ప్రధాన మంత్రి కార్యాలయం

ఏనుగుల రక్షణకు పెద్ద ఎత్తున జరుగుతున్న సాముదాయిక ప్రయత్నాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు


ఏనుగులకు మన సంస్కృతితో, మన చరిత్రతో బంధం ఉంది: ప్రధాన మంత్రి

Posted On: 12 AUG 2024 9:30AM by PIB Hyderabad

ఏనుగులను కాపాడే దిశలో సాముదాయిక ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ప్రపంచ ఏనుగు దినం’ సందర్భంగా ప్రశంసించారు.  ఏనుగులు వర్థిల్ల గలిగేందుకు అనువైన వసతిని వాటికి అందుబాటులోకి తీసుకు రావడానికి చేతనైన అన్ని విధాలుగాను సాయపడటానికి కంకణం కట్టుకొన్నట్లు  కూడా శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

 

మన సంస్కృతిలోను, మన చరిత్రలోను ఏనుగులకు ఉన్న విలువను, ప్రాధాన్యాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.  గత కొన్ని సంవత్సరాలలో ఏనుగుల సంఖ్య  పెరుగుతూ ఉండడాన్ని ఆయన ప్రశంసించారు.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో:

 

 ‘‘ఏనుగులను కాపాడటానికి సాముదాయిక ప్రయత్నాలు పెద్దఎత్తున జరుగుతూ ఉండceన్ని ప్రశంసించే సందర్భమే ‘వరల్డ్ ఎలిఫెంట్ డే’.  అదే సమయంలో ఏనుగులు వర్థిల్ల గలిగేందుకు ఒక అనువైన పరిసరాలను వాటికి అందుబాటులోకి తెచ్చేందుకు చేతనైన అన్ని విధాలుగాను సాయపడాలన్న మన నిబద్ధతను మనం పునరుద్ఘాటించుదాం.  భారతదేశంలో మన దృష్టిలో,  ఏనుగులకు మన సంస్కృతితోను మన చరిత్రతోను అనుబంధం ఉంది.  గత కొన్నేళ్ళలో ఏనుగుల సంఖ్య వృద్ధి చెందుతూ ఉండడం సంతోషాన్ని కలిగిస్తోంది.’’ అని పేర్కొన్నారు.

 

*********

MJPS/SS/ST



(Release ID: 2044467) Visitor Counter : 62