ప్రధాన మంత్రి కార్యాలయం

ఎలక్ట్రానిక్స్ ఎగుమతులలో భారతదేశం సాధించిన ప్రగతికి ప్రధాన మంత్రి ప్రశంసలు


ఎలక్ట్రానిక్స్ ఎగుమతులలో అగ్రగామి మూడు దేశాల సరసన భారతదేశం

Posted On: 05 AUG 2024 3:30PM by PIB Hyderabad

ఎలక్ట్రానిక్స్  ఎగుమతులలో భారతదేశం సాధించిన ప్రగతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్  ఎగుమతులు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి మూడు దేశాల సరసన నిలిపాయి.  యువ శక్తి వినూత్న కృషిదే ఈ ఘనత అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.   ఇదే జోరును రాబోయే కాలాల్లో సైతం కొనసాగించడానికి భారతదేశం కట్టుబడి ఉందని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

 

భారతదేశం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులలో ప్రస్తుతం అగ్రగామి మూడు దేశాలలో ఒకటిగా నిలచిందని ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతికత శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో తెలిపారు.  భారతదేశం నుంచి  ఏపిల్ ఐఫోన్ ఎగుమతులలో వృద్ధి ఒక చోదక శక్తి గా నిలచినట్లు, 2024-25 (ఆర్థిక సంవత్సరం 25) లో ఏప్రిల్-జూన్ (ఒకటో త్రైమాసికం..క్యు1) ముగిసేసరికి రత్నాభరణాల కన్నా ఎలక్ట్రానిక్స్  ఎగుమతులే అధికంగా నమోదై భారతదేశం అగ్రగామి పది ఎగుమతులలోనూ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు మూడో స్థానంలో నిలచినట్లు బిజినెస్ స్టాండర్డ్ వార్తాపత్రికలో వచ్చిన ఒక వార్తాకథనాన్ని ఆయన ఈ సందర్భంగా పంచుకొన్నారు. 

 

కేంద్ర మంత్రి ఎక్స్’ లో పొందుపరచిన అంశానికి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ:

‘‘ఇది నిజంగా ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం.  ఎలక్ట్రానిక్స్ లో భారతదేశం సత్తాకు దన్ను గా మన వినూత్న యువ శక్తి నిలుస్తోంది.  ఇది సంస్కరణలకు, @makeinindia కు ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్న మా ప్రాధాన్యానికి ఒక నిరూపణ కూడా ఉంది.

ఇదే జోరును రాబోయే కాలంలో కొనసాగిండానికి భారతదేశం కంకణం కట్టుకొంది’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 2043725) Visitor Counter : 6