ఇపిఎఫ్’ బదిలీ ప్రాధాన్యం-ప్రక్రియ, విశిష్ట ఖాతా సంఖ్య (యుఎఎన్) లేదా సభ్యత్వ గుర్తింపు సంఖ్య (ఎం.ఐడి)ల విలీనం వంటివాటిపై నిపుణులు వివరించడంతోపాటు సందేహ నివృత్తి చేస్తారు.

   ‘ఇపిఎఫ్ఒ’ ప్రతినెల రెండో మంగళవారం సంస్థ సభ్యులు, పెన్షనర్లకు వివిధ అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పన కార్యక్రమాలు నిర్వహిస్తూంటుంది. ఇందులో భాగంగా తొలి కార్యక్రమం 2024 మే 14న ‘ఇపిఎఫ్-95’ పథకంపై నిర్వహించారు. అనంతరం 2024 జూలై 31 నాటి కార్యక్రమంలో ‘స్తంభింపజేసిన ఖాతాల’పై అవగాహన కల్పించారు. ఈ రెండింటి విషయంలో సభ్యులు, పెన్షనర్ల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటిపై దృష్టి పెట్టింది.

   ఈ కార్యక్రమం ద్వారా వివిధ అంశాలపై సమాచారం ఇవ్వడంతోపాటు సభ్యుల ప్రశ్నలకు నిపుణులు జవాబివ్వడం వల్ల వారికి జీవన సౌలభ్యం కలుగుతుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతోపాటు సందేహ నివృత్తి చేయడం, ఈ రంగంలో తాజా సంస్కరణల గురించి తెలపడం లక్ష్యంగా ‘ఇపిఎఫ్ఒ’ క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

***



(Release ID: 2044778) Visitor Counter : 23