చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పోక్సో’ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Posted On: 09 AUG 2024 12:38PM by PIB Hyderabad

   నేర విచారణ సవరణ చట్టం-2018 కింద అత్యాచారం, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం సంబంధిత పెండింగ్ కేసుల సత్వర విచారణ- పరిష్కారం లక్ష్యంగా ప్రత్యేక ‘పోక్సో’ కోర్టులు సహా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం 2019 అక్టోబర్ నుంచి కేంద్ర ప్రాయోజిత పథకం అమలు చేస్తోంది. తొలుత ఈ పథకాన్ని ఏడాదిపాటు అమలు చేయగా, అటుపైన 2023 మార్చి వరకు, తదనంతరం  2026 మార్చి 31దాకా ప్రభుత్వం పొడిగించింది. దీని అమలుకు నిర్భయ నిధి నుంచి రూ.1,952.23 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర వాటా రూ.1,207.24 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో న్యాయాధికారి, ఏడుగురు సహాయ సిబ్బందికిగాను జీతాలు, రోజువారీ ఖర్చుల కింద ‘ఫ్లెక్సీ గ్రాంట్’గా ‘సీఎస్ఎస్’ పద్ధతిలో (60:40; 90:10) నిష్పత్లిలో కేంద్ర రాష్ట్రాలు నిధులివ్వాల్సి ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల కింద సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కార్యనిర్వాహక న్యాయస్థానాల సంఖ్యను బట్టి రీయింబర్స్‌ మెంట్ ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తారు. ఈ పథకం మొదలైన నాటినుంచి దీనికింద కేంద్రం ఏటా కేటాయించిన/విడుదల చేసిన నిధుల వివరాలిలా ఉన్నాయి:

(రూ.కోట్లలో)

                   ఆర్థిక సంవత్సరం

కేటాయించిన బడ్జెట్

నిధులలో కేంద్ర వాటా

2019-20

140.00

140.00

2020-21

160.00

160.00

2021-22

180.00

134.55*

2022-23

200.00

200.00

2023-24

200.00

200.00

2024-25

200.00

82.78 (ఇప్పటిదాకా)

                       మొత్తం

1080.00

917.33

*కొవిడ్ వల్ల 2021-22 నాటి బడ్జెట్ లో తక్కువ నిధుల విడుదలతో కొత్త ‘పీఎఫ్ఎంఎస్’ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్రాలు సమయం తీసుకుంటున్నాయి

   హైకోర్టుల నుంచి అందిన సమాచారం ప్రకారం- 2024 మే వరకు దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 410 ప్రత్యేక పోక్సో (ఇ-పోక్సో) కోర్టులుసహా 755 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు విధులు నిర్వర్తిస్తున్నాయి. వీటిద్వారా ఇప్పటిదాకా 2,53,000 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ నేపథ్యంలో 2024 మే 31 నాటికి పరిష్కృతమైన కేసుల సంఖ్య, రాష్ట్రాలవారీగాగల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల వివరాలను కింది అనుబంధంలో చూడవచ్చు.

అనుబంధం

 

క్ర.సం

రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం

పనిచేస్తున్న న్యాయస్థానాలు

పథకం ప్రారంభం నాటి నుంచి పరిష్కారమైన కేసులు

 

పోక్సో మాత్రమే ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

కేవలం పోక్సో

ఎఫ్ టీ ఎస్ సీ లు

కేవలం పోక్సో

మొత్తం

 
 

1

ఆంధ్రప్రదేశ్

16

16

0

4899

4899

 

2

అసోం

17

17

0

5893

5893

 

3

బిహార్

46

46

0

11798

11798

 

4

ఛండీగఢ్

1

0

265

0

265

 

5

ఛత్తీస్ ఘడ్

15

11

924

4044

4968

 

6

దిల్లీ

16

11

555

1262

1817

 

7

గోవా

1

0

32

34

66

 

8

గుజరాత్

35

24

2263

9793

12056

 

9

హరియాణా

16

12

1572

4675

6247

 

10

హిమాచల్ ప్రదేశ్

6

3

416

1126

1542

 

11

జమ్ము, కశ్మీర్

4

2

91

101

192

 

12

జార్ఖండ్

22

16

2279

4537

6816

 

13

కర్ణాటక

31

17

3740

6657

10397

 

14

కేరళ

55

14

13530

6123

19653

 

15

మధ్యప్రదేశ్

67

57

3894

22456

26350

 

16

మహారాష్ట్ర

14

7

7258

11530

18788

 

17

మణిపూర్

2

0

146

0

146

 

18

మేఘాలయా

5

5

0

462

462

 

19

మిజోరాం

3

1

148

55

203

 

***


(Release ID: 2044187)